ఐపీయల్‌లో సీన్ రివర్స్.. ఈ సారి ఫేవరెట్ టీమ్స్ ఇవే..
ఐపీయల్-2022 సీజన్‌లో ఇప్పటికే సగం కంటే ఎక్కువ మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఏయే టీమ్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయో ఇప్పటికే అందరికీ ఒక అంచనా వచ్చింది. ఈ సారి ఏయే టీమ్స్ హాట్ ఫేవరెట్‌గా ఉండబోతున్నాయంటే.. ఐపీయల్ సీజన్‌లో జరగాల్సిన 70 మ్యాచ్‌ల్లో 39 మ్యాచ్‌లు ముగిశాయి. అయితే ఈ సారి ఐపీయల్‌లో అందరి అంచనాలు తారుమారయ్యాయి. ముఖ్యంగా ముంబై, చెన్నై విషయంలో సీన్ రివర్స్ అయింది. ఐదుసార్లు చాంపియన్ అయిన ముంబై వరుసగా ఎనిమిది మ్యాచ్‌ల్లో ఓడిపోవడం […]
ఐపీయల్-2022 సీజన్‌లో ఇప్పటికే సగం కంటే ఎక్కువ మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఏయే టీమ్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయో ఇప్పటికే అందరికీ ఒక అంచనా వచ్చింది. ఈ సారి ఏయే టీమ్స్ హాట్ ఫేవరెట్‌గా ఉండబోతున్నాయంటే..
ఐపీయల్ సీజన్‌లో జరగాల్సిన 70 మ్యాచ్‌ల్లో 39 మ్యాచ్‌లు ముగిశాయి. అయితే ఈ సారి ఐపీయల్‌లో అందరి అంచనాలు తారుమారయ్యాయి. ముఖ్యంగా ముంబై, చెన్నై విషయంలో సీన్ రివర్స్ అయింది. ఐదుసార్లు చాంపియన్ అయిన ముంబై వరుసగా ఎనిమిది మ్యాచ్‌ల్లో ఓడిపోవడం ముంబై ఫ్యాన్స్‌కు మింగుడు పడట్లేదు. గతేడాది టైటిల్ గెలిచిన చెన్నై సూపర్‌కింగ్స్ కూడా ఎనిమిదింటిలో కేవలం రెండు మాత్రమే గెలిచి.. పాయింట్స్ టేబుల్‌లో వెనుకంజలో ఉంది.
అదరగొడుతున్న కొత్త టీమ్‌లు
ఈ సారి ఐపీయల్‌లో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన రెండు కొత్త టీమ్స్.. అంచనాలను తారుమారు చేస్తూ జెట్ స్పీడ్‌లో దూసుకెళ్తు్న్నాయి. ఈ సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ వరుస విజయాలతో దూసుకుపోతున్నాయి. టీమిండియా వైస్ కెప్టెన్ కేయల్ రాహుల్ లక్నో టీమ్‌ను ఎనిమిదింట 5 విజయాలతో 10 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలబెడితే. ముంబై వదులుకున్న హార్దిక్ పాండ్యా గుజరాత్ టీమ్‌ను 12 పాయింట్లతో రెండో స్థానంలో నిలబెట్టాడు.
తిరుగులేని సన్ రైజర్స్
ఇకపోతే ఇండియన్ స్టార్ ప్లేయర్స్ ఎవరూ లేని సన్ రైజర్స్ ఈ సారి బౌలింగ్‌తో అదరగొడుతుంది. మెగా ఆక్షన్ సమయంలో ఆటగాళ్ల ఎంపిక విషయంలో విమర్శల పాలైన సన్‌రైజర్స్.. వరుస విజయాలతో అందరినీ మెప్పిస్తుంది. ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఎస్‌ఆర్‌హెచ్ వరుసగా ఐదు గెలిచి 10 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. అలాగే ఎప్పటినుంచో కప్ కోసం ఎదురుచూస్తూన్న ఆర్సీబీ 9 మ్యాచ్‌లు ఆడి 10 పాయింట్లు సాధించి ఐదోస్థానంలో ఉంది.
టాప్‌లో ఇవే..
గత సీజన్‌లో ఆఖరి నుంచి రెండో స్థానంలో నిలిచిన రాజస్తాన్ రాయల్స్.. ఈసారి మాత్రం టేబుల్‌లో టాప్‌లో ఉంది. ఆడిన ఎనిమిది మ్యాచ్‌లలో ఆరు గెలిచి సీజన్‌లో అన్ని టీమ్స్ కంటే ముందుంది. ఇప్పటి వరకు టాప్- 5 లో ఉన్న ఈ జట్లు ఇలాగే ముందుకు సాగితే వీటి మధ్య ప్లే ఆఫ్స్ కోసం తీవ్రమైన పోటీ నెలకొనే అవకాశం ఉంది. ఇప్పుడున్న స్టాటిస్టిక్స్ ప్రకారం చూస్తే.. రాజస్తాన్, గుజరాత్, హైదరాబాద్, లక్నో, బెంగళూరు జట్లు నాకౌట్ దశకు చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇకపోతే పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో పోలిస్తే ఢిల్లీ క్యాపిటల్స్ ముందంజలో ఉంది. వీటి పెర్ఫామెన్స్ ఇంకా మున్ముందు చూడాల్సి ఉంది. ముంబై విషయానికొస్తే.. ప్లే ఆఫ్స్‌కు వచ్చే ఛాన్స్ దాదాపుగా లేనట్టే కనిపిస్తోంది. ఇక చెన్నై ప్లే ఆఫ్స్‌కు రావాలంటే మిగిలిన 6 మ్యాచ్‌లు గెలవాల్సి ఉంది.
హాట్ ఫేవరెట్ టీమ్స్ ఇవే
ఐపీఎల్-2022 టైటిల్ రేసులో రాజస్తాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్, సన్ రైజర్స్ ముందున్నాయి. టైటిల్ గెలిచే అవకాశం ఈ నాలుగు జట్లకే ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. క్రికెట్ ఫ్యాన్స్ కూడా ఇదే అంచనా వేస్తున్నారు. అయితే క్రికెట్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. అనుకోని విధంగా పాయింట్స్ టేబుల్ రివర్స్ కూడా అవ్వొచ్చు. ఏదేమైనా జట్టు శక్తి సామర్థ్యాలను అంచనా వేయాలంటే సెమీ ఫైనల్స్ వరకూ వేచి చూడాల్సిందే.