Telugu Global
NEWS

దున్నపోతు ఈనిందని బాబు చెబితే.. పవన్ కల్యాణ్ కట్టేసే రకం..

ఏపీలో జిల్లాల పునర్విభజనపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యల్ని, విమర్శల్ని తిప్పికొట్టారు మంత్రి పేర్ని నాని. దున్నపోతు ఈనింది అని చంద్రబాబు చెబితే, పవన్ కల్యాణ్ కట్టెసే రకం అని అన్నారాయన. అమరావతి రైతుల వద్ద భూములు లాక్కుంటే చంద్రబాబుని ఒక్క అడుగు కూడా కదలనివ్వబోనని ప్రగల్భాలు పలికిన పవన్, వారికి ఏం న్యాయం చేశారని నిలదీశారు. ఉద్దానం వాళ్ళ బాధ్యత తీసుకున్నాని చెప్పిన పవన్ కల్యాణ్, ఆ బాధ్యతను ఎంతవరకు నెరవేర్చారని ప్రశ్నించారు. జిల్లాల నోటిఫికేషన్ […]

దున్నపోతు ఈనిందని బాబు చెబితే.. పవన్ కల్యాణ్ కట్టేసే రకం..
X

ఏపీలో జిల్లాల పునర్విభజనపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యల్ని, విమర్శల్ని తిప్పికొట్టారు మంత్రి పేర్ని నాని. దున్నపోతు ఈనింది అని చంద్రబాబు చెబితే, పవన్ కల్యాణ్ కట్టెసే రకం అని అన్నారాయన. అమరావతి రైతుల వద్ద భూములు లాక్కుంటే చంద్రబాబుని ఒక్క అడుగు కూడా కదలనివ్వబోనని ప్రగల్భాలు పలికిన పవన్, వారికి ఏం న్యాయం చేశారని నిలదీశారు. ఉద్దానం వాళ్ళ బాధ్యత తీసుకున్నాని చెప్పిన పవన్ కల్యాణ్, ఆ బాధ్యతను ఎంతవరకు నెరవేర్చారని ప్రశ్నించారు. జిల్లాల నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు పవన్ ఎక్కడ దాక్కున్నాడని, ప్రభుత్వాన్ని కలిసి సూచనలు చేసి ఉండొచ్చు కదా అని ప్రశ్నించారు. చంద్రబాబు కార్యాలయం నుంచి వచ్చిన ప్రకటనపై సంతకం చేయడం తప్ప పవన్ ఏం చేశారని అడిగారు.

మంచి చేసేటప్పుడు మంచి అని చెప్పలేని వారు నోటికి తాళం వేసుకోవాలని హితవు పలికారు నాని. చంద్రబాబు హయాంలో పాఠశాలలు మూసివేసే స్థాయి నుంచి ఈ రోజు సీట్లు లేవని బోర్డులు పెట్టే స్థాయికి సీఎం జగన్‌ తీసుకొచ్చారని అన్నారు. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని కోతలు కోసే కింగ్ మేకర్ చంద్రబాబు అనుభవం ఏమైందని నాని ప్రశ్నించారు. చివరికి ఒక నవ యువకుడి వద్ద కుప్పంను రెవిన్యూ డివిజన్ చేయాలని బాబు అభ్యర్థించాల్సి వచ్చిందని చెప్పారు. పవన్ పల్లకి మోసిన టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు లేదని, ఇప్పుడు ఉన్నది ప్రజల ఆకాంక్షలతో నడుస్తున్న ప్రభుత్వం అని అన్నారు నాని.

గుండెల నిండా టీడీపీ, మనసు నిండా చంద్రబాబు ఉన్న కమ్యూనిస్టు పార్టీ నాయకులు రామకృష్ణ, నారాయణ కూడా జిల్లాల విభజనపై అఖిలపక్షం వేయలేదని విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు నాని. “చంద్రబాబు హయాంలో శివరామకృష్ణన్ కమిటీ వికేంద్రీకరణ సూచనపై అఖిలపక్షం వేయాలని అడిగారా? ప్రత్యేక హోదా ఇస్తానన్న, తెస్తానన్న వారిపై అఖిలపక్షం వేయాలని అడిగారా? ప్యాకేజీ ముద్దు అన్నప్పుడు అఖిలపక్షం కావాలని అడిగారా?” అప్పుడు నోరు కుట్టేసుకుని చంద్రబాబుకి అవసరం వచ్చినప్పుడు మాత్రం నోరు తెరుస్తారంటూ వామపక్షాలపై మండిపడ్డారు.

ఏపీ చరిత్రలో నూతన అధ్యాయం..
కొత్త జిల్లాల ఏర్పాటుతో ఆంధ్ర ప్రదేశ్‌ చరిత్రలో నూతన అధ్యాయానికి సీఎం జగన్ నాంది పలికారని అన్నారు మంత్రి పేర్ని నాని. పరిపాలన సౌలభ్యం కోసం ఇచ్చిన మాట ప్రకారం, పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేశారని చెప్పారు. కేవలం మూడేళ్ళ పాలనానుభవంలోనే ఇలాంటి చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకోవడం గొప్ప విషయమన్నారు. అదే సమయంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, వామపక్ష నాయకులపై విమర్శల దాడి చేశారు.

First Published:  4 April 2022 10:37 AM GMT
Next Story