Telugu Global
International

చైనాలో కొవిడ్ కల్లోలం: రంగంలోకి సైన్యం.. లాక్ డౌన్ కొనసాగింపు..

చైనాలో ఒక్క రోజు వ్యవధిలోనే 13వేల కొత్త కొవిడ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇందులో 12వేలమందికి లక్షణాలు లేకుండానే పాజిటివ్ గా తేలింది. కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత రెండేళ్ల కాలంలో ఇప్పుడే భారీగా కేసులు నమోదవుతున్నట్టు చైనా ప్రకటించింది. ఇక చైనాలోని షాంఘైలో కొవిడ్ ఉద్ధృతిని అడ్డుకునేందుకు సైన్యాన్ని రంగంలోకి దించింది. 10వేలమంది ఆరోగ్య కార్యకర్తలతోపాటు 2వేలమంది సైనిక సిబ్బంది కూడా వైద్య సహాయం అందించేందుకు షాంఘై చేరుకున్నారు. షాంఘైలోని 2.5కోట్ల మంది ప్రజలకు ప్రభుత్వం […]

చైనాలో కొవిడ్ కల్లోలం: రంగంలోకి సైన్యం.. లాక్ డౌన్ కొనసాగింపు..
X

చైనాలో ఒక్క రోజు వ్యవధిలోనే 13వేల కొత్త కొవిడ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇందులో 12వేలమందికి లక్షణాలు లేకుండానే పాజిటివ్ గా తేలింది. కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత రెండేళ్ల కాలంలో ఇప్పుడే భారీగా కేసులు నమోదవుతున్నట్టు చైనా ప్రకటించింది. ఇక చైనాలోని షాంఘైలో కొవిడ్ ఉద్ధృతిని అడ్డుకునేందుకు సైన్యాన్ని రంగంలోకి దించింది. 10వేలమంది ఆరోగ్య కార్యకర్తలతోపాటు 2వేలమంది సైనిక సిబ్బంది కూడా వైద్య సహాయం అందించేందుకు షాంఘై చేరుకున్నారు. షాంఘైలోని 2.5కోట్ల మంది ప్రజలకు ప్రభుత్వం సామూహిక పరీక్షలు నిర్వహిస్తోంది.

రెండోవారం కొనసాగిన లాక్ డౌన్..
కేసుల సంఖ్య తగ్గకపోవడంతోపాటు.. భారీగా పెరుగుతుండటంతో చైనా ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. లాక్ డౌన్ ని మరికొన్ని రోజులపాటు పెంచేందుకు నిర్ణయించింది. కొన్ని చోట్ల వర్క్ ఫ్రమ్ హోమ్ కుదురుతున్నా.. తయారీ రంగం, షిప్పింగ్.. వంటి చోట్ల లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయి. లాక్ డౌన్ పొడిగిస్తే ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావాలు పడొచ్చనే ఆందోళనలు పెరుగుతున్నాయి.

బీఏ-2 రకంతోనే ప్రమాదం..
ప్రస్తుతం చైనాలో వేగంగా వ్యాప్తిస్తున్న వేరియంట్ బీఏ-2 గా గుర్తించారు వైద్యులు. అయితే వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నా మరణాలు మాత్రం లేవని చైనా నేషనల్ హెల్త్ కమిషన్ తెలిపింది. ప్రస్తుతం చైనా ముందున్న టార్గెట్ ఒక్కటే. విస్తృతంగా కొవిడ్ పరీక్షలు నిర్వహించడం, కొవిడ్ సోకినవారిని ప్రత్యేకంగా ఉంచి చికిత్స అందించడం. అందుకే వైద్య సిబ్బందితోపాటు, సైన్యాన్ని కూడా రంగంలోకి దింపింది చైనా ప్రభుత్వం. షాంఘైతోపాటు ఉత్తర చైనాలోని జిలిన్ ప్రావిన్స్, ఈశాన్య చైనాలోని బయోచెంగ్ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికీ కొవిడ్ పరీక్ష నిర్వహించాలనుకుంటోంది.

First Published:  4 April 2022 9:53 PM GMT
Next Story