Telugu Global
NEWS

ధాన్యం కొనుగోళ్ల కోసం టీఆర్ఎస్ పోరుబాట..

తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తిగా కేంద్ర ప్రభుత్వం సేకరించాలనే నినాదంతో టీఆర్ఎస్ పోరుబాట పట్టింది. అయిదంచెల యాక్షన్ ప్లాన్ లో భాగంగా ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు నిరసన దీక్షలు చేపట్టారు. రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఈ నిరసనల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఖమ్మం హైవేపై మంత్రి పువ్వాడ అజయ్, కరీంనగర్‌ లో మంత్రి గంగుల కమలాకర్‌ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. ధాన్యం […]

ధాన్యం కొనుగోళ్ల కోసం టీఆర్ఎస్ పోరుబాట..
X

తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తిగా కేంద్ర ప్రభుత్వం సేకరించాలనే నినాదంతో టీఆర్ఎస్ పోరుబాట పట్టింది. అయిదంచెల యాక్షన్ ప్లాన్ లో భాగంగా ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు నిరసన దీక్షలు చేపట్టారు. రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఈ నిరసనల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఖమ్మం హైవేపై మంత్రి పువ్వాడ అజయ్, కరీంనగర్‌ లో మంత్రి గంగుల కమలాకర్‌ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. ధాన్యం కొనుగోలుపై కేంద్రం దిగివచ్చేదాకా తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు టీఆర్ఎస్ నేతలు.

ఢిల్లీలోనూ పోరుబాట..
మరోవైపు తెలంగాణ ప్రజానీకాన్ని, రైతుల్ని అవమానించారంటూ.. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పై ప్రివిలేజ్ మోషన్ నోటీసు ఇచ్చారు టీఆర్ఎస్ ఎంపీలు. వరి కొనుగోలు విషయంలో పార్లమెంటును, దేశ ప్రజలను, రైతులను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తప్పుదోవ పట్టించారని సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం (ప్రివిలేజ్ మోషన్) నోటీసులో పేర్కొన్నారు. ఈ నోటీసుని లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాకు అందజేశారు. టీఆర్ఎస్ ఎంపీలు నామా నాగేశ్వరరావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, బి.బి పాటిల్, మాలోతు కవిత ఈ నోటీసు అందజేసినవారిలో ఉన్నారు.

అయిదంచెల పోరుబాటలో తొలి అంకం ఈరోజు పూర్తవుతుంది. ఈనెల 6వతేదీన తెలంగాణలో హైవేలను దిగ్బంధించేందుకు టీఆర్ఎస్ వ్యూహ రచన చేసింది. రైతులతో కలసి రహదారులపై టీఆర్ఎస్ నేతలు రాస్తారోకోలు చేయబోతున్నారు. ఈనెల 7న జిల్లా కేంద్రాల్లో నిరసనలు, 8వ తేదీన రైతుల ఇళ్లపై నల్లజెండాలు ఎగురవేస్తారు. పోరుబాటలో చివరిగా.. ఈనెల 11న ఢిల్లీలో తెలంగాణ మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల నాయకులు, పార్టీ నేతలతో నిరసనలు చేపడతారు.

First Published:  4 April 2022 3:38 AM GMT
Next Story