Telugu Global
NEWS

టీఆర్ఎస్‌లోకి హైదరాబాద్ కలెక్టర్ శర్మన్.. ఎమ్మెల్యే లేదా ఎంపీ టికెట్‌పై ఆశలు..!

ప్రస్తుతం హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న ఎల్. శర్మన్ త్వరలో టీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారు. ఆయన మరో రెండు నెలల్లో రిటైర్ కానున్న క్రమంలో ఆ తర్వాత రాజకీయ కెరీర్ మొదలు పెట్టాలని భావిస్తున్నారు. శర్మన్ టీఆర్ఎస్ లోకి రావడం దాదాపు ఖరారైనట్లు తెలుస్తున్నది. గతంలో సిద్దిపేట కలెక్టర్‌గా పనిచేసిన వెంకట్రామిరెడ్డి ఉద్యోగానికి రాజీనామా చేసి గులాబీ కండువా కప్పుకున్నారు. ఇప్పుడు తాజాగా ఆ జాబితాలో శర్మన్ చేరనున్నారు. ఉమ్మడి ఏపీలో గ్రూప్-1 అధికారిగా ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన […]

టీఆర్ఎస్‌లోకి హైదరాబాద్ కలెక్టర్ శర్మన్.. ఎమ్మెల్యే లేదా ఎంపీ టికెట్‌పై ఆశలు..!
X

ప్రస్తుతం హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న ఎల్. శర్మన్ త్వరలో టీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారు. ఆయన మరో రెండు నెలల్లో రిటైర్ కానున్న క్రమంలో ఆ తర్వాత రాజకీయ కెరీర్ మొదలు పెట్టాలని భావిస్తున్నారు. శర్మన్ టీఆర్ఎస్ లోకి రావడం దాదాపు ఖరారైనట్లు తెలుస్తున్నది. గతంలో సిద్దిపేట కలెక్టర్‌గా పనిచేసిన వెంకట్రామిరెడ్డి ఉద్యోగానికి రాజీనామా చేసి గులాబీ కండువా కప్పుకున్నారు. ఇప్పుడు తాజాగా ఆ జాబితాలో శర్మన్ చేరనున్నారు.

ఉమ్మడి ఏపీలో గ్రూప్-1 అధికారిగా ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన శర్మన్.. మహబూబ్‌నగర్ జాయింట్ కలెక్టర్ గా, నాగర్ కర్నూల్ కలెక్టర్‌గా, జీహెచ్ఎంసీ అదనపు కార్యదర్శిగా పని చేశారు. 2005లో ఆయనకు ఐఏఎస్ హోదా వచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్ కలెక్టర్‌గా ఉంటూ.. త్వరలో రిటైర్ కాబోతున్నారు. అయితే క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి నిత్యం బస్తీలు, మురికివాడల్లో బైక్‌పై పర్యటిస్తూ చాలా మందికి సుపరిచితంగా మారారు. ప్రజా సేవలో ఉండాలంటే పదవీ విరమణ తర్వాత రాజకీయాలే బెస్ట్ అనుకొని ఆయన ఈ రంగాన్ని ఎంచుకున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు.

కాగా, రాబోయే ఎన్నికల్లో అదిలాబాద్ లోక్‌సభ లేదా ఖానాపూర్ అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్నారు. రిటైర్మెంట్ తర్వాత పూర్తిగా నియోజకవర్గ పర్యటనలో ఉండాలని భావిస్తున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. ఇప్పటికే అక్కడి రాజకీయ నాయకులతోనూ ఆయనకు సంబంధాలు ఉన్నాయి. శర్మన్ కుటుంబంలో చాలా మంది బంధువులు రాజకీయాల్లో ఉన్నారు. ఇవన్నీ తనకు కలసొస్తాయని ఆయన అనుకుంటున్నారు. కాగా, ఈ విషయంపై ఆయనను వివరణ కోరగా.. రిటైర్మెంట్‌కు ఇంకా 2 నెలల సమయం ఉందికదా.. అప్పటి వరకు వెయిట్ చేయండి. ఆ తర్వాత చెప్తా అంటూ సమాధానం దాటవేశారు.

First Published:  28 April 2022 12:30 AM GMT
Next Story