Telugu Global
Cinema & Entertainment

శ్రద్ధా శ్రీనాధ్.. తెలుగులో మరో సినిమా

టాలీవుడ్ లో శ్రద్ధా శ్రీనాధ్ కెరీర్ పెద్దగా వెలగడం లేదు. జెర్సీ లాంటి సక్సెస్ ఆమెకు కలిసిరాలేదు. ఆ తర్వాత ఓటీటీలో వచ్చిన కృష్ణ అండ్ హిజ్ లీలా సినిమా కుడా ఈమె కెరీర్ కు కలిసిరాలేదు. అలా నిదానంగా సాగుతున్న ఆమె కెరీర్ లోకి ఇప్పుడు మరో తెలుగు సినిమా వచ్చి చేరింది. దీని పేరు విట్ నెస్. ఈ బహుభాషా చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్, రోహిణి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. నగరంలో ప్రతిరోజూ ఏదో […]

శ్రద్ధా శ్రీనాధ్.. తెలుగులో మరో సినిమా
X

టాలీవుడ్ లో శ్రద్ధా శ్రీనాధ్ కెరీర్ పెద్దగా వెలగడం లేదు. జెర్సీ లాంటి సక్సెస్ ఆమెకు కలిసిరాలేదు. ఆ తర్వాత ఓటీటీలో వచ్చిన కృష్ణ అండ్ హిజ్ లీలా సినిమా కుడా ఈమె కెరీర్ కు కలిసిరాలేదు. అలా నిదానంగా సాగుతున్న ఆమె కెరీర్ లోకి ఇప్పుడు మరో తెలుగు సినిమా వచ్చి చేరింది. దీని పేరు విట్ నెస్.

ఈ బహుభాషా చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్, రోహిణి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. నగరంలో ప్రతిరోజూ ఏదో ఒక నేరం గురించి వింటుంటాం, మరుసటి రోజు మరచిపోతుంటాం. ఇది కూడా అలాంటి నేరమే. కానీ కొన్ని కారణాలు ఈ నేరాన్ని మరచిపోనివ్వకుండా చేస్తున్నాయి. దీనిపై జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ మంచితనం ముసుగేసుకున్న ఎందరో నిజస్వరూపాలను బహిర్గతం చేస్తుంది. పారిశుద్ధ్య కార్మికుల కేంద్రంగా రూపొందుతోన్న ఈ బహుభాషా చిత్రం మెట్రోపాలిటన్ నగరాలు, వాటి కింద ఉన్న రహస్యాల్ని బయటపెడుతుంది.

మే డే శుభాకాంక్షలు తో తాజాగా విడుదల చేసిన ‘విట్ నెస్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఇందులో శ్రద్ధా శ్రీనాథ్, రోహిణి ఏదో విపత్కర పరిస్థితిలో చిక్కుకున్నట్లుగా కనిపిస్తున్నారు. అలాగే డ్రైనేజ్ పిట్ నుంచి సాయం కోరుతున్నట్లుగా ఒక చెయ్యి కనిపించడం పోస్టర్ లో చూడొచ్చు.

ఈ సినిమా షూటింగ్ ఆల్రెడీ పూర్తయింది. ప్రముఖ నిర్మాత టి.జి విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దీపక్ ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ గానూ, దర్శకుడిగానూ పని చేసున్నాడు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తారు.

First Published:  1 May 2022 5:32 AM GMT
Next Story