Telugu Global
Health & Life Style

మీకు విటమిన్ డెఫీషియన్సీ ఉందా? ఇలా చెక్ చేసుకోండి

శరీరంలో అన్ని రకాల విటమిన్లు, పోషకాలు సమపాళ్లలో ఉంటేనే పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క. ఇందులో ఏ ఒక్క విటమిన్ లోపించినా దానికి సంబంధించిన అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. విటమిన్ డెఫీషియన్సీని ఎలా గుర్తించాలో ఇప్పుడు చూద్దాం. శరీరంలో ఏదైనా విటమిన్ లోపిస్తే ఆ విషయాన్ని శరీరమే మనకు చెప్తుంది. ఒక్కో విటమిన్ డెఫీషియన్సీకి ఒక్కోరకమైన లక్షణాలు బయటపడుతుంటాయి. వాటిని గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి సమస్యలు దరిచేరకుండా చూసుకోవచ్చు. శరీరంలో కనిపించే రకరకాల మార్పుల […]

మీకు విటమిన్ డెఫీషియన్సీ ఉందా? ఇలా చెక్ చేసుకోండి
X

శరీరంలో అన్ని రకాల విటమిన్లు, పోషకాలు సమపాళ్లలో ఉంటేనే పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క. ఇందులో ఏ ఒక్క విటమిన్ లోపించినా దానికి సంబంధించిన అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. విటమిన్ డెఫీషియన్సీని ఎలా గుర్తించాలో ఇప్పుడు చూద్దాం.

శరీరంలో ఏదైనా విటమిన్ లోపిస్తే ఆ విషయాన్ని శరీరమే మనకు చెప్తుంది. ఒక్కో విటమిన్ డెఫీషియన్సీకి ఒక్కోరకమైన లక్షణాలు బయటపడుతుంటాయి. వాటిని గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి సమస్యలు దరిచేరకుండా చూసుకోవచ్చు. శరీరంలో కనిపించే రకరకాల మార్పుల ద్వారా ఏయే విటమిన్ లోపిస్తుందో ఈజీగా తెలుసుకోవచ్చు. ఎలాగంటే..

విటమిన్ బీ
విటమిన్ బీ లోపిస్తే నోటిపూత, పెదవులు పగలడం, బలహీనత, అలసట, రక్త హీనత, మతిమరుపు, మలబద్ధకం, పాదాలు మొద్దుబారడం లాంటి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. ఐరన్‌, జింక్‌తో పాటు నియాసిన్‌, రైబోఫ్లావిన్‌ లోపం వల్ల కూడా నోటిపూత ఎక్కువగా వస్తుంటుంది. విటమిన్‌ బి7 లోపం కారణంగా జుట్టు ఎక్కువగా రాలే అవకాశం ఉంది.

విటమిన్ డీ
తీవ్రమైన అలసట, బలహీనత, ఎముకల్లో నొప్పి, బలహీనమైన కండరాలు, ఆలోచనా శక్తి తగ్గిపోవడం తరచూ డిప్రెషన్ లాంటివి వేధిస్తూ ఉంటే అది విటమిన్ డీ లోపం అయ్యి ఉండొచ్చు. శరీరానికి ఎండ తగలకపోవడం వల్ల విటమిన్ డీ లోపం తలెత్తుతుంది.

విటమిన్ ఏ
మొటిమలు, చర్మ సమస్యలు, కంటి సమస్యలు ఎక్కువగా వస్తుంటే మీలో విటమిన్ ఏ లోపించిందేమో చెక్ చేసుకోవాలి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్‌ ఎ లోపం కారణంగా చర్మ సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి.
జింక్‌ లోపం ఉంటే గోళ్లపై తెల్లటి మచ్చలు ఏర్పడతాయి. అలాగే మెగ్నీషియం మోతాదు తగ్గినా గోళ్లు పెళుసుబారుతుంటాయి.

విటమిన్ సి
ఆస్తమా, కార్డియో వాస్క్యులర్ సమస్యలు, ఇమ్యూనిటీ తగ్గడం, గాయాలు మానకపోవడం, చర్మ సమస్యలు ఎక్కువగా రావడం, శ్వాస సమస్యలు లాంటివి రావడానికి విటమిన్ సి లోపం కారణం అవ్వొచ్చు.

విటమిన్ ఇ
చర్మ సంబంధిత వ్యాధులు, కంటి చూపు సమస్యలు తరచుగా వస్తుంటే విటమిన్ ఇ లోపం ఉండి ఉండొచ్చు.

విటమిన్ కె
ఎముకలు బలహీనంగా తయారవ్వడం, కీళ్ల నొప్పులు, చిగుళ్ల నుంచి రక్తస్రావం, గాయాలైనప్పుడు రక్తం గడ్డకట్టకపోవడం లాంటి సమస్యలు కనిపిస్తుంటే మీకు విటమిన్ కె లోపం ఉండి ఉండొచ్చు.

First Published:  28 April 2022 5:24 AM GMT
Next Story