దిద్దుబాటుకు వేళాయే!
ఆంధ్రప్రదేశ్‌లో 2024లో సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఇందుకోసం పార్టీలు ఇప్పటి నుంచే సన్నద్దమవుతున్నాయి. దీంతో ఎన్నికలకు రెండేళ్ల ముందు నుంచే రాజకీయ వేడి ప్రారంభం కానుంది. ఇటీవల మంత్రివర్గ విస్తరణ, పార్టీ పదవుల పంపకాలు, తదితరాలతో అధికార పార్టీలో నెలకొన్న అసమ్మతిని చల్లార్చేందుకు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దిగ్గుబాటు చర్యలు చేపట్టింది. రానున్న సాధారణ ఎన్నికలకు పార్టీ నేతలను సిద్ధం చేయడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ ఇప్పట్నుంచే దృష్టిసారించారు. బుధవారం […]
ఆంధ్రప్రదేశ్‌లో 2024లో సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఇందుకోసం పార్టీలు ఇప్పటి నుంచే సన్నద్దమవుతున్నాయి. దీంతో ఎన్నికలకు రెండేళ్ల ముందు నుంచే రాజకీయ వేడి ప్రారంభం కానుంది. ఇటీవల మంత్రివర్గ విస్తరణ, పార్టీ పదవుల పంపకాలు, తదితరాలతో అధికార పార్టీలో నెలకొన్న అసమ్మతిని చల్లార్చేందుకు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దిగ్గుబాటు చర్యలు చేపట్టింది. రానున్న సాధారణ ఎన్నికలకు పార్టీ నేతలను సిద్ధం చేయడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ ఇప్పట్నుంచే దృష్టిసారించారు. బుధవారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో వైఎస్ జగన్ కీలక సమావేశం ఏర్పాటు చేశారు.
ఇటీవల మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన మంత్రులు, జిల్లాల పార్టీ అధ్యక్షులుగా నియమితులైన మాజీ మంత్రులు, రీజనల్ కోఆర్డినేటర్లతో సీఎం జగన్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. వచ్చే ఎన్నికల లక్ష్యంగా జగన్ దిశానిర్దేశం ఏప్రిల్ 27న మధ్యాహ్నం 3.30 గంటలకు సీఎం జగన్ నేతృత్వంలో ఈ సమావేశం ప్రారంభం కానుంది. సమావేశంలో పార్టీ పటిష్టత, క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సిన చర్యలపై జగన్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. మంత్రులు, పార్టీ అధ్యక్షులను సఖ్యతగా ఉంచడం, తద్వారా పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయం చేయడమే లక్ష్యంగా ఈ సమావేశం జరగనున్నట్లు తెలుస్తోంది.
మూడేళ్ల తరువాత కీలక సమావేశం
2019 ఎన్నికల అనంతరం పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో వైఎస్ జగన్ తొలిసారిగా కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మూడేళ్ల పాలనపై సమీక్షిస్తూ..పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో మళ్లీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. ప్రతి ఎమ్మెల్యే వారానికి కనీసం 10 గ్రామ లేదా వార్డు సచివాలయాలను సందర్శించడంతో పాటు వాటి పనితీరును సమీక్షించేలా కార్యక్రమాన్ని రూపొందించి వచ్చేనెల నుంచి కచ్చితంగా పాటించేలా దిశానిర్దేశం చేయనున్నారు. మే 2 నుంచి గడప గడపకు వైసీపీ అనే కార్యక్రమాన్ని తొలివిడతగా చేపట్టనున్నట్లు సమాచారం.
అసంతృప్తులు చల్లారేనా?
మంత్రివర్గ విస్తరణ తరువాత పార్టీ నేతల్లో రగిలిన అసంతృప్తి జ్వాలలను చల్లార్చే పనిలో వైసీపీ అధిష్ఠానం పడింది. సీఎం జగన్ స్వయంగా రంగంలోకి దిగి అసంతృప్తి నేతలను తన క్యాంపు కార్యాలయానికి పిలుపించుకొని సముదాయిస్తున్నారు. తమకు మంత్రి పదవులు రాలేదంటూ కొందరు నేతలు బహిరంగంగానే తమ అసంతృప్తి, ఆవేదన, నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో నేతల నిరసన వ్యక్తం కావడంతో వైసీపీ పెద్దలు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. రోజూ కొంతమంది చొప్పున తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి పిలిపించుకుని బుజ్జగిస్తున్నట్టు తెలిసింది. పార్టీ ఆవిర్భావం నుంచి జగన్ వెంటే ఉన్న తమకు తగిన గుర్తింపు ఇవ్వడంలేదని కొందరు మీడియా సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి నేతలకు వైఎస్ జగన్ ఎలాంటి హామీ ఇస్తారు. వీరంతా కలిసి పని చేస్తారా అన్నది వేచి చూడాలి.