Telugu Global
Others

ఏప్రిల్ ఫూల్స్ డే " కేటీఆర్ సెటైరిక్ ట్వీట్..

ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉండే తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.. మరోసారి తనదైన శైలిలో కేంద్రంపై చమత్కార బాణాలు విసిరారు. ఏప్రిల్ 1 ని అందరూ ఫూల్స్ డే గా పరిగణిస్తారు. అయితే ఇకపై ఏప్రిల్ 1ని ఫూల్స్ డే గానే కాకుండా అచ్చేదిన్ దివస్ గా కూడా జరుపుకోవాలంటూ ఓ కార్టూనిస్ట్ కేంద్ర ప్రభుత్వంపై సెటైర్ వేశారు. ఆ కార్టూన్ ని కోట్ చేస్తూ తెలంగాణ మంత్రి కేటీఆర్ కేంద్రంపై చెణుకులు విసిరారు. […]

ఏప్రిల్ ఫూల్స్ డే  కేటీఆర్ సెటైరిక్ ట్వీట్..
X

ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉండే తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.. మరోసారి తనదైన శైలిలో కేంద్రంపై చమత్కార బాణాలు విసిరారు. ఏప్రిల్ 1 ని అందరూ ఫూల్స్ డే గా పరిగణిస్తారు. అయితే ఇకపై ఏప్రిల్ 1ని ఫూల్స్ డే గానే కాకుండా అచ్చేదిన్ దివస్ గా కూడా జరుపుకోవాలంటూ ఓ కార్టూనిస్ట్ కేంద్ర ప్రభుత్వంపై సెటైర్ వేశారు. ఆ కార్టూన్ ని కోట్ చేస్తూ తెలంగాణ మంత్రి కేటీఆర్ కేంద్రంపై చెణుకులు విసిరారు. అచ్చేదిన్ అనేవి కేవలం ఊహాజనితమైనవేనని, అవి వాస్తవంలో లేవు, ఎన్డీయే హయాంలో రావు అనేది ఆ కార్టూన్ సారాంశం.

ఏప్రిల్ ఫూల్స్ డే అనబడే అచ్చేదిన్ దివస్.. అంటూ కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో ఆ కార్టూన్ ని రీట్వీట్ చేశారు. అక్కడితో ఆగలేదు. ఎన్డీఏ ప్రభుత్వం గురించి, ప్రధాని మోదీ గురించి తాను నిజాలు చెప్పినప్పుడల్లా కొంతమంది అనవసర రాద్ధాంతం చేస్తుంటారని, అలాంటి వారంతా దయచేసి తనను అన్ ఫాలో చేయాలని వ్యంగ్యంగా స్పందించారు కేటీఆర్. ఎందుకంటే తాను ఇక్కడితో ఆగనని, కేంద్రం తప్పుడు ప్రచారాన్ని ఎప్పుటికప్పుడు తిప్పికొడుతుంటానని చెప్పారు. ఏప్రిల్ -1 అచ్చేదిన్ కార్టూన్ పై తనదైన శైలిలో స్పందించారు కేటీఆర్.

మరోవైపు బీజేపీకి టీఆర్ఎస్ కి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. ధాన్యం కొనుగోళ్ల వ్యవహారంలో బీజేపీని టార్గెట్ చేస్తూ టీఆర్ఎస్ ఢిల్లీ కేంద్రంగా యుద్ధం మొదలు పెట్టబోతోంది. ఈ దశలో కేంద్ర ప్రభుత్వంపై కేటీఆర్ పేల్చిన జోకు మరింత హాట్ టాపిక్ గా మారింది.

First Published:  1 April 2022 3:59 AM GMT
Next Story