Telugu Global
NEWS

ఐపీఎల్ చరిత్రలో ఒకేఒక్కడు!.. డేవిడ్ వార్నర్ అరుదైన రికార్డు

టాటా ఐపీఎల్ 15వ సీజన్ రౌండ్ రాబిన్ లీగ్ లో రికార్డుల మోత మోగుతోంది. ముంబై వాంఖడే స్టేడియం వేదికగా కోల్ కతా నైట్ రైడర్స్ తో ముగిసిన పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఓ అరుదైన ఘనతను సంపాదించాడు. నువ్వానేనా అన్నట్లుగా సాగిన ఈ లోస్కోరింగ్ పోరులో ఢిల్లీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కేవలం 26 బాల్స్ లోనే 8 బౌండ‌రీలతో 42 పరుగులు సాధించడం ద్వారా తనజట్టు విజయంలో ప్రధానపాత్ర […]

ఐపీఎల్ చరిత్రలో ఒకేఒక్కడు!.. డేవిడ్ వార్నర్ అరుదైన రికార్డు
X

టాటా ఐపీఎల్ 15వ సీజన్ రౌండ్ రాబిన్ లీగ్ లో రికార్డుల మోత మోగుతోంది. ముంబై వాంఖడే స్టేడియం వేదికగా కోల్ కతా నైట్ రైడర్స్ తో ముగిసిన పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఓ అరుదైన ఘనతను సంపాదించాడు. నువ్వానేనా అన్నట్లుగా సాగిన ఈ లోస్కోరింగ్ పోరులో ఢిల్లీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కేవలం 26 బాల్స్ లోనే 8 బౌండ‌రీలతో 42 పరుగులు సాధించడం ద్వారా తనజట్టు విజయంలో ప్రధానపాత్ర వహించాడు. అంతేకాదు ఈ క్రమంలో..కోల్ కతా నైట్ రైడర్స్ ప్రత్యర్థిగా వెయ్యి పరుగులు పూర్తి చేయగలిగాడు.


తొలి బ్యాటర్ వార్నర్..
ఐపీఎల్ గత 15 సీజన్ల చరిత్రలో రెండు వేర్వేరు ప్రత్యర్థిజట్లపై వెయ్యికి పైగా పరుగులు సాధించిన తొలి, ఏకైక ఆటగాడి ఘనతను డేవిడ్ వార్నర్ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుత 15వ సీజన్లో తన జట్టు తరఫున ఇప్పటి వరకూ ఆడిన ఆరుమ్యాచ్ ల్లో 261 పరుగులు సాధించడం విశేషం. గతంలో పంజాబ్ కింగ్స్ జట్టుపైన వెయ్యి పరుగుల రికార్డు సాధించిన వార్నర్..ప్రస్తుత సీజన్లో కోల్ కతాపైన అదే రికార్డును నమోదు చేయగలిగాడు. అయితే..ఒక్కో జట్టు ప్రత్యర్థిగా వెయ్యి పరుగులు సాధించిన మొనగాళ్లలో రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ సైతం ఉన్నారు. కోల్ కతా ప్రత్యర్థిగా రోహిత్ శర్మ 1018 పరుగులు, చెన్నై సూపర్ కింగ్స్ పైన శిఖర్ ధావన్ 1029 పరుగులు సాధించగలిగారు. డేవిడ్ వార్నర్ ఒక్కడే..పంజాబ్, కోల్ కతా జట్ల పైన వెయ్యికి పైగా పరుగులు సాధించిన ఒకే ఒక్కడిగా చరిత్ర సృష్టించాడు.

First Published:  29 April 2022 12:05 AM GMT
Next Story