Telugu Global
Cinema & Entertainment

విశ్వక్ సేన్ కొత్త సినిమాలు ఇవే

తొలి చిత్రం `ఈ న‌గ‌రానికి ఏమైంది`లోనే త‌న మార్క్‌ను క్రియేట్ చేసిన న‌టుడు విశ్వ‌క్ సేన్. ఆ త‌ర్వాత భిన్న‌మైన క‌థ‌ల‌ను ఎంచుకుంటూ ఫ‌ల‌క్‌నామా దాస్ నుంచి దాస్ కా ధ‌మ్కీ వ‌ర‌కు భిన్న‌మైన క‌థ‌ల‌ను ఎంచుకుంటున్నాడు. యంగ్ ఏజ్‌లోనే నిర్మాత‌గానూ, ద‌ర్శ‌కుడిగానూ మ‌ల్టీ టాలెంటెడ్ హీరోగా గుర్తింపు పొందిన విశ్వ‌క్ సేన్, తాజాగా తన పుట్టిన‌రోజు వేడుకను సెలబ్రేట్ చేసుకున్నాడు. హైద‌రాబాద్ ప్ర‌సాద్‌ల్యాబ్ ఆవ‌ర‌ణ‌లో జ‌రిగిన ఈ వేడుక‌కు విశ్వ‌క్ సేన్ తో చిత్రాలు తీస్తున్న […]

విశ్వక్ సేన్ కొత్త సినిమాలు ఇవే
X

తొలి చిత్రం 'ఈ న‌గ‌రానికి ఏమైంది'లోనే త‌న మార్క్‌ను క్రియేట్ చేసిన న‌టుడు విశ్వ‌క్ సేన్. ఆ త‌ర్వాత భిన్న‌మైన క‌థ‌ల‌ను ఎంచుకుంటూ ఫ‌ల‌క్‌నామా దాస్ నుంచి దాస్ కా ధ‌మ్కీ వ‌ర‌కు భిన్న‌మైన క‌థ‌ల‌ను ఎంచుకుంటున్నాడు. యంగ్ ఏజ్‌లోనే నిర్మాత‌గానూ, ద‌ర్శ‌కుడిగానూ మ‌ల్టీ టాలెంటెడ్ హీరోగా గుర్తింపు పొందిన విశ్వ‌క్ సేన్, తాజాగా తన పుట్టిన‌రోజు వేడుకను సెలబ్రేట్ చేసుకున్నాడు. హైద‌రాబాద్ ప్ర‌సాద్‌ల్యాబ్ ఆవ‌ర‌ణ‌లో జ‌రిగిన ఈ వేడుక‌కు విశ్వ‌క్ సేన్ తో చిత్రాలు తీస్తున్న ర‌చ‌యిత‌లు, నిర్మాత‌లు, ద‌ర్శ‌కులు హాజ‌ర‌య్యారు.

ఈ సంద‌ర్భంగా విశ్వ‌క్‌సేన్‌పై విడుద‌ల చేసిన స్పెష‌ల్ పాట ఆక‌ట్టుకుంది. ఈ వేడుకలో రెండు కొత్త‌ చిత్రాల‌ను వెల్ల‌డించాడు విశ్వక్. ఇప్ప‌టికే 'ముఖ చిత్రం'లో ప‌వ‌ర్‌ఫుల్ లాయ‌ర్‌గా క‌నిపించ‌బోతున్నాడు. యువి.క్రియేష‌న్స్‌లో 'గామి' అనే భారీ సినిమా చేస్తున్నాడు. ఓరి దేవుడా, దాస్ కా ధ‌మ్కీ, లేడీస్ నైట్ అనే చిత్రాలు చేస్తున్నాడు. ఇవి కాకుండా ఫ‌ల‌క్ నామా దాస్ 2', 'స్టూడెంట్ జిందాబాద్‌' అనే రెండు నూత‌న చిత్రాల‌ను విశ్వ‌క్‌ ప్ర‌క‌టించారు. వాటి వివరాల్ని త్వరలోనే వెల్లడిస్తానన్నాడు.

“ఇప్ప‌టి వ‌ర‌కు ఒక ఎత్తు ఇక నుంచి మ‌రో ఎత్తు” అంటున్నాడు విశ్వక్. రాబోయే రెండేళ్లలో తన నుంచి సూపర్ హిట్ సినిమాలు చూస్తారని చెబుతున్నాడు. ఇక తన కెరీర్ కు బ్రేక్ ఇచ్చిన ఫలక్ నుమా సినిమాకు సీక్వెల్ గా పార్ట్-2 తీయబోతున్నాడు విశ్వక్. హైదరాబాద్ కు, ముంబయి కు లింక్ ఉన్న కథతో తన సీక్వెల్ రాబోతోందని ప్రకటించాడు ఈ హీరో.

First Published:  30 March 2022 9:56 AM GMT
Next Story