Telugu Global
Cinema & Entertainment

'సమ్మతమే' రిలీజ్ డేట్ ఫిక్స్..!

రాజావారు రాణి గారు అనే చిన్న సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టాడు యువ హీరో కిరణ్ అబ్బవరం. ఈ సినిమాతో ప్రేక్షకుల్లో చక్కటి గుర్తింపు సంపాదించుకున్నాడు. స్వతహాగా రచయిత అయిన కిరణ్ ఆ తర్వాత తాను నటించిన ఎస్ఆర్ కళ్యాణమండపం సినిమాకు సొంతంగానే కథను సమకూర్చుకున్నాడు. తండ్రి, కొడుకుల అనుబంధం పైన వచ్చిన ఈ సినిమా కిరణ్ కు తొలి విజయాన్ని అందించింది. యువతలో మంచి గుర్తింపునిచ్చింది. ఆయన తాజాగా నటిస్తున్న సినిమా ‘సమ్మతమే’. ఈ సినిమాలో […]

సమ్మతమే రిలీజ్ డేట్ ఫిక్స్..!
X

రాజావారు రాణి గారు అనే చిన్న సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టాడు యువ హీరో కిరణ్ అబ్బవరం. ఈ సినిమాతో ప్రేక్షకుల్లో చక్కటి గుర్తింపు సంపాదించుకున్నాడు. స్వతహాగా రచయిత అయిన కిరణ్ ఆ తర్వాత తాను నటించిన ఎస్ఆర్ కళ్యాణమండపం సినిమాకు సొంతంగానే కథను సమకూర్చుకున్నాడు. తండ్రి, కొడుకుల అనుబంధం పైన వచ్చిన ఈ సినిమా కిరణ్ కు తొలి విజయాన్ని అందించింది. యువతలో మంచి గుర్తింపునిచ్చింది.

ఆయన తాజాగా నటిస్తున్న సినిమా ‘సమ్మతమే’. ఈ సినిమాలో కిరణ్ సరసన చాందినీ చౌదరి హీరోయిన్ గా నటిస్తుండగా, గోపీనాధ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. కంకాల ప్రవీణ ఈ మూవీని నిర్మిస్తున్నారు.

సమ్మతమే సినిమా జూన్ 24వ తేదీన విడుదల కానున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు హీరో కిరణ్ కూడా ఒక ట్వీట్ చేశాడు. ‘కృష్ణ, శాన్విల ప్రేమకథ మీ అందరి ప్రేమ కథకు దగ్గరగా ఉంటుంది. జూన్ 24 నుంచి మిమ్మల్ని అలరించనుంది’ అని కిరణ్ ట్వీట్ చేశాడు.

ఇటీవల విడుదల అయిన సెబాస్టియన్ పీసీ సినిమాతో పరాజయాన్ని మూట కట్టుకున్న కిరణ్ ఈ సినిమాపై ఆశలు భారీగానే పెట్టుకున్నాడు. కిరణ్ ఈ సినిమాతో పాటు వినరో భాగ్యము విష్ణు కథ అనే సినిమా, నేను మీకు బాగా తెలిసిన వాడిని అనే మరో సినిమాలో కూడా నటిస్తున్నాడు.

First Published:  28 April 2022 3:38 AM GMT
Next Story