Telugu Global
International

నెక్ట్స్ కోకాకోలాను కొంటా.. కొకైన్‌ను తీసుకొని వస్తా : ట్వీట్ చేసిన ఎలాన్ మస్క్

ట్విట్టర్‌ను కొనేసి దాన్ని ప్రైవేట్ కంపెనీగా మార్చేసిన ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మంచి జోష్‌లో ఉన్నారు. ట్విట్టర్ బోర్డు ముందు మొండిగా వ్యవహరించినా.. ఆ తర్వాత మస్క్ ఇచ్చిన ఆఫర్‌ను కాదనలేకపోయింది. ఇక తాను ‘కోకాకోలా’ను కొనడానికి రెడీగా ఉన్నట్లు మస్క్ గురువారం ట్వీట్ చేశాడు. ‘నెక్ట్స్ కోకాకోలాను కొనేసి కొకైన్‌ను తిరిగి తీసుకొస్తా’ అని ట్వీట్ చేశాడు. ఎలాన్ మస్క్ చేసిన ఈ ట్వీట్ ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యపరిచింది. కోకాకోలాను కొనడం ఏంటి? నిషేధించిన […]

నెక్ట్స్ కోకాకోలాను కొంటా.. కొకైన్‌ను తీసుకొని వస్తా : ట్వీట్ చేసిన ఎలాన్ మస్క్
X

ట్విట్టర్‌ను కొనేసి దాన్ని ప్రైవేట్ కంపెనీగా మార్చేసిన ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మంచి జోష్‌లో ఉన్నారు. ట్విట్టర్ బోర్డు ముందు మొండిగా వ్యవహరించినా.. ఆ తర్వాత మస్క్ ఇచ్చిన ఆఫర్‌ను కాదనలేకపోయింది. ఇక తాను ‘కోకాకోలా’ను కొనడానికి రెడీగా ఉన్నట్లు మస్క్ గురువారం ట్వీట్ చేశాడు. ‘నెక్ట్స్ కోకాకోలాను కొనేసి కొకైన్‌ను తిరిగి తీసుకొస్తా’ అని ట్వీట్ చేశాడు. ఎలాన్ మస్క్ చేసిన ఈ ట్వీట్ ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యపరిచింది. కోకాకోలాను కొనడం ఏంటి? నిషేధించిన కొకైన్‌ను తీసుకొని రావడం ఏంటని అందరూ చర్చించుకున్నారు.

అయితే సీరియస్ విషయాలే కాకుండా అప్పుడప్పుడు సరదాగా సెటైర్లే వేసే ఎలాన్ మస్క్.. కోకాకోలా విషయంలో కూడా అలాగే వ్యంగ్యంగా ట్వీట్ చేసినట్లు గుర్తించారు. గతంలో తాను చేసిన ట్వీట్ స్క్రీన్ షాట్‌ను షార్ చేశాడు. ‘ఇప్పుడు నేను మెక్ డొనాల్డ్స్‌నుకూడా కొనేసి వాళ్ల ఐస్‌క్రీమ్ మెషిన్స్ సమస్యలన్నీ పరిష్కరించేస్తా’ అని ఉన్న స్క్రీన్ షాట్‌కు.. వినండి, నేను అద్భుతాలు చేయలేను అని కామెంట్ పెట్టాడు. ఇది చూసి.. కోకాకోలా ట్వీట్ సరదాగా చేసిందే అని నెటిజన్లు నవ్వుకుంటున్నారు.

కాగా, ఎలాన్ మస్క్ ఐదేళ్ల క్రితం కూడా సరదాగా.. ట్విట్టర్ ధర ఎంత అని అడగటం గమనార్హం. ఏమో ఏరోజుకైనా కోకాకోలాను కొనేసి.. దాని సీక్రెట్ రివీల్ చేస్తాడేమో అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఎలాన్ మస్క్‌ను నమ్మడానికి లేదని.. సరదా కామెంట్లు చేసి కంపెనీలను టేకోవర్ చేస్తాడని అంటున్నారు.

First Published:  27 April 2022 10:48 PM GMT
Next Story