Telugu Global
National

కశ్మీర్ విద్యార్థులపై దాడులు జరిగితే బాధ్యత ఎవరిది..? కశ్మీర్ ఫైల్స్ సినిమాపై దుమారం..

కశ్మీర్ ఫైల్స్ సినిమా ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు మద్దతుగా హిందూత్వ వాదులంతా సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. దీంతో సినిమాపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఇప్పుడు కశ్మీర్ ఫైల్స్ సినిమాపై నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా తీవ్ర విమర్శలు చేశారు. సినిమా అంతా తప్పుల తడక అంటూ ఆరోపించారు. ఈ సినిమా కారణంగా కశ్మీర్ లోని ముస్లింలపై వ్యతిరేక భావం పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన […]

కశ్మీర్ విద్యార్థులపై దాడులు జరిగితే బాధ్యత ఎవరిది..? కశ్మీర్ ఫైల్స్ సినిమాపై దుమారం..
X

కశ్మీర్ ఫైల్స్ సినిమా ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు మద్దతుగా హిందూత్వ వాదులంతా సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. దీంతో సినిమాపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఇప్పుడు కశ్మీర్ ఫైల్స్ సినిమాపై నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా తీవ్ర విమర్శలు చేశారు. సినిమా అంతా తప్పుల తడక అంటూ ఆరోపించారు. ఈ సినిమా కారణంగా కశ్మీర్ లోని ముస్లింలపై వ్యతిరేక భావం పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారాయన. దేశవ్యాప్తంగా కశ్మీర్ విద్యార్థులు వివిధ ప్రాంతాల్లో చదువుకుంటున్నారని, వారిపై దాడులు జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ఒమర్ అబ్దుల్లా ప్రశ్నిస్తున్నారు.

సినిమా అంతా తప్పుల తడక..
కశ్మీర్ పైల్స్ సినిమాలో కశ్మీరీ పండిట్లపై దాడులు జరిగినట్టు చూపించారు. 1990 ప్రాంతంలో ఈ దాడులు జరిగినట్టు, కశ్మీరీ పండిట్లు ఆ హింసను తట్టుకోలేక వలస బాట పట్టినట్టు సినిమాలో ఉంది. ఆ సమయంలో అక్కడ నేషనల్ కాన్ఫరెన్స్ అధికారంలో ఉన్నట్టు సినిమాలో చూపించారని, కానీ అది పచ్చి అబ్ధమని అంటున్నారు ఒమర్ అబ్దుల్లా. 1990లో కశ్మీర్ గవర్నర్ పాలనలో ఉందని, కేంద్రంలో బీజేపీ మద్దతుతో వీపీసింగ్ ప్రధానిగా ఉన్నారని ఆయన గుర్తు చేశారు. కానీ తప్పంతా తమ పార్టీపై నెట్టివేసే ప్రయత్నం జరిగిందని ఆయన ఆరోపించారు.

1990లో జరిగిన ఘటనలపై సాధారణ కాశ్మీరీలు ఎవరూ సంతోషంగా లేరని చెబుతున్నారు ఒమర్ అబ్దుల్లా. దిల్ కి ఢిల్లీకి మధ్య దూరం ఉందని గతంలో ప్రధాని నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యల్ని కూడా ఆయన గుర్తు చేశారు. ఆ దూరం తగ్గించే ప్రయత్నం జరగడంలేదని, కానీ ప్రపంచ వ్యాప్తంగా కశ్మీర్ ని చెడ్డచేసే ప్రయత్నం జరుగుతోందని మండిపడ్డారు. మొత్తమ్మీద కశ్మీర్ ఫైల్స్ సినిమాతో మరోసారి పెద్ద దుమారం చెలరేగింది. బీజేపీ అభిమానులంతా ఈ సినిమాని సమర్థిస్తున్నారు. కానీ ఒమర్ అబ్దుల్లా వంటి నేతలు మాత్రం.. సినిమాని ఏకపక్షంగా తీశారని, కశ్మీర్ ముస్లింలను దోషులుగా చిత్రీకరించారని మండిపడుతున్నారు.

First Published:  19 March 2022 12:35 AM GMT
Next Story