Telugu Global
National

ఢిల్లీలో కరెంటు కోతలు.. బొగ్గు కొరతతో అవస్థలు..

ఢిల్లీలో కరెంటు కోతలు మొదలయ్యాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయంతో ప్రజలు, చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసుకున్నవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేసవి కావడంతో విద్యుత్ డిమాండ్ విపరీతంగా పెరిగింది. దానికి తగినట్టు సరఫరా మెరుగు కాలేదు. దీంతో విద్యుత్ అంతరాయాలు ఎక్కువయ్యాయి. డిమాండ్‌ కు తగ్గట్టుగా విద్యుత్‌ ఉత్పత్తి చేసేందుకు బొగ్గు కొరత సమస్యగా మారిందని ప్రభుత్వం చెబుతోంది. ఢిల్లీ, పరిసర ప్రాంతాలకు సరఫరా అయ్యే విద్యుత్ లో 25నుంచి 30శాతం ప్రధానంగా […]

ఢిల్లీలో కరెంటు కోతలు.. బొగ్గు కొరతతో అవస్థలు..
X

ఢిల్లీలో కరెంటు కోతలు మొదలయ్యాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయంతో ప్రజలు, చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసుకున్నవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేసవి కావడంతో విద్యుత్ డిమాండ్ విపరీతంగా పెరిగింది. దానికి తగినట్టు సరఫరా మెరుగు కాలేదు. దీంతో విద్యుత్ అంతరాయాలు ఎక్కువయ్యాయి. డిమాండ్‌ కు తగ్గట్టుగా విద్యుత్‌ ఉత్పత్తి చేసేందుకు బొగ్గు కొరత సమస్యగా మారిందని ప్రభుత్వం చెబుతోంది.

ఢిల్లీ, పరిసర ప్రాంతాలకు సరఫరా అయ్యే విద్యుత్ లో 25నుంచి 30శాతం ప్రధానంగా రెండు థర్మల్ పవర్ స్టేషన్లనుంచే సరఫరా అవుతుంది. దాద్రి-2, ఊంచహార్‌ ప్లాంట్ల నుంచి ఢిల్లీకి విద్యుత్ సరఫరా అవుతుంది. అయితే ఈ థర్మల్ పవర్ స్టేషన్లలో బొగ్గు కొరత తీవ్రంగా ఉంది. వీటి వద్ద బొగ్గు నిల్వలు కూడా రోజు రోజుకీ తగ్గిపోతున్నాయి. బొగ్గు కొరత కారణంగా విద్యుత్ ఉత్పత్తికి తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. దీంతో తక్షణమే ఢిల్లీకి బొగ్గు సరఫరా పెంచాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు విద్యుత్‌ శాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.

అత్యవసర సేవలకు విఘాతం..
వేసవిలో కరెంటు కష్టాలు సహజమే. దక్షిణాది రాష్ట్రాల్లో కూడా డిమాండ్ కి తగ్గ సప్ల‌య్ లేకపోవడంతో కరెంటు కోతలు తప్పడంలేదు. అయితే ఢిల్లీలో సమస్యలు అంతకు మించి చుట్టుముట్టే ప్రమాదం ఉంది. ఢిల్లీలోని ఆస్పత్రులు, మెట్రో స్టేషన్ల వంటి అత్యవసర సేవలకు కూడా విఘాతం కలిగే అవకాశముంది. మెట్రో స్టేషన్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోతే రవాణా సేవలకు అంతరాయం ఏర్పడుతుంది. ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆస్పత్రులకు 24గంటల నిరంతర విద్యుత్ అందించే అవకాశం కూడా తక్కువవుతుంది. దీంతో అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.

కేంద్రం నష్టనివారణ చర్యలు..
దేశ రాజధానిలో మెట్రో స్టేషన్లకు విద్యుత్ ఆగిపోతే, ఆస్పత్రుల్లో కరెంటు పోతే.. అది మరీ పరువు తక్కువ వ్యవహారంగా ఉంటుంది. అందుకే ఢిల్లీకి బొగ్గు సరఫరా పెంచేందుకు కేంద్రం ప్రయత్నాలు మొదలుపెట్టింది. బొగ్గు రవాణా చేసే గూడ్స్ రైళ్లకోసం.. కొన్ని ప్యాసింజర్ రైళ్లను కూడా రైల్వే శాఖ రద్దు చేసింది. యుద్ధ ప్రాతిపదికన ఢిల్లీకి బొగ్గు సరఫరా చేస్తోంది.

First Published:  29 April 2022 1:53 AM GMT
Next Story