పెరిగిన ధరలు.. ఇల్లు గుల్ల.. పర్సు ఖాళీ
ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు అన్నట్టుగా తయారైంది సామాన్యుడి పరిస్థితి. నిత్యావసర సరుకుల ధరలతో పాటు, ఇంధన, ఆర్టీసీ, విద్యుత్ ధరలు సామాన్యుడి నడ్డివిరిసేలా ఉన్నాయి. కరోనా మహమ్మారికి తోడు రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం అన్ని రంగాలపై పెను ప్రభావం చూపుతోంది. వంట నూనె, ఇంధన ధరలు మాత్రం గుట్టలు దాటి శిఖరాలెక్కుతున్నాయి. తెలంగాణలో ఇటీవల ఆర్టీసీ, విద్యుత్ చార్జీలు పెంచేందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. గ్రేటర్ హైదరాబాద్‌లో ఇప్పటికే ఆర్టీసీ చార్జీలు కూడా […]
ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు అన్నట్టుగా తయారైంది సామాన్యుడి పరిస్థితి. నిత్యావసర సరుకుల ధరలతో పాటు, ఇంధన, ఆర్టీసీ, విద్యుత్ ధరలు సామాన్యుడి నడ్డివిరిసేలా ఉన్నాయి. కరోనా మహమ్మారికి తోడు రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం అన్ని రంగాలపై పెను ప్రభావం చూపుతోంది. వంట నూనె, ఇంధన ధరలు మాత్రం గుట్టలు దాటి శిఖరాలెక్కుతున్నాయి.
తెలంగాణలో ఇటీవల ఆర్టీసీ, విద్యుత్ చార్జీలు పెంచేందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. గ్రేటర్ హైదరాబాద్‌లో ఇప్పటికే ఆర్టీసీ చార్జీలు కూడా పెరిగాయి. మధ్య తరగతి, ఉద్యోగ, వ్యాపార, ఇతర వర్గాలకు చెందిన సుమారు 16 లక్షల మందికిపైగా ప్రయాణికులు సిటీబస్సుల్లో నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. ఫలితంగా ప్రతి ప్రయాణికునిపై రోజుకు సగటున రూ.10 అదనపు భారం పడుతోంది. ఛార్జీల రూపంలో గ్రేటర్ వాసులపై నెలకు రూ.6 కోట్లకు పైగా భారం మోపింది.
గ్యాస్ బండపై తాజాగా రూ.50 పెరిగింది. పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. ఇక విద్యుత్ చార్జీలు అయితే.. గృహ విద్యుత్‌పై యూనిట్‌కు 50 పైసలు, వాణిజ్య, పారిశ్రామిక విద్యుత్‌పై యూనిట్‌కు రూ.1 చొప్పున పెంచారు. హైదరాబాద్‌లో 55 లక్షల విద్యుత్ వినియోగదారులు ఉండగా, నెలకు సగటున 1900 మిలియన్ యూనిట్లు విద్యుత్ వినియోగమవుతుంది. గృహ వినియోగ దారులపై నెలకు రూ.25 కోట్లు, వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులపై రూ.140 కోట్ల భారం. ఏడాదికి రూ.1980 కోట్ల అదనపు భారం.
ఈ ఏడాది జనవరిలో కేజీ గ్రౌండ్‌నట్ ఆయిల్ రూ.135 ఉండగా, ప్రస్తుతం రూ.185 చేరింది. సన్‌ఫ్లవర్ రిఫైన్డ్ ఆయిల్ రూ.155 ఉండగా, ప్రస్తుతం రూ.190 ఎగబాకింది. పామాయిల్ కేజీ రూ.125 ఉండగా, ప్రస్తుతం రూ.150 పెరిగింది. ఒక్కో కుటుంబం నెలకు మూడు నుంచి నాలుగు కేజీల వంట నూనె వినియోగించినా.. కుటుంబంపై సగటున రూ.200 వంట నూనె పరంగా భారం పడినట్టే.
ఇక పెరిగిన పెట్రోల్, డీజిల్, విద్యుత్, ఆర్టీసీ, వంట గ్యాస్ ఇలా తీసుకుంటే ఒక్కో కుటుంబంపై నెలకు సరాసరి రూ.750 నుంచి రూ.1000 అదనపు భారం పడినట్టే అవుతుందని సామాన్య ప్రజలు, నిపుణులు చెబుతున్నారు.