Telugu Global
NEWS

రోడ్ల మీద తిరిగే పోరంబోకులు, రౌడీల్లా టీడీపీ ప్రవర్తన " ఏపీ ప్ర‌భుత్వ విప్ కాపు రామ‌చంద్రారెడ్డి

తెలుగుదేశం పార్టీ స‌భ్యుల‌పై ఏపీ ప్ర‌భుత్వ విప్ కాపు రామ‌చంద్రారెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌జాస్వామ్యానికి దేవాల‌యం లాంటి శాస‌న‌స‌భ‌లో తెలుగుదేశం పార్టీ శాస‌న‌స‌భ్యులు రోడ్ల మీద తిరిగే పోరంబోకులు, రౌడీల్లా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని, సిగ్గు, శ‌రం, మానం, మ‌ర్యాద‌, సంస్కారం అనేవి ఏమీ లేన‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని విమ‌ర్శించారు. అసెంబ్లీలో నిన్న విజిల్స్ వేసి గంద‌ర‌గోళం సృష్టించారు.. నేడు చిడ‌త‌లు తీసుకువ‌చ్చి తాళాలు వాయిస్తున్నార‌ని, స‌భ జ‌ర‌గ‌కూడ‌ద‌న్న‌దే టీడీపీ ఉద్దేశంలా ఉన్న‌ట్టుంద‌న్నారు. ఇష్టారీతిగా ప్ర‌వ‌ర్తించ‌డానికి శాస‌న‌స‌భ తెలుగుదేశం పార్టీ […]

రోడ్ల మీద తిరిగే పోరంబోకులు, రౌడీల్లా టీడీపీ ప్రవర్తన  ఏపీ ప్ర‌భుత్వ విప్ కాపు రామ‌చంద్రారెడ్డి
X

తెలుగుదేశం పార్టీ స‌భ్యుల‌పై ఏపీ ప్ర‌భుత్వ విప్ కాపు రామ‌చంద్రారెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌జాస్వామ్యానికి దేవాల‌యం లాంటి శాస‌న‌స‌భ‌లో తెలుగుదేశం పార్టీ శాస‌న‌స‌భ్యులు రోడ్ల మీద తిరిగే పోరంబోకులు, రౌడీల్లా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని, సిగ్గు, శ‌రం, మానం, మ‌ర్యాద‌, సంస్కారం అనేవి ఏమీ లేన‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని విమ‌ర్శించారు. అసెంబ్లీలో నిన్న విజిల్స్ వేసి గంద‌ర‌గోళం సృష్టించారు.. నేడు చిడ‌త‌లు తీసుకువ‌చ్చి తాళాలు వాయిస్తున్నార‌ని, స‌భ జ‌ర‌గ‌కూడ‌ద‌న్న‌దే టీడీపీ ఉద్దేశంలా ఉన్న‌ట్టుంద‌న్నారు.

ఇష్టారీతిగా ప్ర‌వ‌ర్తించ‌డానికి శాస‌న‌స‌భ తెలుగుదేశం పార్టీ స‌భ్యుల‌ది కాద‌ని, 175 మంది స‌భ్యుల‌ద‌ని గుర్తించుకోవాల‌న్నారు. మాట్లాడితే.. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్ర‌బాబు.. తెలుగుదేశం స‌భ్యుల‌కు నేర్పిన సంస్కారం, శిక్షణ ఇదేనా..? అని ప్ర‌శ్నించారు. టీడీపీ స‌భ్యుల బుర్ర‌ల్లో మ‌నుషుల‌కు ఉండే సాఫ్ట్‌వేర్ బ‌దులు.. రాక్షసులకి ఉండే సాఫ్ట్‌వేర్ వారి బుర్రల్లో ఉంద‌న్నారు.

అసెంబ్లీలో టీడీపీ సభ్యులు చిడతలు వాయించడంపై ఎమ్మెల్యే అంబటి రాంబాబు స్పందించారు. 2024 ఎన్నికల తర్వాత టీడీపీ నేతలంతా చిడతలు వాయించుకోవాల్సిందేని ఎద్దేవా చేశారు.

శాస‌న‌స‌భ‌లో టీడీపీ స‌భ్యుల తీరుపై స్పీక‌ర్ సైతం ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వారి తీరు మారకపోవడంతో సభ నుంచి రెండు రోజుల పాటు సస్పెండ్‌ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రజాధనాన్ని టీడీపీ స‌భ్యులు వృథా చేస్తున్నారంటూ స్పీకర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

First Published:  23 March 2022 2:24 AM GMT
Next Story