Telugu Global
Health & Life Style

గుండెపోటు, మధుమేహం.. ఇకపై గూగుల్ నుంచి హెచ్చరికలు..

మీకు గుండెపోటు వచ్చే ముప్పు ఉంది, అర్జెంట్ గా డాక్టర్ దగ్గరకు వెళ్లండి. మీకు మధుమేహం రిస్క్ ఎక్కువగా ఉంది, వెంటనే ఆహారపు అలవాట్లు మార్చుకోండి, వ్యాయామం మొదలు పెట్టండి. ఇకపై ఇలాంటి మెసేజ్ లు మనకు గూగుల్ నుంచి రావొచ్చు. అవును, మనకు తెలియకుండానే మన ఆరోగ్య సమాచారాన్ని గూగుల్ పసిగడుతుంది. ముందస్తు హెచ్చరికలు చేస్తుంది. ప్రస్తుతం దానికి సంబంధించిన పరిశోధనలు జోరందుకున్నాయని, త్వరలోనే ఈ సేవలు స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు అందుబాటులోకి వస్తాయని చెప్పింది […]

గుండెపోటు, మధుమేహం.. ఇకపై గూగుల్ నుంచి హెచ్చరికలు..
X

మీకు గుండెపోటు వచ్చే ముప్పు ఉంది, అర్జెంట్ గా డాక్టర్ దగ్గరకు వెళ్లండి. మీకు మధుమేహం రిస్క్ ఎక్కువగా ఉంది, వెంటనే ఆహారపు అలవాట్లు మార్చుకోండి, వ్యాయామం మొదలు పెట్టండి. ఇకపై ఇలాంటి మెసేజ్ లు మనకు గూగుల్ నుంచి రావొచ్చు. అవును, మనకు తెలియకుండానే మన ఆరోగ్య సమాచారాన్ని గూగుల్ పసిగడుతుంది. ముందస్తు హెచ్చరికలు చేస్తుంది. ప్రస్తుతం దానికి సంబంధించిన పరిశోధనలు జోరందుకున్నాయని, త్వరలోనే ఈ సేవలు స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు అందుబాటులోకి వస్తాయని చెప్పింది గూగుల్ సంస్థ.

సెల్ ఫోన్ లో ఉండే మైక్రో ఫోన్ ద్వారా గుండె లయను అంచనా వేస్తారు, ఏమాత్రం తేడా వచ్చినా వెంటనే డాక్టర్ ని కలవాలని సూచిస్తారు. స్మార్ట్ ఫోన్ లోపల ఉండే ఈ మైక్రోఫోన్ ని ఛాతిపై ఉంచినపుడు హృదయ స్పందనలను కచ్చితంగా అంచనా వేయొచ్చని, తద్వారా ముందస్తు ముప్పుని గుర్తించొచ్చని చెబుతున్నారు గూగుల్ ప్రతినిధులు. ఇక కనుపాపల చిత్రాల ద్వారా మధుమేహం ముప్పుని కూడా ముందుగానే పసిగట్టొచ్చని అంటున్నారు. అయితే రోగ నిర్థారణకోసం దీన్ని ప్రామాణికంగా తీసుకోలేమని, రిస్క్ స్థాయిని అంచనా వేయొచ్చని చెబుతున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హెడ్ ఆఫ్ హెల్త్ గ్రెగ్ కొరాడో.

ఇప్పటికే గూగుల్ ఫిట్ యాప్ ద్వారా వినియోగదారుల సమాచారం సేకరించి, దాన్ని విశ్లేషించి నిర్ణయం తీసుకోవడం అందుబాటులోకి వచ్చింది. అయితే ఇప్పుడీ యాప్ లతో సంబంధం లేకుండా నేరుగా వినియోగదారుల ఆరోగ్య సమాచారాన్ని సేకరించేందుకు గూగుల్ ప్రయత్నిస్తోంది. ఈ పరిశోధన విజయవంతం అయి, పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ఆరోగ్య రంగంలో మరో ముందడుగు పడినట్టే చెప్పాలి.

First Published:  25 March 2022 12:29 AM GMT
Next Story