Telugu Global
International

హ్యాపీయెస్ట్ కంట్రీ ఫిన్లాండ్.. భారత్ ర్యాంక్ ఎంతంటే..?

ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశంగా ఫిన్లాండ్ ఎంపికైంది. వరుసగా ఐదోసారి ఫిన్లాండ్ ఈ ఘనత సాధించడం విశేషం. దేశ ఆర్థిక పరిస్థితి, పౌరుల జీవన స్థితిగతులు, జీడీపీ, పౌరుల స్వేచ్ఛ.. ఇతరత్రా వ్యవహారాలపై ఐక్యరాజ్యసమితి సహకారంతో ఈ సర్వే చేపడతారు. తాజాగా విడుదలైన సర్వే ఫలితాల్లో ఫిన్లాండ్ మరోసారి తన స్థానాన్ని నిలబెట్టుకుంది. రెండో స్థానంలో డెన్మార్క్, మూడో స్థానంలో ఐస్ ల్యాండ్, నాలుగో స్థానంలో స్విట్జర్లాండ్, ఐదో స్థానంలో నెదర్లాండ్స్ ఉన్నాయి. భారత్ స్థానం ఎక్కడ..? […]

హ్యాపీయెస్ట్ కంట్రీ ఫిన్లాండ్.. భారత్ ర్యాంక్ ఎంతంటే..?
X

ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశంగా ఫిన్లాండ్ ఎంపికైంది. వరుసగా ఐదోసారి ఫిన్లాండ్ ఈ ఘనత సాధించడం విశేషం. దేశ ఆర్థిక పరిస్థితి, పౌరుల జీవన స్థితిగతులు, జీడీపీ, పౌరుల స్వేచ్ఛ.. ఇతరత్రా వ్యవహారాలపై ఐక్యరాజ్యసమితి సహకారంతో ఈ సర్వే చేపడతారు. తాజాగా విడుదలైన సర్వే ఫలితాల్లో ఫిన్లాండ్ మరోసారి తన స్థానాన్ని నిలబెట్టుకుంది. రెండో స్థానంలో డెన్మార్క్, మూడో స్థానంలో ఐస్ ల్యాండ్, నాలుగో స్థానంలో స్విట్జర్లాండ్, ఐదో స్థానంలో నెదర్లాండ్స్ ఉన్నాయి.

భారత్ స్థానం ఎక్కడ..?
146 దేశాలకు ర్యాంకులు ఇవ్వగా.. భారత్ 136వ స్థానంలో ఉండటం విశేషం. అంతకంటే విచిత్రం ఏంటంటే.. పాకిస్తాన్ మనకంటే మెరుగైన స్థానంలో ఉండటం. హ్యాపీయెస్ట్ కంట్రీస్ లిస్ట్ లో పాక్ ర్యాంక్ 121. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలు కాకముందు ఈ సర్వే పూర్తయింది. తొలిసారిగా సోషల్ మీడియా ద్వారా కూడా కొంత సమాచారాన్ని సర్వేకోసం సేకరించారు. బల్గేరియా, రొమేనియా, సెర్బియా.. తమ ర్యాంకుల్ని మెరుగు పరచుకుని సంతోషకరమైన దేశాల లిస్ట్ లో పైకి ఎగబాకాయి. ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్న లెబనాన్.. కూడా ఈ లిస్ట్ లో 145వ స్థానానికి పడిపోయింది. తాలిబన్ల పాలనలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ ది చిట్ట చివరి ర్యాంక్. అంటే ప్రపంచంలో ఆఫ్ఘనిస్తాన్ అన్ హ్యాహీయెస్ట్ కంట్రీ అనమాట. పౌరుల జీవన పరిస్థితి అక్కడ దుర్భరం.

అమెరికా సంతోషకరమైన దేశం కాదా..?
వాస్తవానికి భారతీయుల విదేశీ కల ఎక్కువగా అమెరికా చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మరి అమెరికా సంతోషకరమైన దేశం కాదా..? అక్కడ ప్రజలు సంతోషంగా లేరా..? అంటే దానికి భిన్నమైన జవాబులు వస్తుంటాయి. సర్వేలో మాత్రం అమెరికా 16వ స్థానంలో ఉండగా.. యునైడెట్ కింగ్డమ్ 17వ స్థానంతో సరిపెట్టుకుంది. అంటే ప్రపంచంలో బలీయమైన శక్తులుగా ఉన్న అమెరికా, యూకే కంటే సంతోషకరమైన దేశాలు ఇంకా 15 ఉన్నాయనమాట.

First Published:  19 March 2022 12:50 AM GMT
Next Story