Telugu Global
Cinema & Entertainment

లైగర్ కు డబ్బింగ్ చెప్పిన బాక్సర్

పాన్ ఇండియా స్టార్ విజయ్ దేవరకొండతో భారీ అంచనాలతో రూపొందిన చిత్రం `లైగర్`. ఈ సినిమా షూటింగ్ పార్ట్ పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాధ్ దర్శకత్వం వహించిన ఈ లైగర్ సినిమాతో ప్రపంచ బాక్సర్ మైక్ టైసన్ భారతీయ సినిమాలోకి అడుగుపెట్టాడు. యుఎస్ఎ లో విజయ్ దేవరకొండతో పాటు మైక్ టైసన్ కి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించిన విషయం తెలిసిందే. తాజాగా మైక్ టైసన్ ఈ చిత్రానికి డబ్బింగ్ పూర్తి […]

లైగర్ కు డబ్బింగ్ చెప్పిన బాక్సర్
X

పాన్ ఇండియా స్టార్ విజయ్ దేవరకొండతో భారీ అంచనాలతో రూపొందిన చిత్రం 'లైగర్'. ఈ సినిమా షూటింగ్ పార్ట్ పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాధ్ దర్శకత్వం వహించిన ఈ లైగర్ సినిమాతో ప్రపంచ బాక్సర్ మైక్ టైసన్ భారతీయ సినిమాలోకి అడుగుపెట్టాడు.

యుఎస్ఎ లో విజయ్ దేవరకొండతో పాటు మైక్ టైసన్ కి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించిన విషయం తెలిసిందే. తాజాగా మైక్ టైసన్ ఈ చిత్రానికి డబ్బింగ్ పూర్తి చేశారు. “నా పట్ల దయ చూపినందుకు చాలా ధన్యవాదాలు. నేను చాలా కృతజ్ఞుడను, ”అని మైక్ టైసన్ ఒక వీడియోలో తెలిపారు.

మైక్ టైసన్ ఈ చిత్రంలో ఒక శక్తివంతమైన పాత్రను పోషించాడు. అతనిపై చిత్రీకరించిన సన్నివేశాలు మెయిన్ హైలెట్ గా నిలవుస్తాయి. విజయ్ దేవరకొండ, మైక్ టైసన్ కలిసి తెరపై చూడటం అభిమానులకు పండగే. నిజానికి ఈ సినిమాలో మైక్ టైసన్ కు బాలకృష్ణతో డబ్బింగ్ చెప్పించాలనుకున్నారట. కానీ ఆఖరి నిమిషంలో ప్లాన్ మార్చి, మైక్ తోనే డబ్బింగ్ చెప్పించారు. అలా మైస్ టైసన్ తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్నాడు.

పూరీ కనెక్ట్స్ తో కలిసి, ఈ చిత్రాన్ని బాలీవుడ్ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తోంది. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా మూవీ 2022 ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

First Published:  2 April 2022 6:58 AM GMT
Next Story