Telugu Global
Health & Life Style

ఈ టిప్స్‌తో పని ఒత్తిడి నుంచి రిలీఫ్ పొందొచ్చు

కుటుంబంలో ఎంతమంది ఉన్నా.. ఇంటి పని మాత్రం ఇంటి గృహిణి మాత్రమే చేయాలి. ఇది అందరి ఇళ్లల్లో ఒక అలవాటుగా మారింది. మహిళలకుండే ఓర్పు కారణంగా ఇంటి పనులన్నీ వారికే అప్పజెప్తుంటారు. మరి వీళ్లు ఒత్తిడి నుంచి బయటపడేదెలా? ఒక్క క్షణం తీరిక లేకుండా రోజంతా కష్టపడే హౌస్ వైఫ్స్‌ను చాలా ఇళ్లల్లో చూస్తూనే ఉంటాం. ఆడవాళ్లు తమ పర్సనల్ లైఫ్‌ను కూడా పక్కన పెట్టి కుటుంబం కోసమే సమయంతా వెచ్చిస్తుంటారు. ప్రపంచంలో ఎక్కువ శాతం స్త్రీలు […]

ఈ టిప్స్‌తో పని ఒత్తిడి నుంచి రిలీఫ్ పొందొచ్చు
X

కుటుంబంలో ఎంతమంది ఉన్నా.. ఇంటి పని మాత్రం ఇంటి గృహిణి మాత్రమే చేయాలి. ఇది అందరి ఇళ్లల్లో ఒక అలవాటుగా మారింది. మహిళలకుండే ఓర్పు కారణంగా ఇంటి పనులన్నీ వారికే అప్పజెప్తుంటారు. మరి వీళ్లు ఒత్తిడి నుంచి బయటపడేదెలా?

ఒక్క క్షణం తీరిక లేకుండా రోజంతా కష్టపడే హౌస్ వైఫ్స్‌ను చాలా ఇళ్లల్లో చూస్తూనే ఉంటాం. ఆడవాళ్లు తమ పర్సనల్ లైఫ్‌ను కూడా పక్కన పెట్టి కుటుంబం కోసమే సమయంతా వెచ్చిస్తుంటారు. ప్రపంచంలో ఎక్కువ శాతం స్త్రీలు తమ కంటే కూడా తమ కుటుంబం కోసమే ఎక్కువ తాపత్రయపడుతున్నారని పలు రకాల అధ్యయనాలు కూడా చెప్తున్నాయి.

ఇంటి పనుల కారణంగా మహిళలకు వ్యాయామానికి దూరమవుతున్నారని, తద్వారా ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా చెప్తోంది. అందుకే గృహిణులు ఇంటిపనులతో పాటు తమ ఆరోగ్యాన్ని, పర్సనల్ కేర్‌ను కూడా ప్లాన్ చేసుకోవాలి.

గృహిణులకు పని ఒత్తిడి తగ్గాలంటే కుటుంబ భారాన్ని అందరూ పంచుకోవాలి. కుటుంబమంటే అందరూ కాబట్టి ఇంటి పనుల్లో కూడా అందరూ తలా ఒక చెయ్యి వేయాలి. ఇంట్లోని మగవాళ్లు కూడా వంట, పిల్లల కేర్ లాంటి విషయాల్లో సాయం చేయాలి. అలాగే పిల్లలకు కూడా హోమ్ వర్క్, బట్టలు వేసుకోవడం, పుస్తకాలు సర్దుకోవడం లాంటి పనులు వారే చేసుకునేలా అలవాటు చేయాలి.

గృహిణులు తమ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకోవడం ఎంతైనా అవసరం. ఇంట్లో వాళ్ల ఇష్టాల కోసం చేసే రకరకాల వంటలతో పాటు తమకు కావాల్సిన పోషకాలను కూడా డైట్‌లో చేర్చుకోవాలి. అలాగే రోజులో కొంత సమయం తీరిక చేసుకుని కచ్చితంగా వ్యాయామం చేయాలి.

ఒత్తిడితో కూడిన లైఫ్‌స్టైల్, శారీరక శ్రమ తక్కువగా ఉండడం వల్ల మహిళల్లో డయాబెటిస్, ఒబెసిటీ లాంటి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. అందుకే ఇంటి పనుల్లో విసిగిపోయే గృహిణులు వ్యాయామం కోసం కొంత సమయాన్ని కచ్చితంగా కేటాయించుకోవాలి.

ఇకపోతే గృహిణులు ఇంటి పనుల్లో ఎంత బిజీగా ఉన్న తమ హాబీస్‌ను మిస్ అవ్వకూడదు. రోజులో కొంత సమయాన్ని కేటాయించుకుని మీకిష్టమైన పనులు చేసుకోవాలి. మ్యూజిక్, డ్యాన్స్, కుట్లు, అల్లికలు, ఆటలు ఆడడం లాంటివి చేయాలి. మీకు అత్యంత ఆత్మీయులను మిస్ అవ్వకుండా వారానికొకసారైనా మనసు విప్పి మాట్లాడుతుండాలి. ఇలా చేయడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.

అన్నింటికంటే ముఖ్యంగా ఎక్కువగా అలసిపోయాం అని అనిపించిన వెంటనే కాస్త బ్రేక్ తీసుకోవాలి. మీరు ఎంత ఒత్తిడికి లోనవుతున్నారో మీ కుటుంబ సభ్యులకు అర్థమయ్యేలా చెప్పాలి. ఎంత బిజిగాఉన్నా సమయానికి నిద్ర పోవడం, పని మధ్యలో గ్యాప్స్ తీసుకోవడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడాన్ని మాత్రం మర్చిపోవద్దు.

Next Story