Telugu Global
National

చండీఘడ్ మాదే.. పంజాబ్ అసెంబ్లీ తీర్మానం..

పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు ఉమ్మడి రాజధాని, కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న చండీఘడ్ విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు మరిన్ని వివాదాలకు తావిస్తోంది. చండీఘడ్ ని తమ రాష్ట్రానికి అప్పగించేయాలంటూ పంజాబ్ అసెంబ్లీ తీర్మానం చేసింది. ఈ తీర్మానానికి బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు మద్దతిచ్చాయి. తీర్మానంపై ఓటింగ్ సమయంలో బీజేపీ ఎమ్మెల్యేలిద్దరు పంజాబ్ అసెంబ్లీనుంచి వాకవుట్ చేశారు. తేనెతుట్టెను కదిల్చిందెవరు..? ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ నాలుగింటిని చేజిక్కించుకుంది. పంజాబ్ లో […]

చండీఘడ్ మాదే.. పంజాబ్ అసెంబ్లీ తీర్మానం..
X

పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు ఉమ్మడి రాజధాని, కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న చండీఘడ్ విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు మరిన్ని వివాదాలకు తావిస్తోంది. చండీఘడ్ ని తమ రాష్ట్రానికి అప్పగించేయాలంటూ పంజాబ్ అసెంబ్లీ తీర్మానం చేసింది. ఈ తీర్మానానికి బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు మద్దతిచ్చాయి. తీర్మానంపై ఓటింగ్ సమయంలో బీజేపీ ఎమ్మెల్యేలిద్దరు పంజాబ్ అసెంబ్లీనుంచి వాకవుట్ చేశారు.

తేనెతుట్టెను కదిల్చిందెవరు..?
ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ నాలుగింటిని చేజిక్కించుకుంది. పంజాబ్ లో మాత్రం ఘోర పరాభవం ఎదురైంది. బీజేపీ అధినాయకత్వం అహం దెబ్బతిన్నది. దీంతో పంజాబ్, హర్యానాకు ఉమ్మడి రాజధానిగా ఉన్న చండీఘడ్ విషయంలో కేంద్రం మెలిక పెట్టింది. చండీఘడ్ లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర సర్వీసు నిబంధనలు వర్తిస్తాయంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. దీన్ని పంజాబ్ సీఎం భగవంత్ మన్ తీవ్రంగా వ్యతిరేకించారు. చండీఘడ్ పై కేంద్రం పెత్తనం ఏంటని నిలదీశారు. తాజాగా.. చండీఘడ్ ని పంజాబ్ కి అప్పగించాలంటూ అసెంబ్లీలో తీర్మానం చేశారు.

1966లో పంజాబ్ నుంచి హర్యానాను వేరుపరచినప్పుడు చండీఘడ్ ని ఉమ్మడి రాజధానిగా పేర్కొంటూ, కేంద్రపాలిత ప్రాంతంగా ఉంచారు. భాక్రా బియాస్‌ నిర్వహణ మండలి(బీబీఎంబీ)లో పంజాబ్ రాష్ట్రం నుంచి 60శాతం, హర్యానా నుంచి 40శాతం మంది ఉద్యోగులతో చండీఘడ్ పాలనా వ్యవహారాలు సక్రమంగా సాగేవి. కానీ ఇప్పుడు కేంద్రం చండీఘడ్ పై పెత్తనం కోసం ఈ నిబంధనల్లో మార్పులు తీసుకు రావడానికి ఉత్సాహం చూపించింది. చండీఘఢ్‌ కేంద్ర పాలిత ఉద్యోగులకు సెంట్రల్‌ సర్వీస్‌ నిబంధనలు వర్తిస్తాయంటూ గత ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ప్రకటించారు. దీంతో వివాదం రాజుకుంది. దీన్ని వ్యతిరేకించేందుకు పంజాబ్ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైంది. రాష్ట్ర విభజన జరిగినప్పుడు రాజధానిని మాతృ రాష్ట్రంలోనే కొనసాగించాలనే నిబంధనను పాటిస్తూ.. చండీఘడ్ ని పంజాబ్ కే అప్పగించాలంటూ అసెంబ్లీ తీర్మానం చేసింది.

First Published:  1 April 2022 9:07 PM GMT
Next Story