Telugu Global
Cinema & Entertainment

ప్రమోషన్స్ కోసం ఇంత న్యూసెన్సా.. విశ్వక్ సేన్ పై కేసు పెట్టండి.. నెటిజన్ల ఫైర్..!

అశోకవనంలో అర్జున కళ్యాణం.. టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా నటించిన సినిమా ఇది. చింత విద్యాసాగర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈ నెల 6వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. దీని కోసం ఈ సినిమా మేకర్స్ ప్రమోషన్స్ కూడా ప్రారంభించారు. అయితే ప్రమోషన్స్ పేరిట హీరో విశ్వక్ సేన్ బృందం నడిరోడ్డుపై ప్రాంక్ వీడియోలు చేసి వాహనదారులను ఇబ్బంది పెట్టడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. హీరో విశ్వక్ సేన్ […]

ప్రమోషన్స్ కోసం ఇంత న్యూసెన్సా.. విశ్వక్ సేన్ పై కేసు పెట్టండి.. నెటిజన్ల ఫైర్..!
X

అశోకవనంలో అర్జున కళ్యాణం.. టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా నటించిన సినిమా ఇది. చింత విద్యాసాగర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈ నెల 6వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. దీని కోసం ఈ సినిమా మేకర్స్ ప్రమోషన్స్ కూడా ప్రారంభించారు. అయితే ప్రమోషన్స్ పేరిట హీరో విశ్వక్ సేన్ బృందం నడిరోడ్డుపై ప్రాంక్ వీడియోలు చేసి వాహనదారులను ఇబ్బంది పెట్టడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. హీరో విశ్వక్ సేన్ పై కేసు పెట్టాలని వారు పోస్ట్ లు పెడుతున్నారు.

ప్రాంక్ పేరిట విశ్వక్ సేన్ బృందం ఏం చేసిందంటే.. నిన్న హైదరాబాద్లోని ఫిలింనగర్ ప్రధాన రోడ్డులో హీరో విశ్వక్ సేన్ కారుకు అడ్డంగా ఓ యువకుడు పడుకున్నాడు. విశ్వక్ సేన్ కారు దిగి వచ్చి ఏమైంది అని.. ఆ యువకుడిని అడుగగా.. అల్లం అర్జున్ కుమార్ ఎక్కడ.. అతడు నాకు కావాలి.. అంటూ సదరు యువకుడు హంగామా చేశాడు. అర్జున్ కి 33 సంవత్సరాలు వచ్చినా ఇప్పటికీ పెళ్లి కాలేదని.. ఆంధ్ర తెలంగాణ, అమ్మాయిల సాక్షిగా అర్జున్ కి పెళ్లి కానందుకు ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకుంటానని హడావుడి చేశాడు.

యువకుడు క్యాన్ పట్టుకొని ఒంటిపై పెట్రోలు పోసుకుంటుండటంతో అక్కడ ఏదో జరుగుతోందని ప్రయాణికులు తమ వాహనాలను రోడ్డుపై ఆపారు. వీటి వెనకాల మరి కొన్ని వాహనాలు నిలిచిపోయాయి. కొంతమంది ఆ హడావుడి జరుగుతున్న చోట గుమికూడారు. వాహనాలన్నీ నిలిచిపోవడంతో హీరో విశ్వక్ సేన్, అతడి బృందం అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత తెలిసింది అక్కడి వాళ్లకు అదొక ప్రాంక్ వీడియో అని.

అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాలో హీరో విశ్వక్ సేన్ క్యారెక్టర్ పేరు అల్లం అర్జున్ కుమార్. అతడికి పెళ్లి కాకుంటే చచ్చిపోతా.. అంటూ ప్రాంక్ పేరిట నడిరోడ్డుపై రచ్చ చేశారు. సినిమా ప్రమోషన్లలో భాగంగానే చిత్ర బృందం ఈ ప్రాంక్ వీడియో చేసింది. ఇది తెలుసుకున్న నెటిజన్లు సినిమా ప్రమోషన్ల కోసం ఇంతలా దిగజారాలా.. నడిరోడ్డుపై జనాల్ని అంతగా ఇబ్బంది పెట్టాలా.. అని మండిపడుతున్నారు. ఐపీసీ 268 కింద విశ్వక్ సేన్ పై కేసు నమోదు చేయాలని కొంత మంది నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు.

First Published:  2 May 2022 1:22 AM GMT
Next Story