Telugu Global
Others

'వేసవి'.. కాలం మారుతోందా..?

సాధారణంగా వేసవిలో.. అంటే మే నెలలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. ఏప్రిల్ తో పోల్చి చూస్తే మే లోనే ఎండలు మండిపోతాయి. ఈ ఏడాది ఏప్రిల్ లోనే ఉగ్రరూపం దాల్చిన సూర్యుడు.. మేలో ఇంకెంత భయపెడతాడోననే అనుమానాలున్నాయి. కానీ ఈ ఏడాది వరకు మే నెల కూల్ కూల్ గా వెళ్లిపోతుందని అంచనా వేస్తోంది భారత వాతావరణ శాఖ(ఐఎండీ). ఏపీకి సంబంధించి పగటి ఉష్ణోగ్రతలు మే నెలలో సాధారణం లేదా అంతకంటే తక్కువగా నమోదవుతాయని ఐఎండీ వెల్లడించింది. […]

వేసవి.. కాలం మారుతోందా..?
X

సాధారణంగా వేసవిలో.. అంటే మే నెలలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. ఏప్రిల్ తో పోల్చి చూస్తే మే లోనే ఎండలు మండిపోతాయి. ఈ ఏడాది ఏప్రిల్ లోనే ఉగ్రరూపం దాల్చిన సూర్యుడు.. మేలో ఇంకెంత భయపెడతాడోననే అనుమానాలున్నాయి. కానీ ఈ ఏడాది వరకు మే నెల కూల్ కూల్ గా వెళ్లిపోతుందని అంచనా వేస్తోంది భారత వాతావరణ శాఖ(ఐఎండీ). ఏపీకి సంబంధించి పగటి ఉష్ణోగ్రతలు మే నెలలో సాధారణం లేదా అంతకంటే తక్కువగా నమోదవుతాయని ఐఎండీ వెల్లడించింది. ఇదే నెలలో వర్షపాతం సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశముందని తెలిపింది. అంటే.. ఏప్రిల్ లో ఉన్నంత ఉక్కపోత మేలో ఉండదు, పైగా ఊరట లభిస్తుందని ఐఎండీ చెప్పడం నిజంగా శుభవార్తే.

మే నెలకు సంబంధించిన వాతావరణ బులిటెన్ ను విడుదల చేస్తూ.. ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతాయని చెప్పింది ఐఎండీ. నేటినుంచి మొదలవుతున్న మే నెలలో వాయువ్య, మధ్య, తూర్పు భారతంలో ఎండలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. పగటి ఉష్టోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయని తెలిపింది. అయితే ఇదే నెలలో దేశంలోని అనేక ఇతర ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని కూడా ఐఎండీ నివేదిక చెప్పడం విశేషం. ముఖ్యంగా ఏపీలో వాతావరణం చల్లబడుతుందని తీపి కబురు చెప్పింది ఐఎండీ

ఏప్రిల్ రికార్డ్ బ్రేక్..
ఈ ఏడాది ఏప్రిల్ అత్యంత వేడి నెలగా రికార్డ్ సృష్టించింది. గడిచిన 122 సంవత్సరాలలో ఏప్రిల్ లో ఈ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇదే తొలిసారి. వాయువ్య భారతంలో ఏప్రిల్ సగటు గరిష్ట ఉష్ణోగ్రత 35.9 డిగ్రీలుగా నమోదైంది. మధ్య భారతంలో 37.78 డిగ్రీల సగటు గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఏడాది ఏప్రిల్‌ లో ఎండ తీవ్రత, వడగాల్పులకు ప్రధాన కారణం వర్షాభావ పరిస్థితులేనని వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఏప్రిల్ లో ఉన్న వేడి, మేలో దాదాపు తగ్గిపోతుందని అంచనా వేస్తోంది. ఈనెల 4న దక్షిణ అండమాన్‌ సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుందని, దాని ప్రభావంతో 5వతేదీన అల్పపీడనం ఏర్పడుతుందని, ఆ తర్వాత అది క్రమేపీ బలపడి.. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడతాయని చెప్పింది. అయితే అల్పపీడనం దిశ మార్చుకుంటే మాత్రం ఏపీలో కూడా ఉక్కపోత తప్పదు. ఏదేమైనా.. ఏప్రిల్ లో ఉగ్రరూపం చూపించిన భానుడు, మే లో శాంతించబోతున్నాడనే ఐఎండీ నివేదిక ఊరటనిస్తోంది.

First Published:  30 April 2022 11:45 PM GMT
Next Story