Telugu Global
Cinema & Entertainment

హిట్ -2 రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..!

యువ హీరో విశ్వక్ సేన్ నటించిన ‘హిట్’ మూవీ మంచి విజయం నమోదు చేసిన విషయం తెలిసిందే. హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అనేది హిట్ ఫుల్ ఫామ్.. థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నది. ఆద్యంతం ట్విస్ట్ లతో ఉత్కంఠభరితంగా ముందుకు సాగింది. లాక్ డౌన్ కు కొద్దిరోజుల ముందు విడుదలైన ఈ సినిమా విశ్వక్ సేన్ కు మంచి పేరు తీసుకొచ్చింది. ఈ చిత్రానికి కొన్ని నెలల కిందట సీక్వెల్ ప్రారంభించిన […]

హిట్ -2 రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..!
X

యువ హీరో విశ్వక్ సేన్ నటించిన ‘హిట్’ మూవీ మంచి విజయం నమోదు చేసిన విషయం తెలిసిందే. హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అనేది హిట్ ఫుల్ ఫామ్.. థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నది. ఆద్యంతం ట్విస్ట్ లతో ఉత్కంఠభరితంగా ముందుకు సాగింది. లాక్ డౌన్ కు కొద్దిరోజుల ముందు విడుదలైన ఈ సినిమా విశ్వక్ సేన్ కు మంచి పేరు తీసుకొచ్చింది.

ఈ చిత్రానికి కొన్ని నెలల కిందట సీక్వెల్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో హీరో మారాడు. హిట్ -2లో అడివి శేష్ హీరోగా నటిస్తున్నాడు. హిట్ కు దర్శకత్వం వహించిన శైలేష్ కొలను సీక్వెల్ ను కూడా తెరకెక్కించాడు. ‘హిట్’ ది సెకండ్ కేస్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాని ప్రశాంతి త్రిపురనేని నిర్మిస్తుండగా.. నేచురల్ స్టార్ నానీ ఈ సినిమాకి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. జూలై 29 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.

క్షణం, గూఢచారి, ఎవరు వంటి ఇన్వెస్టిగేషన్ చిత్రాల్లో అడివి శేష్ నటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అదే తరహా సినిమాలో మరోసారి నటిస్తున్నాడు. మొదటి పార్ట్ కంటే రెండో పార్ట్ ఇంకా ఉత్కంఠభరితంగా ఉంటుందని దర్శకుడు చెప్పారు. ఈ మూవీ ఏ మేరకు అలరిస్తుందో వేచి చూడాలి. ఇక అడివి శేష్ ఈ సినిమా తో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మాణంలో మేజర్ అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ జూన్ 3వ తేదీన విడుదల కాబోతోంది.

First Published:  2 May 2022 9:32 AM GMT
Next Story