Telugu Global
Sports

ఐపీఎల్ లో లక్నో సూపర్ బోణీ

టాటా ఐపీఎల్ 15వ సీజన్ లీగ్ ప్రారంభదశ పోటీలు.. పరుగులహోరు, రికార్డుల హోరులా సాగుతున్నాయి. మొత్తం 10 జట్ల ఈ లీగ్ గ్రూప్ -బీ రెండోరౌండ్లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ పై లక్నో సూపర్ జెయింట్స్ జట్టు 6 వికెట్ల సూపర్ చేజింగ్ విజయంతో సంచలనం సృష్టించింది. ముంబై బ్రబోర్న్ స్టేడియం వేదికగా ముగిసిన ఈ పరుగుల సునామీ పోరులో.. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 7 […]

ఐపీఎల్ లో లక్నో సూపర్ బోణీ
X

టాటా ఐపీఎల్ 15వ సీజన్ లీగ్ ప్రారంభదశ పోటీలు.. పరుగులహోరు, రికార్డుల హోరులా సాగుతున్నాయి. మొత్తం 10 జట్ల ఈ లీగ్ గ్రూప్ -బీ రెండోరౌండ్లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ పై లక్నో సూపర్ జెయింట్స్ జట్టు 6 వికెట్ల సూపర్ చేజింగ్ విజయంతో సంచలనం సృష్టించింది.

ముంబై బ్రబోర్న్ స్టేడియం వేదికగా ముగిసిన ఈ పరుగుల సునామీ పోరులో.. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 7 వికెట్లకు 210 పరుగులు భారీ స్కోరు నమోదు చేసింది.
ఓపెనర్‌ రాబిన్‌ ఊతప్ప మెరుపు హాఫ్ సెంచరీతో తనజట్టుకు కళ్లు చెదిరే ఆరంభాన్ని ఇచ్చాడు. కేవలం 27 బంతుల్లోనే 8 బౌండ్రీలు, ఓ సిక్సర్ తో 50 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.

ఆల్ రౌండర్లు శివమ్‌ దూబే (30 బంతుల్లో 49; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), మోయిన్‌ అలీ (22 బంతుల్లో 35; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), మిడిలార్డర్ ఆటగాడు అంబటి రాయుడు (27; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) తమజట్టు భారీస్కోరులో ప్రధానపాత్ర వహించారు. లక్నో బౌలర్లలో ఆవేశ్ ఖాన్, టే, రవి బిష్నోయ్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.

రాహుల్- డీకాక్ పరుగుల వేట..
బ్యాటింగ్ కు అనువుగా ఉన్న బ్రబోర్న్ వికెట్ పై 211 పరుగుల భారీ లక్ష్యసాధన కోసం క్రీజులోకి దిగిన లక్నో ఓపెనర్ల జోడీ రాహుల్- డి కాక్ తొలి బంతి నుంచే ఎదురుదాడికి దిగడం ద్వారా బౌండ్రీల మోత మోగించారు.
కేవలం మొదటి 10.2 ఓవర్లలోనే 99 పరుగుల భాగస్వామ్యంతో మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. కెప్టెన్ రాహుల్ 26 బాల్స్ లో 2 బౌండ్రీలు, 3 సిక్సర్లతో 40 పరుగులకు అవుటయ్యాడు. మరో ఓపెనర్ క్వింటన్ డి కాక్ 45 బాల్స్ లో 9 బౌండ్రీలతో 61 పరుగులకు వెనుతిరగడంతో..గెలుపు భారం మిడిలార్డర్ ఆటగాడు ఇవిన్ లూయిస్ పైన పడింది.

ప్లేయర్ ఆప్ ధి మ్యాచ్ లూయిస్..
ఓపెనర్లు ఇచ్చిన మెరుపు ఆరంభాన్ని మిడిలార్డర్ ఆటగాడు ఇవిన్ లూయిస్ పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకొన్నాడు. 23 బాల్స్ లోనే 6 బౌండ్రీలు, 3 సిక్సర్లతో 55 పరుగుల నాటౌట్ స్కోరుతో నిలవడం ద్వారా మరో బంతులు మిగిలి ఉండగానే లక్నో సూపర్ చేజింగ్ విజయాన్ని ఖాయం చేశాడు.
లక్నోజట్టు 19.3 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేయడం ద్వారా.. తొలివిజయం నమోదు చేయగలిగింది.
నాలుగుసార్లు విజేత, ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రస్తుత టోర్నీలో ఇది వరుసగా రెండో ఓటమి కావడం విశేషం.

లక్నో విజయంలో ప్రధానపాత్ర వహించిన ఇవిన్ లూయిస్ కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
బ్రబోర్న్ వేదికగా ముగిసిన మొదటి రెండు లీగ్ మ్యాచ్ ల్లోనూ భారీస్కోర్లు నమోదు చేసినా..ముందుగా బ్యాటింగ్ కు దిగిన జట్లు పరాజయాలు పొందడం, చేజింగ్ కు దిగిన జట్లే విజేతలుగా నిలవడం విశేషం.
ఐపీఎల్ 15వ సీజన్ ద్వారా తొలిసారిగా బరిలో నిలిచిన లక్నో సూపర్ జెయింట్స్ జట్టు తన ప్రారంభమ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ చేతిలో కంగు తిన్నా..రెండోమ్యాచ్ లో
సూపర్ చేజింగ్ విజయం ద్వారా ఊపిరితీసుకోగలిగింది.

చెన్నై, ల‌క్నో మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌లో ల‌క్నో బోణీ కొట్టింది. చెన్నైకి మ‌రో ఎదురుదెబ్బ తాకింది. 19.3 ఓవ‌ర్ల‌లో 211 ప‌రుగులు చేసి చెన్నైని ల‌క్నో ఓడించింది. 6 వికెట్ల తేడాతో మ‌రో 3 ప‌రుగులు మిగిలి ఉండ‌గానే ల‌క్నో గెలిచింది.

మ్యాచ్‌ను ఎవిన్ లెవిస్ ఒంటి చేత్తో గెలిపించాడు. 23 బంతుల్లో లెవిస్ 55 ప‌రుగులు చేశాడు. డికాక్ కూడా 61 ప‌రుగులు చేసి ల‌క్నో గెలుపున‌కు కార‌ణం అయ్యాడు. కెప్టెన్ కేఎల్ రాహుల్ 26 బంతుల్లో 40 ప‌రుగులు చేశాడు.

చెన్నై ఇప్ప‌టికే ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో కోల్‌క‌తా చేతిలో ఓడిపోయింది. ఇప్పుడు మ‌రో ఓట‌మిని చ‌వి చూసింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆడిన రెండు మ్యాచ్‌ల‌లోనూ చెన్నై ఓడిపోయింది. మ‌రోవైపు ల‌క్నో తొలి మ్యాచ్‌లో గుజ‌రాత్ చేతుల్లో ఓడిపోయినా.. రెండో మ్యాచ్‌లో చెన్నైపై గెలిచి బోణీ కొట్టింది.

హా.. ఏమా మ్యాచ్‌! ఆబ్బబ్బా.. ఏమా బాదుడు!! ఒకరిని మించి మరొకరు దంచికొట్టడంతో నిండా నలభై ఓవర్లు కాకుండానే 420 పరుగులు నమోదయ్యాయి!! ఇరు జట్ల ఆటగాళ్లు ఆకాశమే హద్దుగా చెలరేగడంతో అభిమానులు పరుగుల పండుగ చేసుకున్నారు. లీగ్‌లో అత్యంత విజయవంతమైన జట్టుగా గుర్తింపు ఉన్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ను ఖంగు తినిపించిన అరంగేట్ర టీమ్‌ లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఐపీఎల్లో తొలి విజయాన్ని ఖాతాలో వేసుకుంది.

ముంబై: రెండు సూపర్‌ పవర్‌ల మధ్య జరిగిన పోరులో లక్నో సూపర్‌ జెయింట్స్‌దే పైచేయి అయింది. బ్యాటర్లు బాదుడే పరమావధిగా చెలరేగిన పోరులో విజయం సాధించిన లక్నో పాయింట్ల పట్టికలో ఖాతా తెరిచింది. తొలి మ్యాచ్‌లో గుజరాత్‌ చేతిలో ఓడిన లక్నో.. గురువారం జరిగిన పోరులో 6 వికెట్ల తేడాతో చెన్నై సూపర్‌ కింగ్స్‌ను చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్‌ చేసిన చెన్నై నిర్ణీత

ఆఖర్లో తాజా కెప్టెన్‌ రవీంద్ర జడేజా (17; 3 ఫోర్లు), మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ (6 బంతుల్లో 16 నాటౌట్‌; 2 ఫోర్లు, ఒక సిక్స్‌) మెరుపులు మెరిపించారు. క్రీజులో అడుగుపెట్టడంతోనే భారీ సిక్సర్‌ కొట్టిన మహేంద్రుడు అభిమానులను ఉర్రూతలూగించాడు. లక్నో బౌలర్లలో రవి బిష్ణోయ్‌, అవేశ్‌ ఖాన్‌, ఆండ్రూ టై తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో లక్నో 19.3 ఓవర్లలో 4 వికెట్లకు 211 పరుగులు చేసింది. డికాక్‌ (61; 9 ఫోర్లు), లూయిస్‌ (23 బంతుల్లో 55 నాటౌట్‌; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్‌సెంచరీలు బాదితే.. కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ (40; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆయుశ్‌ బదోనీ (9 బంతుల్లో 19 నాటౌట్‌; 2 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. బౌలర్లను సరైన రీతిలో వినియోగించుకోలేకపోయిన చెన్నై సారథి జడేజా అందుకు తగ్గ మూల్యం చెల్లించుకున్నాడు. లూయిస్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది. ఐపీఎల్‌ 15వ సీజన్‌లో భాగంగా శుక్రవారం కోల్‌కతాతో పంజాబ్‌ తలపడనుంది.

సంక్షిప్త స్కోర్లు
చెన్నై: 20 ఓవర్లలో 210/7 (ఊతప్ప 50, దూబే 49; బిష్ణోయ్‌ 2/24, అవేశ్‌ 2/38), లక్నో: 19.3 ఓవర్లలో 211/4 (డికాక్‌ 61, లూయిస్‌ 55 నాటౌట్‌; ప్రిటోరియస్‌ 2/31).

First Published:  31 March 2022 10:04 PM GMT
Next Story