Telugu Global
CRIME

ఉత్కంఠకు తెర.. ఉరిశిక్ష ఖరారు..

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బీటెక్ విద్యార్థిని రమ్య హత్యకేసులో గుంటూరు ప్రత్యేక కోర్టు నిందితుడికి ఉరిశిక్ష ఖరారు చేసింది. ఈనెల 26న ఈ కేసుకి సంబంధించి విచారణ పూర్తయింది. ఈరోజు నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది కోర్టు. గుంటూరు పరమయ్యకుంటకు చెందిన బీటెక్ విద్యార్థిని రమ్య హత్య సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సోషల్ మీడియా ద్వారా రమ్యకు కుంచాల శశికృష్ణతో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అతను ప్రేమ పేరుతో రమ్యని వేధించాడు. తనతో […]

ఉత్కంఠకు తెర.. ఉరిశిక్ష ఖరారు..
X

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బీటెక్ విద్యార్థిని రమ్య హత్యకేసులో గుంటూరు ప్రత్యేక కోర్టు నిందితుడికి ఉరిశిక్ష ఖరారు చేసింది. ఈనెల 26న ఈ కేసుకి సంబంధించి విచారణ పూర్తయింది. ఈరోజు నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది కోర్టు.

గుంటూరు పరమయ్యకుంటకు చెందిన బీటెక్ విద్యార్థిని రమ్య హత్య సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సోషల్ మీడియా ద్వారా రమ్యకు కుంచాల శశికృష్ణతో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అతను ప్రేమ పేరుతో రమ్యని వేధించాడు. తనతో మాట్లాడటం మానేసిందన్న కోపం, తన ఫోన్ నంబర్‌ ను బ్లాక్ లిస్టులో పెట్టిందన్న కోపంతో గతేడాది ఆగస్టు 15న నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా రమ్యను కత్తితో పొడిచి హత్య చేశాడు శశికృష్ణ. సీసీ కెమెరాల్లో ఈ ఘటన రికార్డ్ అయింది. శశికృష్ణను 24 గంటల్లోనే నరసరావుపేట సమీపంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత డిసెంబర్‌ నుంచి కేసు విచారణ ప్రారంభమైంది.

డీఎస్పీ రవికుమార్ ఆధ్వర్వంలో పోలీసులు 36 మందిని విచారించి 15రోజుల్లో ఛార్జిషీట్ దాఖలు చేశారు. ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్డు ఈ కేసులో వాదనలు విన్నది. సీసీ టీవీ వీడియో ఫుటేజి ఈ కేసులో కీలక సాక్ష్యంగా మారింది. ఈనెల 26న తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు ఈరోజు తీర్పు వెలువరించింది. తీర్పు వెలువరించడానికి ముందుగా నిందితుడిని చివరిగా చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా అని జడ్జి ప్రశ్నించారు. తన తల్లిదండ్రులు అనారోగ్యంతో ఉన్నారని, వారిని చూసుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని చెప్పాడు నిందితుడు శశికృష్ణ. ఆ తర్వాత తీర్పుని మధ్యాహ్నానికి వాయిదా వేసింది కోర్టు. ఉరి శిక్ష విధిస్తూ కాసేపటి క్రితం తీర్పు వెలువరించింది.

First Published:  29 April 2022 5:40 AM GMT
Next Story