Telugu Global
National

మీడియా రంగంలోకి అడుగుపెడుతున్న అదానీ.. ఐపీఎల్ హక్కుల కోసం అంబానీతో పోటీ?

ఇండియన్ టాప్ బిలియనీర్స్ అదానీ, అంబానీలు ఇద్దరూ గుజరాత్‌కు చెందిన వాళ్లే అయినా, వారిద్దరి వ్యాపారాలే వేరు. రెండు మూడు రంగాల్లో వీరిద్దరికీ కామన్ బిజినెస్‌లు ఉన్నా.. పోటీ మాత్రం ఏనాడూ లేదు. ఎవరి వ్యాపారం వారిదే అనే ధోరణిలోనే ముందుకు వెళ్లిపోతున్నారు. అయితే తొలిసారిగా వీళ్లిద్దరూ ఒక వ్యాపారంలో పోటీ పడబోతున్నారు. అదే మీడియా రంగం. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీకి ఇప్పటికే వయాకామ్ 18, నెట్‌వర్క్ 18 అనే మీడియా సంస్థలు ఉన్నాయి. […]

మీడియా రంగంలోకి అడుగుపెడుతున్న అదానీ.. ఐపీఎల్ హక్కుల కోసం అంబానీతో పోటీ?
X

ఇండియన్ టాప్ బిలియనీర్స్ అదానీ, అంబానీలు ఇద్దరూ గుజరాత్‌కు చెందిన వాళ్లే అయినా, వారిద్దరి వ్యాపారాలే వేరు. రెండు మూడు రంగాల్లో వీరిద్దరికీ కామన్ బిజినెస్‌లు ఉన్నా.. పోటీ మాత్రం ఏనాడూ లేదు. ఎవరి వ్యాపారం వారిదే అనే ధోరణిలోనే ముందుకు వెళ్లిపోతున్నారు. అయితే తొలిసారిగా వీళ్లిద్దరూ ఒక వ్యాపారంలో పోటీ పడబోతున్నారు. అదే మీడియా రంగం.

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీకి ఇప్పటికే వయాకామ్ 18, నెట్‌వర్క్ 18 అనే మీడియా సంస్థలు ఉన్నాయి. పారామౌంట్ గ్లోబల్‌తో కలిసి ఈ మీడియా సంస్థలను నడుపుతున్నాడు. వయాకామ్ 18ను మరింత విస్తరించే దిశగా అంబానీ అడుగులు వేస్తున్నాడు. ఇప్పటికే జేమ్స్ ముర్దోక్ నేతృత్వంలోని బోధి ట్రీ సిస్టమ్స్ రూ. 13,500 కోట్లను వయాకామ్ 18లో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వచ్చింది. దీంతోపాటు రిలయన్స్ ప్రాజెక్ట్స్ అండ్ ప్రాపర్టీ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ అదనంగా రూ. 1,645 కోట్లు వయాకామ్ 18లో పెట్టుబడులు పెట్టనున్నది. వయాకామ్ ప్రస్తుతం కలర్స్ టీవీ చానల్‌తో పాటు వూట్ అటే ఓటీటీ నడిపిస్తోంది. జియో సినిమా ప్రస్తుతం జియో ప్లాట్‌ఫామ్స్‌లో భాగంగా ఉండగా.. దాన్ని కూడా వయాకామ్ 18కి ట్రాన్స్‌ఫర్ చేయబోతున్నారు.

మరోవైపు అదానీ గ్రూప్ మీడియా రంగంలోకి కాలుపెడుతోంది. ఇప్పటికే ఏఎంజీ మీడియా గ్రూప్ పేరుతో సంస్థను ప్రారంభించింది. క్లింట్‌లియన్ బిజినెస్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్‌లో వాటా కొనేందుకు ఒప్పందం కూడా జరిగింది. బ్లూంబర్గ్‌తో కలిసి ఇది ఇండియాలో డిజిటల్ మీడియా సర్వీసులు నడిపిస్తోంది. త్వరలోనే వీరి భాగస్వామ్యంలో భారీగా ఓటీటీ, టీవీ చానల్స్ రాబోతున్నట్లు సమాచారం.

అయితే ఇద్దరు కుబేరులు అకస్మాతుగా మీడియా రంగంపై ఫోకస్ చేయడానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నట్లు మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. ఇండియాలో ఓటీటీ రంగం వేగంగా విస్తరిస్తున్నది. అమెరికా, చైనా తర్వాత అతిపెద్ద ఓటీటీ మార్కెట్‌గా ఇండియా నిలుస్తోంది. ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, సోనీ లివ్, హాట్‌స్టార్, జీ5 వంటి ఓటీటీ యాప్స్ ప్రజల్లో ఆదరణ పొందాయి. రాబోయే రోజుల్లో ఓటీటీలకు మరింత గిరాకీ ఉండబోతున్నట్లు నివేదికలు వస్తున్నాయి. అందుకే వాటికి పోటీగా ఓటీటీలు తీసుకొని రావాలని అంబానీ, అదానీలు పోటీ పడుతున్నారు.

ఇక ఇండియాలో ఉన్న క్రేజ్ తెలిసిందే. ముఖ్యంగా ఐపీఎల్‌కు చాలా ప్రేక్షకాదరణ ఉంటుంది. ప్రస్తుతం రాబోయే 5 ఏళ్లకు గాను ఐపీఎల్ ప్రసార హక్కుల కోసం టెండర్లు పిలిచారు. స్టార్ ఇండియా, జీ, సోనీ పిక్చర్స్ వంటి సంస్థలకు పోటీగా నిలవాలని అంబానీ, అదానీలు భావిస్తున్నారు. ముఖ్యంగా ఓటీటీల హక్కులు చేజిక్కించుకోవాలని వీళ్లు భావిస్తున్నారు. ఐపీఎల్ హక్కులు దక్కితే ప్రజల్లోకి వెళ్లడం మరింత సులువు అవుతుందనే ఈ హడావిడిగా మీడియా సంస్థల ఏర్పాటు, విస్తరణ చేపడుతున్నట్లు తెలుస్తున్నది.

First Published:  28 April 2022 11:33 PM GMT
Next Story