Telugu Global
National

ఆన్ లైన్ మెడిసిన్ చదువులకు భారత్ గుర్తింపునిస్తుందా..?

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా వేలాదిమంది మెడిసిన్ విద్యార్థులు ఉక్రెయిన్ నుంచి భారత్ కి తిరిగొచ్చారు. కొంతమంది మాత్రం అక్కడే సురక్షిత ప్రాంతాల్లో ఉంటూ పరిస్థితులు చక్కబడతాయేమోనని ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్ కి తిరిగొచ్చిన విద్యార్థుల కెరీర్ అగమ్యగోచరంగా ఉంది. కోర్స్ పూర్తయినవారు భారత్ లోనే ఇంటర్న్ షిప్ పూర్తి చేసేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉంది. మరి కోర్సు మధ్యలోనే ఉన్నవారి సంగతేంటి..? వారంతా విద్యా సంవత్సరాన్ని వృథా చేసుకోవాల్సిందేనా..? దీనిపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నా.. […]

ఆన్ లైన్ మెడిసిన్ చదువులకు భారత్ గుర్తింపునిస్తుందా..?
X

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా వేలాదిమంది మెడిసిన్ విద్యార్థులు ఉక్రెయిన్ నుంచి భారత్ కి తిరిగొచ్చారు. కొంతమంది మాత్రం అక్కడే సురక్షిత ప్రాంతాల్లో ఉంటూ పరిస్థితులు చక్కబడతాయేమోనని ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్ కి తిరిగొచ్చిన విద్యార్థుల కెరీర్ అగమ్యగోచరంగా ఉంది. కోర్స్ పూర్తయినవారు భారత్ లోనే ఇంటర్న్ షిప్ పూర్తి చేసేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉంది. మరి కోర్సు మధ్యలోనే ఉన్నవారి సంగతేంటి..? వారంతా విద్యా సంవత్సరాన్ని వృథా చేసుకోవాల్సిందేనా..? దీనిపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నా.. ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు ఉక్రెయిన్ యూనివర్శిటీలు ఆన్ లైన్ క్లాసులకు సిద్ధం కావాలంటూ విద్యార్థులకు సందేశాలు పంపుతున్నాయి.

ఉక్రెయిన్ మెడికల్ కాలేజీలన్నీ యుద్ధం కారణంగా ఆన్ లైన్ బోధనవైపు మొగ్గు చూపుతున్నాయి. ఈమేరకు విద్యార్థులను సిద్ధం కావాలంటూ మెసేజ్ లు, ఈమెయిల్స్ పంపించాయి. అయితే ఆన్ లైన్ మెడిసిన్ చదువులకు భారత్ లో గుర్తింపు లేదు. ఈమేరకు నేషనల్ మెడికల్ కమిషన్ నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి. అయితే ప్రస్తుతం తమకు ఆన్ లైన్ లో కేవలం థియరీ మాత్రమే చెబుతారని, కనీసం దానికైనా అనుమతివ్వాలని విద్యార్థులు భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

కాలేజీ మారడం ఇష్టంలేదు..
ఉక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్థులకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను సూచించినా వారంతా కాలేజీ లేదా యూనివర్శిటీ మారేందుకు ఇష్టపడటంలేదు. తాము ఉక్రెయిన్ లోనే వైద్య విద్య పూర్తి చేస్తామంటున్నారు. యూనివర్శిటీ మారితే భవిష్యత్తులో తమకు ఇబ్బందులు వస్తాయేమోనని భయపడుతున్నారు. యూనివర్శిటీ మారితే భారత్ సహా ఇతర దేశాల్లో తమ కోర్సుకి గుర్తింపు ఉంటుందా లేదా అనే ఆందోళనలో ఉన్నారు. మరోవైపు చైనాలో మెడిసిన్ చదువుతున్న విద్యార్థులకు కూడా రెండేళ్లు గ్యాప్ వచ్చింది. అక్కడి యూనివర్శిటీలు క్లాసులు మొదలు పెడుతున్నట్టు కబురు పంపినా విద్యార్థులు మాత్రం భారత్ నుంచి వెళ్లేందుకు సిద్ధంగా లేరు. మరోసారి చైనాలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆందోళనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆన్ లైన్ క్లాసులపై భారత ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందో లేదో చూడాలి. ప్రభుత్వ నిర్ణయంకోసం వైద్య విద్యార్థులు ఎదురు చూస్తున్నారు.

First Published:  20 March 2022 8:38 PM GMT
Next Story