Telugu Global
Cinema & Entertainment

తాప్సి నుంచి తెలుగు సినిమా రెడీ

టాలీవుడ్ లో మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది తాప్సి. అప్పుడెప్పుడో వచ్చిన ఆనందో బ్రహ్మ సినిమా తర్వాత పూర్తిగా తెలుగు తెరకు దూరమైన ఈ పంజాబీ బ్యూటీ.. ఇప్పుడు మిషన్ ఇంపాజిబుల్ సినిమాతో మరోసారి టాలీవుడ్ లో మెరవబోతోంది. తాప్సీ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం `మిషన్ ఇంపాజిబుల్`. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ`ఫేమ్ స్వరూప్ దర్శకుడు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఎన్ ఎం పాషా […]

తాప్సి నుంచి తెలుగు సినిమా రెడీ
X

టాలీవుడ్ లో మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది తాప్సి. అప్పుడెప్పుడో వచ్చిన ఆనందో బ్రహ్మ సినిమా తర్వాత పూర్తిగా తెలుగు తెరకు దూరమైన ఈ పంజాబీ బ్యూటీ.. ఇప్పుడు మిషన్ ఇంపాజిబుల్ సినిమాతో మరోసారి టాలీవుడ్ లో మెరవబోతోంది. తాప్సీ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'మిషన్ ఇంపాజిబుల్'. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ'ఫేమ్ స్వరూప్ దర్శకుడు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఎన్ ఎం పాషా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

తాజాగా ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. యు/ఎ స‌ర్టిఫికెట్ పొందింది. ప్ర‌మోష‌న్‌లో భాగంగా ఇటీవ‌లే సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్‌ కు అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది. ఇందులో న‌టించిన ముగ్గురు పిల్ల‌ల న‌ట‌న హైలైట్‌ గా నిలిచింది.

దావూద్ ఇబ్ర‌హం అనే వ్య‌క్తిని ప‌ట్టుకునే క్ర‌మంలో వారికి ఎదురైన స‌మ‌స్య‌లు ఎంటర్టైనింగ్ గా వున్నాయి. ఇన్వెస్టిగేటివ్ జ‌ర్న‌లిస్టుగా తాప్సీ న‌టించింది. ఇటీవ‌లే విడుద‌లైన పాట‌కు మంచి రెస్సాన్స్ వ‌చ్చింది. దానితో సినిమాపై మ‌రింత అంచ‌నాలు పెరిగాయి. తెలుగులో డిఫ‌రెంట్ సినిమాగా రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్ 1న విడుద‌ల కాబోతుంది. ఈ సినిమా హిట్టయితే, తెలుగులో తాప్సి మరిన్ని చిత్రాలు అంగీకరించే అవకాశం ఉంది.

First Published:  27 March 2022 7:23 AM GMT
Next Story