Telugu Global
NEWS

భార్యకు భారీ భరణంతో దివాళా!.. టెన్నిస్ దిగ్గజానికి జైలు శిక్ష

జర్మన్ టెన్నిస్ దిగ్గజం, ఆరు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ విజేత బోరిస్ బెకర్ 54 సంవత్సరాల వయసులో పీకలోతు కష్టాలలో కూరుకుపోయాడు. టెన్నిస్ ఆటగాడిగా సంపాదించిన వందలకోట్ల రూపాయలు వివిధ రూపాలలో నష్టపోయి దివాళా ప్రకటించినా.. బ్రిటీష్ కోర్టులు మాత్రం విడిచిపెట్టలేదు. ఇంగ్లండ్ లోని 14 వేర్వేరు కోర్టుల్లో బెకర్ 20 రకాల ఆరోపణలు ఎదుర్కొంటూ విచారణకు హాజరవుతూ వస్తున్నాడు. విడాకుల కారణంగా భార్యకు భారీగా భరణం చెల్లించడం ద్వారా బెకర్ నిలువునా మునిగిపోయాడు. 17 ఏళ్ల […]

భార్యకు భారీ భరణంతో దివాళా!.. టెన్నిస్ దిగ్గజానికి జైలు శిక్ష
X

జర్మన్ టెన్నిస్ దిగ్గజం, ఆరు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ విజేత బోరిస్ బెకర్ 54 సంవత్సరాల వయసులో పీకలోతు కష్టాలలో కూరుకుపోయాడు. టెన్నిస్ ఆటగాడిగా సంపాదించిన వందలకోట్ల రూపాయలు వివిధ రూపాలలో నష్టపోయి దివాళా ప్రకటించినా.. బ్రిటీష్ కోర్టులు మాత్రం విడిచిపెట్టలేదు. ఇంగ్లండ్ లోని 14 వేర్వేరు కోర్టుల్లో బెకర్ 20 రకాల ఆరోపణలు ఎదుర్కొంటూ విచారణకు హాజరవుతూ వస్తున్నాడు. విడాకుల కారణంగా భార్యకు భారీగా భరణం చెల్లించడం ద్వారా బెకర్ నిలువునా మునిగిపోయాడు.

17 ఏళ్ల వయసులోనే సంచలన..
1980 దశకంలో ప్రపంచ టెన్నిస్ రారాజుగా వెలుగొందిన బూమ్ బూమ్ బోరిస్ బెకర్ కేవలం 17 సంవత్సరాల చిరుప్రాయంలోనే.. అన్ సీడెడ్ ఆటగాడిగా వింబుల్డన్ టైటిల్ నెగ్గడం ద్వారా చరిత్ర సృష్టించడమే కాదు.. ప్రపంచ దృష్టినే ఆకర్షించాడు. బుల్లెట్ లాంటి సెర్వ్, అగ్గిపిడుగుల్లాంటి గ్రౌండ్ స్ట్రైక్‌ లతో చెలరేగిపోయిన బెకర్.. తన కెరియర్ లో మొత్తం ఆరు గ్రాండ్ స్లామ్ టైటిల్స్, పలు మాస్టర్స్ టైటిల్స్ నెగ్గడం ద్వారా..భారీగా ఆర్జించాడు. ప్రైజ్ మనీ, ఎండార్స్ మెంట్ల ద్వారానే కోట్ల రూపాయలు సంపాదించాడు.

గాడితప్పిన వ్యక్తిగత జీవితం..
బెకర్ గొప్ప ఆటగాడే కానీ.. ఆర్థిక క్రమశిక్షణ లేకపోడం, అమ్మాయిల వలలో చిక్కుకోవ‌డం వంటి కారణాలతో తీవ్రంగా నష్టపోయాడు. అందినకాడికి అప్పులు చేయడమే కాదు.. ఓ బహుళజాతి కంపెనీలో షేర్ హోల్డర్ గా ఉంటూనే తన బిజినెస్ అకౌంట్ ద్వారా 8 లక్షల 25వేల యూరోల మొత్తాన్ని.. వేరే చోటుకు తరలించిన కేసులో దోషిగా తేలాడు. ఆ తరువాత 2017లో తాను దివాళా తిసినట్లుగా కూడా ప్రకటించాడు. అయితే.. విచారణ జరుపుతున్న వివిధ కోర్టులు మాత్రం..అతను సాధించిన ఆరు గ్రాండ్ స్లామ్ టెన్నిస్ ట్రోఫీలు, పతకాలు, ఇతర జ్ఞాపికలను తమ స్వాధీనం చేయాలంటే.. తీర్పునిచ్చినా బెకర్ ఖాతరు చేయలేదు. దీనితో ఆగ్రహం చెందిన సౌత్ లండన్ లోని ఓ కోర్టు బెకర్ కు శిక్ష ఖరారు చేసింది.

భార్యకు భరణంతో దివాళా
తన మొదటి భార్య బార్బరా బెకర్ కు విడాకులు ఇవ్వడంతో బెకర్ భారీగా భరణం, పిల్లల ఖర్చుకోసం చెల్లించాల్సి వచ్చింది. టెన్నిస్ తో పాటు వివిధ రూపాలలో తాను ఆర్జించిన 5 కోట్ల డాలర్లు తన భార్య భరణానికి, పిల్లల కోసమే వ్యయం చేశానని, అప్పులు తీర్చే స్థితిలో లేనంటూ దివాళా ప్రకటించాడు. స్పెయిన్ లోని మొలార్కాలో తనపేరుతో ఉన్న ఓ ఎస్టెట్ లోను 30 లక్షల యూరోల మొత్తం చెల్లించకుండా బెకర్ ఎగవేతకు పాల్పడ్డాడు. 2012 నుంచి లండన్ లో నివాసం ఉంటున్న బెకర్.. విలాసవంతమైన జీవితం, అడ్డు అదుపులేని ఖర్చుతో పాతాళానికి పడిపోయాడు. 1999లో టెన్నిస్ కు రిటైర్మెంట్ ప్రకటించిన బెకర్.. ఆ తర్వాత నుంచి టెన్నిస్ వాఖ్యాతగా, నొవాక్ జోకోవిచ్ వ్యక్తిగత శిక్షకునిగా వ్యవహరిస్తూ వస్తున్నాడు. స్విట్జర్లాండ్ లో సైతం కోట్ల రూపాయల మేర అప్పులు చేసిన బెకర్.. అక్కడి కోర్టుల్లోనూ దివాళా ప్రకటించాడు. బెకర్ సుదీర్ఘగాలం జైలుశిక్ష అనుభవించక తప్పదని న్యాయనిపుణులు చెబుతున్నారు.

First Published:  29 April 2022 1:01 AM GMT
Next Story