Telugu Global
NEWS

రేట్లు పెంచలేక.. ఏసీలు ఆఫ్ చేస్తున్నారు..

పెట్రోల్, డీజిల్ రేట్లు రోజువారీగా పెరుగుతున్న క్రమంలో.. రవాణా రంగంపై తీవ్ర ప్రభావం కనపడుతోంది. ఇప్పటికే తెలంగాణ ఆర్టీసీ చార్జీలు పెంచింది, ఏపీఎస్ ఆర్టీసీ వడ్డనకు సిద్ధం కాక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. ఇక ప్రైవేటు రంగంలో కరోనా సమయంలోనే చార్జీలు భారీగా పెంచేశారు. ఇప్పుడు మరోసారి పెంచడానికి ఆలోచిస్తున్నారు. ప్రభుత్వం ఒకేసారి భారీగా రేట్లు పెంచి కాస్త గ్యాప్ ఇస్తుందని తేలితే.. ఆటోలు, క్యాబ్ ల యాజమాన్యాలు ఓ అంచనాకు రావొచ్చు. కానీ కేంద్రం నొప్పి […]

రేట్లు పెంచలేక.. ఏసీలు ఆఫ్ చేస్తున్నారు..
X

పెట్రోల్, డీజిల్ రేట్లు రోజువారీగా పెరుగుతున్న క్రమంలో.. రవాణా రంగంపై తీవ్ర ప్రభావం కనపడుతోంది. ఇప్పటికే తెలంగాణ ఆర్టీసీ చార్జీలు పెంచింది, ఏపీఎస్ ఆర్టీసీ వడ్డనకు సిద్ధం కాక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. ఇక ప్రైవేటు రంగంలో కరోనా సమయంలోనే చార్జీలు భారీగా పెంచేశారు. ఇప్పుడు మరోసారి పెంచడానికి ఆలోచిస్తున్నారు. ప్రభుత్వం ఒకేసారి భారీగా రేట్లు పెంచి కాస్త గ్యాప్ ఇస్తుందని తేలితే.. ఆటోలు, క్యాబ్ ల యాజమాన్యాలు ఓ అంచనాకు రావొచ్చు. కానీ కేంద్రం నొప్పి తెలియకుండా రోజువారీ వాతలు పెడుతోంది. ఈ క్రమంలో ప్రైవేటు రవాణా సంస్థల యాజమాన్యాలకు కొత్త చిక్కొచ్చిపడింది.

ఓలా, ఉబెర్ క్యాబ్ లలో ఏసీలు బంద్..
పెరిగిన పెట్రోల్ రేట్లతో ఓలా, ఉబెర్ సంస్థల్లో కాంట్రాక్ట్ బేస్ కింద పనిచేసే డ్రైవర్లు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. తమ కమిషన్ పెంచాలని అడగలేరు, అదే సమయంలో కస్టమర్ల దగ్గర అధికంగా వసూలు చేయలేరు. దీంతో వారు మధ్యే మార్గాన్ని ఎంచుకున్నారు. క్యాబ్ లలో ఏసీలు బంద్ చేస్తున్నారు. ఇంధన ధరల కారణంగా ఈనెల 29 నుంచి ఓలా, ఉబెర్ క్యాబ్‌ లలో ఏసీలు బంద్ చేస్తున్నట్లు తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫాం వర్కర్స్ యూనియన్ తెలిపింది.

ఏసీకి అదనంగా రేటు..
ఓలా, ఉబెర్ క్యాబ్‌ లలో ప్రయాణించేవారు ఏసీ కావాలనుకుంటే అదనంగా రూ.25 చెల్లించాల్సి ఉంటుందని వర్కర్స్ యూనియన్ స్పష్టం చేసింది. ప్రస్తుతం పెరుగుతున్న ఇంధన ధరల కారణంగా ఏసీతో క్యాబ్‌ లు నడపడం సాధ్యం కావడం లేదని వారు చెబుతున్నారు. ఓలా, ఉబెర్ కంపెనీలు సైతం కమీషన్ రేట్లు పెంచడం లేదని.. అందుకే క్యాబ్‌ లలో ఏసీ సౌకర్యాన్ని నిలిపివేస్తున్నట్లు తెలిపారు. పాతరేట్లకు ఏసీ ఆన్ చేస్తే క్యాబ్ డ్రైవర్లు రోడ్డున పడే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విధానం మొదలైతే.. కచ్చితంగా ఓలా, ఉబెర్ సంస్థలు కూడా తమ రేట్లు సవరించే అవకాశముంది. షేర్ ఆటోల్లో కూడా రేట్ల పెంపు మొదలవుతుందనే అంచనాలున్నాయి.

First Published:  27 March 2022 9:59 PM GMT
Next Story