Telugu Global
Cinema & Entertainment

కెరీర్ లో ఫస్ట్ టైం నాలుగు గెటప్స్ లో చరణ్..!

కెరీర్ మొదలైన తొలినాళ్లలో ఒకే తరహా గెటప్ లలో కనిపించారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. కానీ రంగస్థలం సినిమా నుంచి ఆయన గెటప్స్ ప్రత్యేక తరహాలో సాగుతున్నాయి. రంగస్థలంలో పల్లెటూరి యువకుడైన చిట్టిబాబు పాత్రలో చరణ్ అద్భుతంగా నటించాడు. ఇటీవల విడుదలైన ఆర్ఆర్ఆర్ లోనూ బ్రిటీష్ పోలీస్ ఆఫీసర్ గా, సీతారామరాజు గెటప్ లో అద్భుతంగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ప్రస్తుతం రామ్ చరణ్ దర్శక దిగ్గజం శంకర్ దర్శకత్వంలో ఓ సినిమాలో […]

కెరీర్ లో ఫస్ట్ టైం నాలుగు గెటప్స్ లో చరణ్..!
X

కెరీర్ మొదలైన తొలినాళ్లలో ఒకే తరహా గెటప్ లలో కనిపించారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. కానీ రంగస్థలం సినిమా నుంచి ఆయన గెటప్స్ ప్రత్యేక తరహాలో సాగుతున్నాయి. రంగస్థలంలో పల్లెటూరి యువకుడైన చిట్టిబాబు పాత్రలో చరణ్ అద్భుతంగా నటించాడు. ఇటీవల విడుదలైన ఆర్ఆర్ఆర్ లోనూ బ్రిటీష్ పోలీస్ ఆఫీసర్ గా, సీతారామరాజు గెటప్ లో అద్భుతంగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ప్రస్తుతం రామ్ చరణ్ దర్శక దిగ్గజం శంకర్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. శంకర్ సినిమాలోని హీరోల గెటప్స్ ప్రత్యేకంగా ఉంటాయి.

భారతీయుడు సినిమాలో కమలహాసన్, అపరిచితుడు, ఐ సినిమాల్లో విక్రమ్ డిఫరెంట్ గెటప్స్ లో కనిపించారు. ప్రస్తుతం శంకర్- చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీలో కూడా చరణ్ కెరీర్ లో తొలిసారిగా ఒకే సినిమాలో నాలుగు గెటప్స్ లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో చరణ్ స్టూడెంట్ గా, కలెక్టర్ గా, వృద్ధుడిగా కనిపిస్తారని టాక్.

ఈ సినిమాలో చరణ్ కు ఇంకో గెటప్ కూడా ఉంటుందని తెలుస్తోంది. శంకర్ తన సినిమాల్లో హీరో క్యారెక్టర్ ను ఏ రేంజ్ లో ఎలివేట్ చేస్తాడో అందరికీ తెలిసిందే. ఇక చరణ్ ను శంకర్ స్క్రీన్ పై ఏ విధంగా చూపిస్తాడా.. అని అందరిలో ఆసక్తి నెలకొంది. చరణ్ సినిమా ఇప్పటికే రెండు షెడ్యూళ్లు పూర్తి చేసుకుంది. ఈ నెల ఆరవ తేదీ నుంచి ఈ సినిమా మూడో షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ మూవీలో చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. దిల్ రాజు ప్రొడక్షన్ లో 50వ సినిమాగా దీనిని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు

First Published:  5 April 2022 1:01 AM GMT
Next Story