Telugu Global
Cinema & Entertainment

మరో సినిమా స్టార్ట్ చేసిన సుధీర్ బాబు

సుధీర్ బాబు హీరోగా భవ్య క్రియేషన్స్ పతాకంపై హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కుతోంది. మహేష్‌ దర్శకత్వంలో వి. ఆనంద ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి రెండో వారంలో పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభమైంది. ఈ రోజు హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేశారు. గతంలో సుధీర్ బాబు హీరోగా ‘శమంతకమణి’ చిత్రాన్ని నిర్మించింది భవ్య క్రియేషన్స్ సంస్థ. మళ్లీ ఇప్పుడు మరో హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ తో సుధీర్ బాబును తమ బ్యానర్ పైకి తీసుకొచ్చింది. […]

మరో సినిమా స్టార్ట్ చేసిన సుధీర్ బాబు
X

సుధీర్ బాబు హీరోగా భవ్య క్రియేషన్స్ పతాకంపై హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కుతోంది. మహేష్‌ దర్శకత్వంలో వి. ఆనంద ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి రెండో వారంలో పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభమైంది. ఈ రోజు హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేశారు.

గతంలో సుధీర్ బాబు హీరోగా ‘శమంతకమణి’ చిత్రాన్ని నిర్మించింది భవ్య క్రియేషన్స్ సంస్థ. మళ్లీ ఇప్పుడు మరో హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ తో సుధీర్ బాబును తమ బ్యానర్ పైకి తీసుకొచ్చింది. ఈ రోజు రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేశారు. ఏప్రిల్ 23 వరకూ ఈ షెడ్యూల్ కొనసాగుతుంది. ఇందులో సుధీర్ బాబు ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌ రోల్ చేస్తున్నాడు.

ఇతర కీలక పాత్రల్లో సీనియర్ హీరో శ్రీకాంత్, ‘ప్రేమిస్తే’ ఫేమ్ భరత్, గోపరాజు రమణ, ‘జెమినీ’ సురేష్, మైమ్ గోపి, అజయ్ రత్నం తదితరులు కనిపించనున్నారు. తొలి షెడ్యూల్‌లో హీరో, ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కించబోతున్నారు.

ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో హీరోయిన్ ఎవరనేది ఇంకా ఫిక్స్ చేయలేదు. త్వరలోనే ఆ వివరాల్ని వెల్లడిస్తారు.

First Published:  29 March 2022 9:18 AM GMT
Next Story