Telugu Global
Cinema & Entertainment

నితిన్ ఫస్ట్ ఎటాక్ అదిరింది

హీరో నితిన్ `మాచర్ల నియోజకవర్గం` చిత్రంలో గుంటూరు జిల్లా కలెక్టర్ గా సిద్ధార్థ్ రెడ్డి అనే ఐఏఎస్ అధికారి పాత్రను పోషిస్తున్నాడు. ఈ మాస్, యాక్షన్ ఎంటర్టైనర్ కి రాజ శేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఆదిత్య మూవీస్ తో కలిసి శ్రేష్ట్ మూవీస్ పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి నిర్మిస్తున్నారు. రాజ్ కుమార్ ఆకెళ్ల ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ రోజు నితిన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా మేకర్స్ సినిమా ఫస్ట్ ఎటాక్ (టీజర్)ని విడుదల […]

నితిన్ ఫస్ట్ ఎటాక్ అదిరింది
X

హీరో నితిన్ 'మాచర్ల నియోజకవర్గం' చిత్రంలో గుంటూరు జిల్లా కలెక్టర్ గా సిద్ధార్థ్ రెడ్డి అనే ఐఏఎస్ అధికారి పాత్రను పోషిస్తున్నాడు. ఈ మాస్, యాక్షన్ ఎంటర్టైనర్ కి రాజ శేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఆదిత్య మూవీస్ తో కలిసి శ్రేష్ట్ మూవీస్ పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి నిర్మిస్తున్నారు. రాజ్ కుమార్ ఆకెళ్ల ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.

ఈ రోజు నితిన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా మేకర్స్ సినిమా ఫస్ట్ ఎటాక్ (టీజర్)ని విడుదల చేశారు. నితిన్ యాక్షన్ సీన్ ను టీజర్ అద్భుతంగా ఎలివేట్ చేసింది. ముఖానికి పులి రంగు, ఒంటినిండా పులిచారలుతో వున్న కొందరు దుండగులు నితిన్ పై కొడవళ్ళతో దాడిచేయడం వారి నుంచి తను తప్పించుకోవడం తిరిగి ఎదురు దాడి చేయడం థ్రిల్ గా అనిపిస్తుంది.

ఈ ఒక్క టీజర్ తో ఈ సినిమా జానర్ ఏంటనే విషయాన్ని మేకర్స్ చెప్పకనే చెప్పారు. వెంకట్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన యాక్షన్ సీక్వెన్స్.. నితిన్ లోని మాస్, యాక్షన్ లుక్ ను ఎలివేట్ చేసింది. ప్రసాద్ మూరెళ్ల కెమెరా పనితనం, మహతి స్వర సాగర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి.

ఇదే టీజర్ లో సినిమా రిలీజ్ డేట్ కూడా ఎనౌన్స్ చేశారు. మాచర్ల నియోజకవర్గం జులై 8న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. పక్కా మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్ గా రాజకీయ అంశాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నితిన్ సరసన కృతి శెట్టి, కేథరిన్ థ్రెసా హీరోయిన్లుగా నటిస్తున్నారు.

First Published:  30 March 2022 10:03 AM GMT
Next Story