Telugu Global
NEWS

ఏపీలో మరో జిల్లా ఏర్పాటు..!

ఆంధ్రప్రదేశ్ లో పాలన సులభతరం చేసేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ కొత్తగా 13 జిల్లాలను ప్రారంభించిన విషయం తెలిసిందే. సోమవారం నుంచి అధికారికంగా ఈ జిల్లాలు ప్రారంభమయ్యాయి. నూతన జిల్లాల ఏర్పాటుతో ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న జిల్లాల సంఖ్య 26కు చేరింది. ప్రస్తుతం అన్ని కొత్త జిల్లాలకు అవసరమైన కలెక్టర్లు, ఎస్పీలు, ఆర్డీవోలు, తదితర ఉన్నత అధికారుల నియామకం కూడా పూర్తయింది. అందుబాటులో ఉన్న భవనాల్లో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటుచేసి పాలన కూడా ప్రారంభించారు. కాగా […]

ఏపీలో మరో జిల్లా ఏర్పాటు..!
X

ఆంధ్రప్రదేశ్ లో పాలన సులభతరం చేసేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ కొత్తగా 13 జిల్లాలను ప్రారంభించిన విషయం తెలిసిందే. సోమవారం నుంచి అధికారికంగా ఈ జిల్లాలు ప్రారంభమయ్యాయి. నూతన జిల్లాల ఏర్పాటుతో ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న జిల్లాల సంఖ్య 26కు చేరింది. ప్రస్తుతం అన్ని కొత్త జిల్లాలకు అవసరమైన కలెక్టర్లు, ఎస్పీలు, ఆర్డీవోలు, తదితర ఉన్నత అధికారుల నియామకం కూడా పూర్తయింది. అందుబాటులో ఉన్న భవనాల్లో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటుచేసి పాలన కూడా ప్రారంభించారు.

కాగా రాష్ట్రంలో 26 జిల్లాలతో పాటు మరో జిల్లాను కూడా కొత్తగా ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి మంత్రి పేర్ని నాని తాజాగా వివరాలు వెల్లడించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 26 జిల్లాలకు అదనంగా మరో జిల్లా వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.

గిరిజన ప్రాంతాలు అన్నీ కలిపి ఒక జిల్లాగా ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉందని వెల్లడించారు. కొత్త జిల్లా ఏర్పాటు పై ఇప్పటికే సీఎం జగన్ సీరియస్ గా ఆలోచిస్తున్నారని, అతి త్వరలోనే మరో జిల్లా ఏర్పడే అవకాశం ఉందని చెప్పారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గిరిజన ప్రాంతాల్లో రెండు జిల్లాలు ఏర్పాటు చేసిందని, గిరిజన ప్రాంతాల్లో పాలన సులభతరం చేసేందుకు గాను మరో జిల్లాను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు మంత్రి పేర్ని నాని వెల్లడించారు.

First Published:  5 April 2022 2:09 AM GMT
Next Story