Telugu Global
NEWS

తల అలా వచ్చి .. చెన్నైని ఇలా గెలిపించాడు..!

మహేంద్రసింగ్ ధోని కెప్టెన్ గా అలా వచ్చాడో లేదో.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గెలుపు బాట పట్టింది. భారత క్రికెట్ కు ఒక వన్డే వరల్డ్ కప్, ఒక టీ-20 వరల్డ్ కప్, ఒక చాంపియన్స్ ట్రోఫీ అందించిన ఘనత ధోనీది. ఐపీఎల్ లో కూడా చెన్నై కెప్టెన్ గా ధోని విజయవంతమయ్యాడు. ఆ జట్టును ఏకంగా నాలుగు సార్లు చాంపియన్ గా నిలబెట్టాడు. 2008 నుంచి చెన్నై జట్టు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న ధోనీ […]

తల అలా వచ్చి .. చెన్నైని ఇలా గెలిపించాడు..!
X

మహేంద్రసింగ్ ధోని కెప్టెన్ గా అలా వచ్చాడో లేదో.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గెలుపు బాట పట్టింది. భారత క్రికెట్ కు ఒక వన్డే వరల్డ్ కప్, ఒక టీ-20 వరల్డ్ కప్, ఒక చాంపియన్స్ ట్రోఫీ అందించిన ఘనత ధోనీది. ఐపీఎల్ లో కూడా చెన్నై కెప్టెన్ గా ధోని విజయవంతమయ్యాడు. ఆ జట్టును ఏకంగా నాలుగు సార్లు చాంపియన్ గా నిలబెట్టాడు. 2008 నుంచి చెన్నై జట్టు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న ధోనీ ఈ సీజన్లో మాత్రం కెప్టెన్సీకి దూరంగా ఉన్నాడు. తన వారసుడిగా జడేజాకు బాధ్యతలు అప్పగించాడు.

అయితే ఈ సీజన్లో చెన్నై జట్టు జడేజా సార‌థ్యంలో సరైన ప్రభావం చూపలేదు. ఎనిమిది మ్యాచులు ఆడి రెండింట మాత్రమే సీఎస్కే విజయం సాధించింది. దీంతో సీఎస్కే యాజమాన్యం మళ్లీ ధోనికే చెన్నై సూపర్ కింగ్స్ సారథ్య బాధ్యతలు అప్పగించింది.

నిన్న రాత్రి జరిగిన మ్యాచ్ లో ధోనీ మళ్లీ చెన్నై జట్టుకు గెలుపు రుచి చూపించాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై తన సత్తా చాటి విజయాన్ని అందుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ రుత్ రాజ్ గైక్వాడ్ 57 బంతుల్లో 99(6 ఫోర్లు, 6 సిక్సర్లు), కాన్వే 55 బంతుల్లో 85 నాటౌట్(8 ఫోర్లు, 4 సిక్సర్లు ) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 202 పరుగుల భారీ స్కోరు చేసింది.

ఛేదనలో హైదరాబాద్ జట్టు 189 పరుగులు మాత్రమే చేయడంతో 13 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. హైదరాబాద్ కెప్టెన్ విలియమ్సన్ (47), అభిషేక్ శర్మ(39) రాణించినా.. నికోలస్ పూరన్ 33 బంతుల్లో 64(3 ఫోర్లు, 6 సిక్సర్లు) చెలరేగినా విజయం మాత్రం అందుకోలేకపోయింది. తమిళనాడులో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అభిమానులు ధోనీని తల అని ముద్దుగా పిలుచుకుంటారు. ఇప్పుడు వారు తల అలా కెప్టెన్ అయ్యాడో లేదో ఇలా గెలుపు అందించాడని మురిసిపోతున్నారు.

First Published:  2 May 2022 1:00 AM GMT
Next Story