Telugu Global
NEWS

వ్యవసాయం తర్వాత నిర్మాణ రంగంలోనే ఉపాధి అవకాశాలు.. మనకు కరెంటు పుష్కలం : మంత్రి కేటీఆర్

క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షోను తెలంగాణ మంత్రి కేటీఆర్ శుక్రవారం ప్రారంభించారు. మూడు రోజుల పాటు హైటెక్స్ వేదికగా ఈ ఎగ్జిబిషన్ నిర్వహించనున్నారు. రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన పూర్తి వివరాలు, ప్రాపర్టీలు ఇక్కడ ప్రదర్శనలో ఉంచనున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. దేశంలో వ్యవసాయ రంగం తర్వాత అత్యధికంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నది నిర్మాణ రంగమే అని అన్నారు. ఇందులో ఎలాంటి అనుమానాలకు తావు లేదని మంత్రి చెప్పారు. సీఎం కేసీఆర్ ముందు చూపు, సమర్దత […]

వ్యవసాయం తర్వాత నిర్మాణ రంగంలోనే ఉపాధి అవకాశాలు.. మనకు కరెంటు పుష్కలం : మంత్రి కేటీఆర్
X

క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షోను తెలంగాణ మంత్రి కేటీఆర్ శుక్రవారం ప్రారంభించారు. మూడు రోజుల పాటు హైటెక్స్ వేదికగా ఈ ఎగ్జిబిషన్ నిర్వహించనున్నారు. రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన పూర్తి వివరాలు, ప్రాపర్టీలు ఇక్కడ ప్రదర్శనలో ఉంచనున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. దేశంలో వ్యవసాయ రంగం తర్వాత అత్యధికంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నది నిర్మాణ రంగమే అని అన్నారు. ఇందులో ఎలాంటి అనుమానాలకు తావు లేదని మంత్రి చెప్పారు. సీఎం కేసీఆర్ ముందు చూపు, సమర్దత కారణంగా రాష్ట్రంలో కేవలం 6 నెలల్లోనే విద్యుత్ సమస్యను తీర్చారని ఆయన చెప్పారు.

ఇళ్లు, వ్యవసాయం, పరిశ్రమలకు 24 గంటల విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అని మంత్రి స్పష్టం చేశారు. పక్క రాష్ట్రంలో కరెంట్, నీళ్లు లేవని.. అక్కడ రోడ్లన్నీ ధ్వంసమై ఉన్నాయని ఒక మిత్రుడు చెప్పినట్లు కేసీఆర్ వెల్లడించారు. సంక్రాతికి ఊరికి వెళ్తే అక్కడ ఉండలేకపోయానని.. తిరిగి హైదరాబాద్ వచ్చిన తర్వాతే ఊపిరి పీల్చుకున్నట్లు ఆ స్నేహితుడు చెప్పాడంటూ పరోక్షంగా ఏపీపై వ్యాఖ్యలు చేశారు. కావాలంటే మీరూ వెళ్లి చూడండి.. అక్కడ చూసి వస్తే తెలంగాణను అభినందిస్తారు. కొంత మందికి ఈ మాటలు నచ్చకపోవచ్చు. కానీ ఇవే వాస్తవాలు అని కేటీఆర్ అన్నారు.

హైదరాబాద్ నగరానికి దేశంలోని ఎన్నో ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి ఉపాధి పొందుతున్నారు. కానీ మన తెలంగాణ యువత మాత్రం గల్ఫ్‌కు వలస పోతున్నారు. అక్కడ, ఇక్కడ చేసే పనిలో తేడా లేకపోయినా.. కుటుంబాలను విడిచి దూరంగా వెళ్తున్నారు. అసలు లోపం ఎక్కడుందని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ జిల్లాల నుంచి గల్ఫ్‌కు వెళ్లే వారికి ఇక్కడే ఉపాధి కల్పించేలా చొరవ తీసుకోవాలని క్రెడాయ్ ప్రతినిధులకు కేటీఆర్ సూచించారు. కార్మికుల నైపుణ్యాలకు సంబంధించి శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్కతే ప్రభుత్వం తరపున సహకారం అందిస్తామని కేటీఆర్ చెప్పారు. క్రెడాయ్ హైదరాబాద్ దాన్ని ముందుగా ప్రారంభించి ఇతర ప్రాంతాలకు విస్తరిస్తే మంచిదన్నారు.

First Published:  29 April 2022 4:59 AM GMT
Next Story