Telugu Global
Cinema & Entertainment

రాజ్ కుమార్ మనవడు హీరోగా కేజీఎఫ్ నిర్మాతల మూవీ..!

కేజీఎఫ్ సిరీస్ సృష్టించిన సంచలనాలు అంతా ఇంతా కావు.. దేశవ్యాప్తంగా విపరీతమైన ఊపు తీసుకొచ్చాయి ఈ చిత్రాలు. ఇక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, హీరో ఎలివేషన్లు మామూలు రేంజ్ లో లేవు. మాస్ సినిమాలు ఇష్టపడే ప్రేక్షకులు ఈ సినిమాలు చూసి ఉర్రూతలూగిపోయారు. హీరో యశ్, దర్శకుడు ప్రశాంత్ నీల్ పేర్లు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. ఇదిలా ఉంటే ఈ చిత్ర ఫ్రాంచైజీ మేకర్స్ హోంబలే ఫిల్మ్స్ త్వరలో మరో భారీ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్టు ప్రకటించింది. వారి […]

రాజ్ కుమార్ మనవడు హీరోగా కేజీఎఫ్ నిర్మాతల మూవీ..!
X

కేజీఎఫ్ సిరీస్ సృష్టించిన సంచలనాలు అంతా ఇంతా కావు.. దేశవ్యాప్తంగా విపరీతమైన ఊపు తీసుకొచ్చాయి ఈ చిత్రాలు. ఇక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, హీరో ఎలివేషన్లు మామూలు రేంజ్ లో లేవు. మాస్ సినిమాలు ఇష్టపడే ప్రేక్షకులు ఈ సినిమాలు చూసి ఉర్రూతలూగిపోయారు. హీరో యశ్, దర్శకుడు ప్రశాంత్ నీల్ పేర్లు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. ఇదిలా ఉంటే ఈ చిత్ర ఫ్రాంచైజీ మేకర్స్ హోంబలే ఫిల్మ్స్ త్వరలో మరో భారీ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్టు ప్రకటించింది.

వారి కొత్త చిత్రంలో కన్నడ లెజెండ్ రాజ్ కుమార్ మనవడు, పునీత్ రాజ్‌కుమార్ సోదరుడు రాఘవేంద్ర రాజ్‌కుమార్ కుమారుడు యువ రాజ్‌ కుమార్‌ను హీరోగా పరిచయం చేయబోతున్నారు. ఇందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ను తాజాగా విడుదల చేశారు. ఈ చిత్రానికి సంతోష్ ఆనంద్‌ద్రమ్ దర్శకత్వం వహించనున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.

కన్నడనాట రాజ్ కుమార్ దశాబ్దాల పాటు అగ్ర హీరోగా రాణించారు. ఆయన తనయులు శివ రాజ్ కుమార్, పునీత్ రాజ్ కుమార్ ఆ లెగసీని కొనసాగిస్తూ అగ్ర హీరోలుగా ఎదిగారు. ఇప్పుడు రాజ్ కుమార్ మనవడు యువ రాజ్ కుమార్ హీరోగా పరిచయమవుతున్నాడు. కేజీఎఫ్ సీరిస్ లతో భారీ చిత్రాలు తీయగల నిర్మాతలుగా పేరు తెచ్చుకున్న హోంబలే ఫిల్మ్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

First Published:  27 April 2022 9:55 AM GMT
Next Story