Telugu Global
National

ప్రభుత్వాలు కొలువుదీరుతున్నాయి.. వడ్డింపులు మొదలయ్యాయి..

అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గినప్పుడే భారత్ లో ధరలు భారీగా పెరిగాయి. మరిప్పుడు అంతర్జాతీయంగా బ్యారెల్ ధరలు భగ్గుమంటున్న వేళ, కేంద్ర ప్రభుత్వం వడ్డింపులకు దిగకుండా ఊరుకుంటుందా. అసెంబ్లీ ఎన్నికలు అడ్డుపడ్డాయి కానీ లేకపోతే ఈ పాటికే మోతమోగిపోయేది. రిజ‌ల్ట్స్‌ ప్రకటించినరోజే వడ్డింపుల వార్త వినాల్సి వస్తుందని అందరూ అంచనా వేసినా జస్ట్ పదిరోజుల గ్యాప్ లో మూహూర్తం కుదిరింది. వడ్డింపులు మెల్లగా మొదలయ్యాయి. పెట్రోల్, డీజిల్ రేట్లను పైసల్లో పెంచిన కేంద్రం.. వంట గ్యాస్ పై […]

ప్రభుత్వాలు కొలువుదీరుతున్నాయి.. వడ్డింపులు మొదలయ్యాయి..
X

అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గినప్పుడే భారత్ లో ధరలు భారీగా పెరిగాయి. మరిప్పుడు అంతర్జాతీయంగా బ్యారెల్ ధరలు భగ్గుమంటున్న వేళ, కేంద్ర ప్రభుత్వం వడ్డింపులకు దిగకుండా ఊరుకుంటుందా. అసెంబ్లీ ఎన్నికలు అడ్డుపడ్డాయి కానీ లేకపోతే ఈ పాటికే మోతమోగిపోయేది. రిజ‌ల్ట్స్‌ ప్రకటించినరోజే వడ్డింపుల వార్త వినాల్సి వస్తుందని అందరూ అంచనా వేసినా జస్ట్ పదిరోజుల గ్యాప్ లో మూహూర్తం కుదిరింది. వడ్డింపులు మెల్లగా మొదలయ్యాయి. పెట్రోల్, డీజిల్ రేట్లను పైసల్లో పెంచిన కేంద్రం.. వంట గ్యాస్ పై ఏకంగా 50 రూపాయలు వడ్డించింది.

ఐదు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కొలువుదీరుతున్న వేళ.. కేంద్రం కొరడా బయటకు తీసింది. దాదాపు 5 నెలల గ్యాప్ తర్వాత తొలిసారిగా చమురు సంస్థలు ఇంధన ధరలు పెంచాయి. పెరిగిన ధరలు ఈరోజునుంచి అమలులోకి వచ్చేశాయి. తెలంగాణలో లీటర్‌ పెట్రోల్‌ పై 90పైసలు, డీజిల్‌ పై 87 పైసలు పెంచారు. ఏపీలో పెట్రోల్‌ పై 88 పైసలు, డీజిల్‌ పై 83 పైసలు పెరిగింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్ లో చమురు ధరలు పెరిగాయి, దీంతో భారత్ లో కూడా పెంపు అనివార్యం అని ప్రభుత్వం సర్దిచెప్పుకుంటోంది. అయితే ఈ పెంపు ఎన్నిరోజులు కొనసాగుతుందో తేలాల్సి ఉంది.

వంటగ్యాస్ పై రూ.50 వడ్డన..
పెట్రోల్, డీజిల్ తోపాటు.. వంట గ్యాస్ సిలిండర్‌ ధర కూడా భారీగా పెరిగింది. 14 కేజీల వంట గ్యాస్‌ సిలిండర్‌ పై రూ.50 వడ్డించాయి. ఈ ధరలు కూడా ఈరోజునుంచే అమలులోకి వస్తున్నాయి. గ్యాస్ బుకింగ్ ని వాయిదా వేసినవారంతా 50 రూపాయలు కోల్పోయినట్టే లెక్క. తెలంగాణలో 14 కేజీల వంట గ్యాస్‌ ధర తొలిసారి వెయ్యి దాటేసింది. రూ.1002కు చేరింది… ఏపీలో 14 కిలోల గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.1008కి పెరిగింది. ఇప్పటికే వంటనూనెల ధరలు పెరిగాయి, ఇప్పుడు వంట గ్యాస్ కూడా వంటింట్లో మంట పెట్టింది.

First Published:  22 March 2022 12:00 AM GMT
Next Story