Telugu Global
NEWS

ప్రపంచంలోనే రెండో అతిపెద్ద గూగుల్ క్యాంపస్ హైదరాబాద్‌లో.. శంకుస్థాపన చేసిన కేటీఆర్

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ మరో అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నది. ఇప్పటికే ఐటీ రంగంలో శరవేగంగా దూసుకొని పోతూ, సాఫ్ట్‌వేర్ ఎగుమతుల్లో దేశంలో బెంగళూరు తర్వాత స్థానాన్ని పొందిన హైదరాబాద్‌లో గూగుల్ అతిపెద్ద పర్మనెంట్ క్యాంపస్ నిర్మించనున్నది. గూగుల్ ప్రధాన కార్యాలయం తర్వాత ఇదే అతిపెద్ద ఆఫీస్ కానున్నది. అంతే కాకుండా అమెరికా వెలుపల గూగుల్‌కు ఇదే అతిపెద్ద కార్యాలయంగా మారనున్నది. నానక్‌రామ్ గూడలో 7.3 ఎకరాల్లో నిర్మించనున్న ఈ క్యాంపస్‌కు గురువారం ఐటీ, పరిశ్రమల శాఖమంత్రి కేటీఆర్ […]

ప్రపంచంలోనే రెండో అతిపెద్ద గూగుల్ క్యాంపస్ హైదరాబాద్‌లో.. శంకుస్థాపన చేసిన కేటీఆర్
X

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ మరో అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నది. ఇప్పటికే ఐటీ రంగంలో శరవేగంగా దూసుకొని పోతూ, సాఫ్ట్‌వేర్ ఎగుమతుల్లో దేశంలో బెంగళూరు తర్వాత స్థానాన్ని పొందిన హైదరాబాద్‌లో గూగుల్ అతిపెద్ద పర్మనెంట్ క్యాంపస్ నిర్మించనున్నది. గూగుల్ ప్రధాన కార్యాలయం తర్వాత ఇదే అతిపెద్ద ఆఫీస్ కానున్నది. అంతే కాకుండా అమెరికా వెలుపల గూగుల్‌కు ఇదే అతిపెద్ద కార్యాలయంగా మారనున్నది. నానక్‌రామ్ గూడలో 7.3 ఎకరాల్లో నిర్మించనున్న ఈ క్యాంపస్‌కు గురువారం ఐటీ, పరిశ్రమల శాఖమంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు.

30 లక్షల 30 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో గూగుల్‌ శాశ్వత క్యాంపస్ నిర్మించనున్నది. ఇక ఇప్పటికే గచ్చిబౌలిలో అమెజాన్, మైక్రోసాఫ్ట్, యాపిల్ వంటి సంస్థలకు భారీ క్యాంపస్‌లు ఉన్నాయి. వాటికి తోడు ఇప్పుడు గూగుల్ క్యాంపస్ రానున్నది. గత కొన్నేళ్లుగా హైదరాబాద్‌లో భారీ క్యాంపస్‌ల నిర్మాణానికి బడా ఐటీ కంపెనీలు ముందుకు వస్తున్నాయి. దీంతో దేశంలోని వాళ్లకే కాకుండా స్థానిక యువతకు కూడా ఉద్యోగాలు లభిస్తున్నాయి. ఇప్పటికే గూగుల్‌తో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నది. దీని వల్ల ఐటీ ఆటోమేషన్, యూఎక్స్ డిజైన్, డాటా అనలిటిక్స్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ రంగాల్లో యువతకు శిక్షణ ఇచ్చే అవకాశం ఏర్పడింది. ఇక వీ-హబ్‌తో కలిసి మహిళా పారిశ్రామికవేత్తలు, ఎంఎస్ఎంఈ పరిశ్రమల స్థాపనకు ఆర్థిక, నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు ఉపయోగపడుతుంది.

ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీగా పేరున్న గూగుల్.. ఇండియాలో కార్యాకలాపాలు ప్రారంభించిన దగ్గర నుంచి హైదరాబాద్‌నే కేంద్రంగా చేసుకున్నది. రాబోయే రోజుల్లో తెలంగాణలో కంపెనీని మరింతగా విస్తరిస్తామని గూగుల్ ఇండియా కంట్రీ హెడ్, వైస్ ప్రెసిడెంట్ సంజయ్ గుప్తా అన్నారు. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు.

First Published:  28 April 2022 10:48 PM GMT
Next Story