Telugu Global
NEWS

స‌ర్వం సిద్ధం.. అదేరోజు కొత్త జిల్లాల నుంచి పాల‌న‌

ప‌రిపాల‌న సౌల‌భ్యం కోసం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ప్ర‌స్తుత 13 జిల్లాల‌ను 26 జిల్లాలుగా మార్చామ‌ని చెబుతున్న ఏపీ ప్ర‌భుత్వం.. జిల్లాల నుంచి పరిపాల‌న సాగించేందుకు వ‌డివ‌డిగా అడుగులేస్తోంది. ప్రజలు, ప్రజా ప్రతినిధుల నుంచి వచ్చిన వినతులను పరిగణనలోకి తీసుకున్న నేప‌థ్యంలో ఈనెల 31వ తేదీన‌ కొత్త జిల్లాలు, డివిజన్ల ఏర్పాటుకు సంబంధించిన తుది నోటిఫికేషన్ విడుద‌ల కానున్న‌ట్టు తెలుస్తోంది. అసెంబ్లీ బ‌డ్జెట్ సమావేశాల్లో పలువురు శాసన సభ్యులు కొత్త జిల్లాలపై తమ విజ్ఞప్తులను సీఎం దృష్టికి తీసుకెళ్లారని, వాటన్నింటిపైనా […]

స‌ర్వం సిద్ధం.. అదేరోజు కొత్త జిల్లాల నుంచి పాల‌న‌
X

ప‌రిపాల‌న సౌల‌భ్యం కోసం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ప్ర‌స్తుత 13 జిల్లాల‌ను 26 జిల్లాలుగా మార్చామ‌ని చెబుతున్న ఏపీ ప్ర‌భుత్వం.. జిల్లాల నుంచి పరిపాల‌న సాగించేందుకు వ‌డివ‌డిగా అడుగులేస్తోంది. ప్రజలు, ప్రజా ప్రతినిధుల నుంచి వచ్చిన వినతులను పరిగణనలోకి తీసుకున్న నేప‌థ్యంలో ఈనెల 31వ తేదీన‌ కొత్త జిల్లాలు, డివిజన్ల ఏర్పాటుకు సంబంధించిన తుది నోటిఫికేషన్ విడుద‌ల కానున్న‌ట్టు తెలుస్తోంది.

అసెంబ్లీ బ‌డ్జెట్ సమావేశాల్లో పలువురు శాసన సభ్యులు కొత్త జిల్లాలపై తమ విజ్ఞప్తులను సీఎం దృష్టికి తీసుకెళ్లారని, వాటన్నింటిపైనా ముఖ్యమంత్రి సమీక్షించారని, వాటిని పరిగణనలోకి తీసుకొని కొత్త జిల్లాలకు తుది రూపం ఇవ్వనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

అక్క‌డ‌క్క‌డ ఆందోళ‌న‌లు కొన‌సాగుతున్నా.. ప్ర‌భుత్వం తాను అనుకున్న‌ట్టుగానే తెలుగు నూత‌న‌ సంవ‌త్స‌రం ఉగాది పండుగ ఏప్రిల్ 2వ తేదీన‌ లాంఛనంగా కొత్త జిల్లాల నుంచి ప‌రిపాల‌న కార్య‌క‌లాపాలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది.

జిల్లాల నుంచి ప‌రిపాల‌న సాగించేలా కార్యాల‌యాల‌ను సైతం అధికారులు గుర్తించారు. జిల్లా, డివిజన్‌ స్థాయి కార్యాలయాల్లో పోస్టుల విభజన, ఉద్యోగుల ప్రొవిజనల్‌ కేటాయింపు కసరత్తు పూర్తయింది. నూతన రెవెన్యూ డివిజన్లలో పోస్టుల విభజన, ఉద్యోగుల కేటాయింపులను జనాభా ప్రాతిపదికన పూర్తి చేశారు. కొత్త జిల్లాలు, డివిజన్లకు సుమారు పది వేల మంది ఉద్యోగులు ప్రొవిజనల్‌ కేటాయింపుతో పాటు బదిలీలు కానున్నట్లు ఆర్థిక శాఖ అంచనా వేసింది.

ప్రొవిజనల్‌ కేటాయింపులో కొత్త జిల్లాలకు బదిలీ చేసే ఉద్యోగులు, అధికారుల సర్వీసు సీనియారిటీతో పాటు ఇతర సర్వీసు అంశాలన్నీ యథాతథంగా ఉంటాయి. కొత్త జిల్లాలు, డివిజన్లకు ప్రొవిజనల్‌ కేటాయింపులతో బదిలీ అయ్యే ఉద్యోగుల స్థానికత యథాతధంగా ఉంటుందని ఆర్థిక శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది.

First Published:  26 March 2022 3:11 AM GMT
Next Story