Telugu Global
NEWS

'దిశ'పై హేళన మానండి.. రుజువులు చూడండి..

గుంటూరులో ఇంజినీరింగ్ విద్యార్థిని రమ్య హత్య కేసులో నిందితుడికి ఉరిశిక్ష ఖరారైన తర్వాత దిశ చట్టం గురించి ఏపీలో మళ్లీ చర్చ మొదలైంది. గుంటూరు కోర్టు ఇచ్చిన తీర్పుపట్ల సీఎం జగన్ హర్షం వ్యక్తం చేశారు. ‘దిశ’ స్ఫూర్తితో ఈ కేసు దర్యాప్తు జరిగిందని గుర్తు చేశారు జగన్. కేసు విచారణలో సమర్థవంతంగా వ్యవహరించిన పోలీసులకు, న్యాయవాదికి అభినందనలు తెలిపారు. మహిళల రక్షణ, భద్రత పట్ల ప్రభుత్వ సంకల్పాన్ని ఈ కేసు చాటి చెప్పిందన్నారు జగన్. అబలలపై […]

దిశపై హేళన మానండి.. రుజువులు చూడండి..
X

గుంటూరులో ఇంజినీరింగ్ విద్యార్థిని రమ్య హత్య కేసులో నిందితుడికి ఉరిశిక్ష ఖరారైన తర్వాత దిశ చట్టం గురించి ఏపీలో మళ్లీ చర్చ మొదలైంది. గుంటూరు కోర్టు ఇచ్చిన తీర్పుపట్ల సీఎం జగన్ హర్షం వ్యక్తం చేశారు. ‘దిశ’ స్ఫూర్తితో ఈ కేసు దర్యాప్తు జరిగిందని గుర్తు చేశారు జగన్. కేసు విచారణలో సమర్థవంతంగా వ్యవహరించిన పోలీసులకు, న్యాయవాదికి అభినందనలు తెలిపారు. మహిళల రక్షణ, భద్రత పట్ల ప్రభుత్వ సంకల్పాన్ని ఈ కేసు చాటి చెప్పిందన్నారు జగన్. అబలలపై అఘాయిత్యాలకు పాల్పడే వారికి తాజా తీర్పు గట్టి సందేశాన్ని పంపిందని అన్నారు జగన్. ఇతర కేసుల దర్యాప్తులో కూడా పోలీసులు ఇదే స్ఫూర్తితో పనిచేసి మహిళల భద్రత, రక్షణకు పెద్దపీట వేయాలన్నారు జగన్.

ఏపీ హోం మంత్రి తానేటి వనిత కూడా ఈ తీర్పుపై సంతోషం వ్యక్తం చేశారు. రమ్య కుటుంబానికి న్యాయం జరిగిందని చెప్పారామె. రమ్య హత్య కేసులో శశి కృష్ణకు ఉరి శిక్ష పడడం చారిత్రకమైన తీర్పు అని అన్నారు. హత్య జరిగిన పది గంటల వ్యవధిలో శశికృష్ణను పోలీసులు అరెస్ట్ చేయడంతో పాటు వారం రోజుల్లో చార్జ్ షీట్ దాఖలు చేశారని ఆమె గుర్తు చేశారు. 8 నెలల వ్యవధిలోనే తీర్పు వచ్చిందని, రమ్య కేసులో తీర్పుపై దిశ చట్టం ప్రభావం ఉందని చెప్పారు తానేటి వనిత.

హేళన చేయడం ఆపండి..
రాష్ట్రంలో ఆడ పిల్లలు ఇబ్బంది పడకూడదని సీఎం జగన్‌ దిశ యాప్ తీసుకువచ్చారని, దిశ చట్టం పెండింగ్ లో ఉన్నా కూడా.. పోలీసులకు కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేశారని తెలిపారు హోం మంత్రి తానేటి వనిత. దిశ చట్టంతోనే రమ్య కుటుంబానికి న్యాయం జరిగిందని అన్నారు. ఇప్పటికైనా ప్రతిపక్షాలు దిశ చట్టంపై హేళన మానుకోవాలని ఆమె హితవు పలికారు. దిశ చట్టం సమర్థతకు ఈ తీర్పు ఓ నిదర్శనం అని చెప్పారామె.

First Published:  29 April 2022 10:07 AM GMT
Next Story