Telugu Global
NEWS

టీ కాంగ్‌లో మళ్లీ జానా కీ రోల్‌ !

తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్‌ నేత జానారెడ్డి కీలక పాత్ర పోషించబోతున్నారా? రాబోయే రోజుల్లో పీసీసీని సమన్వయం చేసే బాధ్యతలు అప్పగిస్తారా? అంటే అవుననే అంటున్నారు తెలంగాణ కాంగ్రెస్‌ వర్గాలు. రెండు రోజుల కిందట ఢిల్లీలో రాహుల్‌గాంధీతో తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు సమావేశం అయ్యారు. ఈ మీటింగ్‌లో సీనియర్‌ నేతగా జానారెడ్డి గురించి చర్చ జరిగినట్లు తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్‌ నెలకొన్న పరిస్థితులను చక్క దిద్దే బాధ్యతను సీనియర్‌ నేతగా తీసుకోవాలని జానారెడ్డిని రాహుల్‌ కోరినట్లు తెలుస్తోంది. రాజకీయ […]

టీ కాంగ్‌లో మళ్లీ జానా కీ రోల్‌ !
X

తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్‌ నేత జానారెడ్డి కీలక పాత్ర పోషించబోతున్నారా? రాబోయే రోజుల్లో పీసీసీని సమన్వయం చేసే బాధ్యతలు అప్పగిస్తారా? అంటే అవుననే అంటున్నారు తెలంగాణ కాంగ్రెస్‌ వర్గాలు.

రెండు రోజుల కిందట ఢిల్లీలో రాహుల్‌గాంధీతో తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు సమావేశం అయ్యారు. ఈ మీటింగ్‌లో సీనియర్‌ నేతగా జానారెడ్డి గురించి చర్చ జరిగినట్లు తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్‌ నెలకొన్న పరిస్థితులను చక్క దిద్దే బాధ్యతను సీనియర్‌ నేతగా తీసుకోవాలని జానారెడ్డిని రాహుల్‌ కోరినట్లు తెలుస్తోంది. రాజకీయ అనుభవంతో పాటు కీలక కాంగ్రెస్‌ నేతలతో ఉన్న సంబంధాలతో చొరవ తీసుకోవాలని రాహుల్ చెప్పినట్లు సమాచారం.

గత అసెంబ్లీలో జానారెడ్డి సీఎల్పీ నేతగా ఉన్నారు. పార్టీ ఎమ్మెల్యేలతో పరిచయాలు ఉన్నాయి. నల్గొండలో కీలక నేతగా చలామణీ అవుతున్నారు. తాజాగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలతో పీసీసీ చీఫ్‌ రేవంత్‌కు గ్యాప్‌ పెరిగింది. దీంతో ఈ విభేదాలు తగ్గించేందుకు రాహుల్‌ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే జానారెడ్డి సేవలను వినియోగించుకోవాలని నిర్ణయించారట. ఇటీవల జరిగిన సమావేశంలో జానారెడ్డికి కూడా ఈవిషయం చెప్పారట. దీంతో జానారెడ్డి సీనియర్‌ నేతలతో సమావేశం పెట్టాలని చెప్పడంతో….ఈనెల 4న రాహుల్‌ మీటింగ్‌ పెట్టినట్లు తెలుస్తోంది.

పంజాబ్‌లో పీసీసీ చీఫ్‌, ఇతర నేతల మధ్య వివాదాలతో అక్కడ పార్టీకి దెబ్బ తగిలింది. అదే పరిస్థితి తెలంగాణలో రాకుండా చూడాలని జానారెడ్డి కోరినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే రాహుల్‌ ఈ నష్ట నివారణ చర్యలు చేపట్టినట్లు సమాచారం.

First Published:  31 March 2022 10:28 PM GMT
Next Story