Telugu Global
Health & Life Style

వారంలో రెట్టింపైన కరోనా కేసులు.. 12 రాష్ట్రాల్లో ప్రమాద ఘంటికలు..

దేశవ్యాప్తంగా కరోనా కేసులు ఊహించినదానికంటే వేగంగా పెరుగుతున్నాయి. ఏప్రిల్ 11నుంచి 17 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా 8వేల కేసులు నమోదు కాగా.. ఏప్రిల్‌ 18 నుంచి 24వతేదీ మధ్య కాలంలో కొత్తగా నమోదైన కొవిడ్ కేసుల సంఖ్య 15,700. అంటే దాదాపుగా కేసుల సంఖ్య రెట్టింపయింది. గడచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 3.02లక్షల మందికి కొవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. 2,541 మందికి పాజిటివ్‌ గా తేలింది. దీంతో రోజువారీ పాజిటివిటీ రేటు 0.84శాతంగా నమోదైంది. […]

వారంలో రెట్టింపైన కరోనా కేసులు.. 12 రాష్ట్రాల్లో ప్రమాద ఘంటికలు..
X

దేశవ్యాప్తంగా కరోనా కేసులు ఊహించినదానికంటే వేగంగా పెరుగుతున్నాయి. ఏప్రిల్ 11నుంచి 17 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా 8వేల కేసులు నమోదు కాగా.. ఏప్రిల్‌ 18 నుంచి 24వతేదీ మధ్య కాలంలో కొత్తగా నమోదైన కొవిడ్ కేసుల సంఖ్య 15,700. అంటే దాదాపుగా కేసుల సంఖ్య రెట్టింపయింది. గడచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 3.02లక్షల మందికి కొవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. 2,541 మందికి పాజిటివ్‌ గా తేలింది. దీంతో రోజువారీ పాజిటివిటీ రేటు 0.84శాతంగా నమోదైంది.

12 రాష్ట్రాలు కీలకం..
ఢిల్లీ, హర్యానా, మహారాష్ట్ర, గోవా సహా ఈశాన్య రాష్ట్రాల్లో కూడా కొవిడ్ ప్రమాద ఘంటికలు వినపడుతున్నాయి. మొత్తం 12 రాష్ట్రాల్లో కొవిడ్ కేసుల ఉధృతి కనపడుతోంది. కొత్త కేసుల కంటే రికవరీలు తక్కువగా ఉండటంతో క్రియాశీల కేసుల సంఖ్య దేశంలో 16వేలు దాటింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 16,522 మంది కరోనాతో బాధపడుతుండగా.. యాక్టివ్‌ కేసుల రేటు 0.04శాతంగా ఉంది. అదే సమయంలో గడచిన 24గంటల్లో 1,862 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. దీంతో రికవరీ రేటు 98.75శాతంగా ఉంది.

ఇప్పటి వరకు భారత్ లో..
భారత్ లో ఇప్పటి వరకు 5,22,223 మంది కొవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. గడచిన 24 గంటల్లో 30మందిని కొవిడ్ బలితీసుకుంది. వ్యాక్సినేషన్ విషయానికొస్తే.. గడచిన 24గంటల్లో 3.64లక్షల మంది కొవిడ్ టీకాలు తీసుకున్నారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 187 కోట్ల కొవిడ్ వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసింది ప్రభుత్వం. వృద్ధులకు, ఇతర రిస్క్ గ్రూప్ లకు బూస్టర్ డోస్ ల పంపిణీ మొదలైనా.. ఎవరూ పెద్దగా ఆసక్తి చూపించడంలేదని తెలుస్తోంది. దేశవ్యాప్తంగా కొవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా.. బూస్టర్ డోసుల పంపిణీపై కూడా కేంద్రం దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది.

First Published:  25 April 2022 3:42 AM GMT
Next Story