Telugu Global
National

గగన విహారం.. విలాసం కాదు.. అవసరం..

కొవిడ్ తర్వాత భారతీయుల జీవన శైలిలో చాలా మార్పులొచ్చాయి. ఉద్యోగ, వ్యాపారాల్లోనే కాదు.. జీవన విధానం కూడా మారిపోయింది. ఒకప్పుడు లగ్జరీ అనుకునేవన్నీ ఇప్పుడు నిత్యావసరంగా మారిపోయాయి. కొవిడ్ తర్వాత వ్యక్తిగత ప్రయాణ వాహనాలకు డిమాండ్ పెరగడం కూడా ఇందులో భాగమే. టూవీలర్లతో పాటు, కార్ల వినియోగం కూడా బాగా పెరిగింది. సగటు ఉద్యోగి కూడా డౌన్ పేమెంట్ కట్టేసి అర్జెంట్ గా కారుకి ఓనర్ అయిపోతున్నాడు. కథ ఇక్కడితో ఆగలేదు. దూర ప్రయాణాలు చేసేవారికి విమానయానం […]

గగన విహారం.. విలాసం కాదు.. అవసరం..
X

కొవిడ్ తర్వాత భారతీయుల జీవన శైలిలో చాలా మార్పులొచ్చాయి. ఉద్యోగ, వ్యాపారాల్లోనే కాదు.. జీవన విధానం కూడా మారిపోయింది. ఒకప్పుడు లగ్జరీ అనుకునేవన్నీ ఇప్పుడు నిత్యావసరంగా మారిపోయాయి. కొవిడ్ తర్వాత వ్యక్తిగత ప్రయాణ వాహనాలకు డిమాండ్ పెరగడం కూడా ఇందులో భాగమే. టూవీలర్లతో పాటు, కార్ల వినియోగం కూడా బాగా పెరిగింది. సగటు ఉద్యోగి కూడా డౌన్ పేమెంట్ కట్టేసి అర్జెంట్ గా కారుకి ఓనర్ అయిపోతున్నాడు. కథ ఇక్కడితో ఆగలేదు. దూర ప్రయాణాలు చేసేవారికి విమానయానం తప్పనిసరిగా మారింది. కొవిడ్ ఆంక్షలు తర్వాత భారత్ లో విమానయానం పెరిగింది. వచ్చే 20ఏళ్లలో ప్రపంచ వ్యాప్తంగా విమాన ప్రయాణికుల సంఖ్యలో 3.9 శాతం వృద్ధి ఉంటుందని సర్వేలు చెబుతున్నాయి. అదే సమయంలో భారత్ లో ఆ వృద్ధి శాతం 6.2గా ఉంటుందని తేలడం మాత్రం విశేషం. రాబోయే 20 ఏళ్లలో భారత్ కి కొత్తగా 2210 విమానాలు కావాల్సి ఉందని ఇప్పటికే విమానయాన సంస్థలు అంచనా వేశాయి.

గత పదేళ్లలో భారత్ లో దేశీయ విమాన ప్రయాణాల సంఖ్య మూడు రెట్లు, విదేశీ ప్రయాణాల సంఖ్య రెండు రెట్లు పెరిగింది. కొవిడ్ తర్వాత ఇది మరింతగా పుంజుకుంది. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా దేశంలోని విమానయాన సంస్థలకు వచ్చే పదేళ్ల పాటు సగటున వారానికి ఒకటి చొప్పున విమానాలు డెలివరీ చేయబోతున్నట్టు ఎయిర్‌ బస్‌ సంస్థ వెల్లడించింది.

ప్రైవేట్ జెట్ లదే హవా..
సామాన్యులు విమానయానం అవసరంగా మారగా.. సెలబ్రిటీలు, వివిధ సంస్థల అధిపతులు ప్రైవేట్ జెట్ ల వైపు దృష్టిమళ్లించారు. గతంలో బిజినెస్ క్లాస్ ప్రయాణాలు చేసేవారంతా.. ఇప్పుడు ప్రైవేట్ జెట్ లను ఎంపిక చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. భద్రత, రక్షణకు పెద్దపీట వేస్తూ.. కంపెనీ అధిపతులు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు విస్తృతంగా ప్రైవేట్‌ జెట్ లను వినియోగిస్తున్నారు. భవిష్యత్తులో ప్రైవేట్‌ జెట్ ల వినియోగం మరింత పెరిగే అవకాశముంది. ప్రస్తుతం భారత్ లో 150 విమానాలు ప్రైవేట్‌ జెట్‌ సేవలందిస్తున్నాయి. వచ్చే ఐదేళ్లలో విమానాల సంఖ్య 1000కి చేరే అవకాశం ఉంది. కొవిడ్‌ తర్వాత ప్రైవేట్‌ జెట్ ల పరిశ్రమ ఐదింతలు వృద్ధి చెందడం విశేషం.

First Published:  24 March 2022 11:56 PM GMT
Next Story