Telugu Global
National

నీటివనరులకు జియో ట్యాగ్.. హర్యానా నెంబర్-1

నీటి వనరుల సంరక్షణ, భూగర్భ జలాల పరిరక్షణ కోసం హర్యానా వినూత్న కార్యక్రమాలను చేపడుతోంది. అందులో భాగంగానే నీటి వనరులకు జియో ట్యాగింగ్ ఏర్పాటు చేస్తోంది. జియో ట్యాగ్ (భౌగోళిక గుర్తింపు) ఇవ్వడం ద్వారా దేనికదే ప్రత్యేకంగా ఉంటుంది, వాటి సంరక్షణను మరింత బాధ్యతగా నిర్వహించే అవకాశముంటుంది. ఇలా హర్యానాలో మొత్తం 18,104 నీటి వనరులకు జియో ట్యాగ్ గుర్తింపు ఇచ్చారు. ఈ పని చేసిన తొలి రాష్ట్రంగా హర్యానా గుర్తింపు తెచ్చుకుంది. ఈమేరకు ఆ రాష్ట్ర […]

నీటివనరులకు జియో ట్యాగ్.. హర్యానా నెంబర్-1
X

నీటి వనరుల సంరక్షణ, భూగర్భ జలాల పరిరక్షణ కోసం హర్యానా వినూత్న కార్యక్రమాలను చేపడుతోంది. అందులో భాగంగానే నీటి వనరులకు జియో ట్యాగింగ్ ఏర్పాటు చేస్తోంది. జియో ట్యాగ్ (భౌగోళిక గుర్తింపు) ఇవ్వడం ద్వారా దేనికదే ప్రత్యేకంగా ఉంటుంది, వాటి సంరక్షణను మరింత బాధ్యతగా నిర్వహించే అవకాశముంటుంది. ఇలా హర్యానాలో మొత్తం 18,104 నీటి వనరులకు జియో ట్యాగ్ గుర్తింపు ఇచ్చారు. ఈ పని చేసిన తొలి రాష్ట్రంగా హర్యానా గుర్తింపు తెచ్చుకుంది. ఈమేరకు ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజీవ్ కౌషల్, కేంద్ర జలశక్తి శాఖకు ఓ లేఖ రాశారు. జలశక్తి అభియాన్ కార్యక్రమం అమలు తీరుని కూడా ఆయన వివరించారు. 206కోట్ల రూపాయల నాబార్డ్ నిధులతో హర్యానాలో 35 మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్ట్ లు ఏర్పాటు చేస్తున్నారు.

హర్యానాలో చేపట్టిన జలసంరక్షణ చర్యల ద్వారా భూగర్భ జలాల శాతం బాగా పెరిగిందని చెబుతున్నారు అధికారులు. గతంలోకంటే భూగర్భ నీటిశాతం మరింత మెరుగైందని, 22 గ్రామాల్లో ప్రయోగాత్మకంగా ఈ కార్యక్రమం చేపట్టామని, దీన్ని రాష్ట్రమంతా విస్తరిస్తున్నామని తెలిపారు. హర్యానాలో వర్షపునీటిని ఆధారం చేసుకుని 49,136 చెక్ డ్యామ్ లు ఇతరత్రా చెరువులు నిర్మించారు. 8623 సంప్రదాయ చెరువులకు పూర్తి స్థాయిలో మరమ్మతులు చేశారు. 22 జిల్లాల్లో నీటి సంరక్షణ ప్రణాళికలు అమలు చేస్తున్నారు.

మొత్తమ్మీద జియో ట్యాగింగ్ వ్యవస్థతో నీటి వనరుల సంరక్షణ సమర్థంగా నిర్వహిస్తున్నట్టు చెబుతున్నారు అధికారులు. జియో ట్యాగ్ వేసిన తర్వాత ఎప్పటికప్పుడు ఆ సమాచారాన్ని స్థానిక అధికారులు ఉన్నతాధికారులకు చేరవేస్తుంటారు. ఆక్రమణలు, కబ్జాలు వంటివి పూర్తిగా కనుమరుగైపోతాయి. ప్రస్తుతం హర్యానాలో సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ సారథ్యంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. నీటివనరుల సంరక్షణలో దేశానికే ఖట్టర్ ప్రభుత్వం ఆదర్శంగా నిలుస్తోంది.

First Published:  25 March 2022 9:46 PM GMT
Next Story