Telugu Global
Science and Technology

ఇన్‌స్టాగ్రామ్‌ లేటెస్ట్ ఫీచర్లు ఇవే..

ప్రముఖ ఫొటోషేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్.. ఫీచర్లను అప్‌డేట్ చేసి చాలా రోజులైంది. అందుకే తాజాగా యూత్‌ను అట్రాక్ట్ చేసేలా ఆకర్షణీయమైన కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. క్విక్ సెండ్ ఇంట్రెస్టింగ్ కంటెంట్‌ను ఫ్రెండ్స్‌తో వేగంగా షేర్‌ చేయడం కోసం ఇన్‌స్టాగ్రామ్ మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది.

ఇన్‌స్టాగ్రామ్‌ లేటెస్ట్ ఫీచర్లు ఇవే..
X

ప్రముఖ ఫొటోషేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్.. ఫీచర్లను అప్‌డేట్ చేసి చాలా రోజులైంది. అందుకే తాజాగా యూత్‌ను అట్రాక్ట్ చేసేలా ఆకర్షణీయమైన కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది.

క్విక్ సెండ్

ఇంట్రెస్టింగ్ కంటెంట్‌ను ఫ్రెండ్స్‌తో వేగంగా షేర్‌ చేయడం కోసం ఇన్‌స్టాగ్రామ్ మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. షేర్‌ బటన్‌ను హోల్డ్ చేసి పట్టుకోవడం ద్వారా క్లోజ్‌ ఫ్రెండ్స్‌కు వేగంగా పోస్ట్‌ను షేర్‌ చేయొచ్చు.

ఇన్‌స్టంట్ రిప్లై

ఇన్‌స్టాగ్రామ్‌లో ఫీడ్ బ్రౌజ్‌ చేస్తున్నప్పుడు ఎవరైనా మెసేజ్‌ చేస్తే బ్రౌజింగ్‌ను ఆపి, ఇన్‌బాక్స్‌లోకి వెళ్లి మెస్‌జ్‌కు రిప్లై ఇవ్వాలి. అయితే ఇప్పుడు అప్‌డేట్ చేసిన ఈ ఫీచర్‌తో.. ఇన్‌బాక్స్‌కు వెళ్లకుండా డైరెక్ట్‌గా మెసేజ్‌ ఓపెన్‌ చేసి రిప్లై ఇవ్వొచ్చు.

మ్యూజిక్ షేర్

ఇన్‌స్టాగ్రామ్‌లో యాపిల్‌ మ్యూజిక్‌, అమెజాన్‌ మ్యూజిక్‌, స్పాటిఫై వంటి మ్యూజిక్‌ స్ట్రీమింగ్‌ సర్వీసెస్‌ను కూడా పొందేలా మరో కొత్త ఫీచర్ రానుంది. అంతేకాకుండా చాట్‌ ద్వారా 30 సెకన్ల నిడివి ఉన్న సాంగ్స్‌ను ఇతరులతో షేర్‌ చేసుకోవచ్చు కూడా.

ఆన్‌లైన్‌లో ఉంటే..

వాట్సాప్‌లో లాగా ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఇకపై ఆన్‌లైన్‌లో ఎవరున్నారో తెలుసుకోవచ్చు. యాప్‌ ఓపెన్‌ చేసినప్పుడు ఎవరెవరు ఆన్‌లైన్‌లో ఉన్నారనే వివరాలను ఇన్‌బాక్స్‌లో పైన కనిపిస్తుంది.

సైలెంట్ మెసేజ్

ఫ్రెండ్స్‌ను డిస్టర్బ్ చేయకుండా ఏదైనా విషయాన్ని తెలియజేసేందుకు సైలెంట్ మెసేజ్ అనే ఫీచర్‌ను తీసుకురానుంది ఇన్‌స్టాగ్రామ్. పంపే మెసేజ్‌కు ముందు @Silent అని టైప్‌ చేస్తే నోటిఫికేషన్‌ లేకుండా సైలెంట్‌గా మెసేజ్ అవతలి వ్యక్తికి చేరిపోతుంది.

పోల్స్

ఫేస్‌బుక్‌ మెసెంజర్‌, టెలీగ్రామ్‌లో ఉన్నట్లుగా ఇన్‌స్టాగ్రామ్‌ కూడా గ్రూప్‌ పోల్‌ ఫీచర్‌ రాబోతుంది. ఈ ఫీచర్ తో.. ప్రశ్నను క్రియేట్ చేసి గ్రూప్‌ పోల్‌ ద్వారా అభిప్రాయాలు సేకరించొచ్చు.

లోఫై చాట్

ఇన్‌స్టాగ్రామ్ చాటింగ్‌ మరింత గోప్యంగా ఉండేలా లో-ఫై (lo-fi) అనే చాట్‌ థీమ్‌ రాబోతుందని ఇన్‌స్టాగ్రామ్ వెల్లడించింది.

First Published:  28 April 2022 5:06 AM GMT
Next Story