Telugu Global
Cinema & Entertainment

దానయ్య కొడుకు హీరోగా సినిమా

నిర్మాత డీవీవీ దానయ్య కొడుకు కళ్యాణ్ హీరోగా పరిచయమౌతున్నాడు. ప్రశాంత్ వర్మ తను చేసే సినిమాలతో హీరోలను సూపర్ హీరోలను చేస్తున్నాడు. టాలీవుడ్ కి జాంబి కాన్సెప్ట్ ను పరిచయం చేసిన తర్వాత, ప్రశాంత్ వర్మ పాన్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో సినిమా `హను-మాన్`ని రూపొందిస్తున్నాడు. ఇందులో తేజ సజ్జ టైటిల్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఇప్పుడు కళ్యాణ్ ను హీరోగా పరిచయం చేస్తూ మరో సూపర్ హీరో ఫిలిం చేయబోతున్నాడు ప్రశాంత్ వర్మ. ఈ […]

దానయ్య కొడుకు హీరోగా సినిమా
X

నిర్మాత డీవీవీ దానయ్య కొడుకు కళ్యాణ్ హీరోగా పరిచయమౌతున్నాడు. ప్రశాంత్ వర్మ తను చేసే సినిమాలతో హీరోలను సూపర్ హీరోలను చేస్తున్నాడు. టాలీవుడ్ కి జాంబి కాన్సెప్ట్ ను పరిచయం చేసిన తర్వాత, ప్రశాంత్ వర్మ పాన్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో సినిమా 'హను-మాన్'ని రూపొందిస్తున్నాడు. ఇందులో తేజ సజ్జ టైటిల్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఇప్పుడు కళ్యాణ్ ను హీరోగా పరిచయం చేస్తూ మరో సూపర్ హీరో ఫిలిం చేయబోతున్నాడు ప్రశాంత్ వర్మ. ఈ చిత్రానికి 'అధీర' అనే టైటిల్ పెట్టారు.

భారతీయ పౌరాణిక పాత్రల నుండి ప్రేరణ పొందిన ప్రశాంత్ వర్మ.. మార్వెల్, డీసీ వంటి సూపర్ హీరోలను క్రియేట్ చేస్తున్నాడు. సినిమాటిక్ యూనివర్స్ నుండి ప్రశాంత్ వర్మ సృష్టిస్తున్న ఈ సినిమా స్క్రిప్ట్, నెరేషన్ ఎంతో ప్రత్యేకంగా ఉండబోతోంది. కళ్యాణ్ టైటిల్ రోల్ లో కనిపించనున్న ఈ సూపర్ హీరో చిత్రం అధీర ఎంతో ప్రత్యేకతను సంతరించుకోనుంది.

గ్రాండ్ గా ఉండేలా డిజైన్ చేసిన 'అధీర' పోస్టర్ ను ఆర్ఆర్ఆర్ త్రయం రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ సంయుక్తంగా విడుదల చేశారు. పోస్టర్ చూస్తుంటే.. చిన్నప్పటి నుంచీ అధీరకు పవర్స్ ఉన్నాయనే విషయం అర్థమౌతోంది. విజువల్స్ గ్రాండియర్ గా వున్నాయి. బ్యాక్ గ్రౌండ్ సంగీతం మరో స్థాయిలో వుంది. ప్రత్యేకంగా రూపొందించిన ఆయుధంతో ఎనర్జీ లెవెల్ పెంచేలా వీడియోలో అధీరగా కళ్యాణ్ కనిపించాడు. తన చేతిలో వున్న ఆయుధం వెన్నెముక ఆకారంలో ఉండి, ఇంద్రుడి శక్తివంతమైన ఆయుధం వజ్రాయుధం ను పోలివుంది.

‘అధీర ఫస్ట్ స్ట్రైక్’ అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంది. ఈ సినిమాలో ఇంతకు ముందెన్నడూ చూడని యాక్షన్ సీక్వెన్స్ హైలైట్ గా వుండబోతున్నాయి. గౌరీహరి సంగీతం అందిస్తున్నాడు. హను-మాన్ పనులను ప్రశాంత్ వర్మ పూర్తి చేసిన తర్వాత ' అధీర 'కు సంబంధించిన వివరాలు తెలియజేయనున్నారు.

First Published:  23 March 2022 10:11 AM GMT
Next Story