Telugu Global
Cinema & Entertainment

రాజ్ తరుణ్ సినిమాకు వీక్ కలెక్షన్

రాజ్ తరుణ్ హీరోగా నటించిన సినిమా స్డాండప్ రాహుల్. నిన్న రిలీజైన ఈ సినిమాకు మొదటి రోజు మొదటి ఆటకే నెగెటివ్ టాక్ వచ్చేసింది. దీనికి తోడు రాజ్ తరుణ్ కు సరైన సక్సెస్ లేకపోవడంతో.. స్డాండప్ రాహుల్ కు ఓపెనింగ్స్ కూడా రాలేదు. అలా ఓ మోస్తరు అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు మొదటి రోజు 22 లక్షల రూపాయల షేర్ మాత్రమే వచ్చినట్టు తెలుస్తోంది. ఈ సినిమా కంటే ముందు అనుభవించు రాజా […]

రాజ్ తరుణ్ సినిమాకు వీక్ కలెక్షన్
X

రాజ్ తరుణ్ హీరోగా నటించిన సినిమా స్డాండప్ రాహుల్. నిన్న రిలీజైన ఈ సినిమాకు మొదటి రోజు మొదటి ఆటకే నెగెటివ్ టాక్ వచ్చేసింది. దీనికి తోడు రాజ్ తరుణ్ కు సరైన సక్సెస్ లేకపోవడంతో.. స్డాండప్ రాహుల్ కు ఓపెనింగ్స్ కూడా రాలేదు. అలా ఓ మోస్తరు అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు మొదటి రోజు 22 లక్షల రూపాయల షేర్ మాత్రమే వచ్చినట్టు తెలుస్తోంది.

ఈ సినిమా కంటే ముందు అనుభవించు రాజా అనే సినిమా చేశాడు రాజ్ తరుణ్. ఆ సినిమాకు ఓ మోస్తరుగా ఓపెనింగ్స్ వచ్చాయి. తాజా చిత్రానికి కనీసం ఆ స్థాయి వసూళ్లు కూడా రాకపోవడం బాధాకరం. ఈరోజు, రేపు ఈ సినిమాకు ఎంత కలెక్షన్ వస్తుందనేది కీలకంగా మారింది. ఈ 2 రోజులు వచ్చే వసూళ్లే ఈ సినిమాకు ఫైనల్ అనుకోవాలి. ఎందుకంటే నెగెటివ్ టాక్ ఆ రేంజ్ లో ఉంది మరి

ఇక ఈ సినిమాకు ఉన్న టైమ్ కూడా ఈ వారమే. వచ్చే శుక్రవారానికి ఆర్ఆర్ఆర్ వచ్చేస్తోంది. అప్పుడిక స్టాండప్ రాహుల్ సినిమానే కాదు, రాధేశ్యామ్ ను కూడా చాలా థియేటర్ల నుంచి లేపేస్తారు. సో.. రాజ్ తరుణ్ సినిమాకు ఈ రెండు రోజుల్లోనే వసూళ్లు రావాల్సి ఉంటుంది. సోమవారం నుంచి ఎలాగూ బాక్సాఫీస్ డల్ ఉంటుంది కాబట్టి.. గురువారంతో ఈ సినిమా రన్ క్లోజ్ అయిపోతుంది.

First Published:  19 March 2022 10:05 AM GMT
Next Story